Andhra Pradesh: నారా లోకేష్ పై క్రిమినల్ కేసు.. ఆ ట్వీటే కారణం..

నారా లోకేష్ (ఫైల్)

టీడీపీ నేతల కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదవుతుండటం చర్చనీయాంశమవుతోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారంటూ అనంతపురం జిల్లా డి.హిరేహాళ్ పోలీస్ స్టేషన్లో క్రమినల్ కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘటనపై ఎలాంటి ఎలాంటి సంబంధం లేనప్పటికీ రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై ట్విట్టర్ ద్వారా అసత్య ప్రచారం చేశారని, అంతేకాకుండా ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసి గౌరవానికి భంగం కలిగించారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రజల్లో ఎమ్మల్యేపై వ్యతిరేకత, ద్వేషం కలిగించేలా కుట్రచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఫిర్యాదు మేరకు లోకేష్ పై క్రైమ్ నెంబర్.111/2021 అండర్ సెక్షన్ ఐ.పి.సి 153(A),505 and 506 గా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    అసలేం జరగింది.?
    గత నెల 21వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన టీడీపీ కార్యకర్త మారుతీపై కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా రాంపురం గ్రామం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఘటనలో మారుతికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నారా లోకేష్.. ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నందునే మారుతిపై కక్ష గట్టారని ఆరోపించారు. మారుతికి చెందిన బేకరీని మూసివేయించడంలో విఫలమై అతడిపై దాడి చేయించారంటూ లోకేష్ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


    ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ వేరియంటే పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కర్నూలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారంటూ సుబ్బయ్య అనే వ్యక్తి కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 155, 505(1) (బి) (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

    ఇది చదవండి: అక్కడ సైకిల్ తొక్కే నేతలే లేరా..? తమ్ముళ్ల గోడు వినేదెవరు..?


    అంతకుముందు కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్-440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు పలుసార్లు వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని అన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. జూమ్ ద్వారా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు.. ఈ విషయంలో ఆవేదనతోనే మాట్లాడతున్నామని వ్యాఖ్యానించారు. బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదని ఏపీ ప్రభుత్వం చెప్పడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని చంద్రబాబు అన్నారు.

    ఇది చదవండి: కడప పేలుడులో పెరిగిన మృతులు.. స్పందించిన సీఎం జగన్

    Published by:Purna Chandra
    First published: