Home /News /andhra-pradesh /

CBN on Floods: ఏపీ ప్రభుత్వంపై న్యాయవిచారణకు డిమాండ్.. అవన్నీ ప్రభుత్వ హత్యేలనన్న బాబు

CBN on Floods: ఏపీ ప్రభుత్వంపై న్యాయవిచారణకు డిమాండ్.. అవన్నీ ప్రభుత్వ హత్యేలనన్న బాబు

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాయలసీమలో భారీ వరదలు (AP Floods) సంభవించాని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ఆరోపించారు. వరద మృతులన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాయలసీమలో భారీ వరదలు (AP Floods) సంభవించాని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ఆరోపించారు. వరద మృతులన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. భారీ వర్షాలు కురుస్తాయని తెలిసినా ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని.. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదని ఆయన ప్రశ్నించారు. లక్ష్మీపురం సర్కిల్ లో వరదనీటిలో కొట్టుకుపోయిన సుబ్బారావు డెడ్ బాడీ ఇప్పటి వరకు దొరకలేదని.., భర్త నీటిలో కొట్టుకుపోవడంతో భార్య అనారోగ్యానికి గురైందని ఇప్పుడు వారికి దిక్కెవరని నిలదీశారు.

  కడప జిల్లాలో ఆరుగ్రామాలు ఇప్పటికీ వరనీటిలోనే ఉన్నాయని మండిపడ్డ చంద్రబాబు.., రాయలచెరువు ప్రాంత ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారన్నారు. తిరుపతిలో పర్యటిస్తున్నానని హడావిడిగా కొన్ని ప్రాంతాల్లో వరదనీటిని శుభ్రం చేశారని పేర్కొన్నారు. వరద బాధితుల ఆర్తనాదాలు అసెంబ్లీలో జగన్ కు ఆనందం కలిగిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వరద విషయంలో మానవ తప్పిదంపై జ్యుడిషనల్ విచారణ జరిపించి.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తుమ్మలగుంట చెరువు కబ్జాపైనా విచారణకు చంద్రబాబు డిమాండ్ చేశారు.

  ఇది చదవండి: ఏపీకి భారీ వర్షసూచన.. 10 రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే..!


  వరద బాధితులను చూసి ఆవేదన చెందామని.., ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 40వేల మందిని ఆదుకున్నామని ఆయన వివరించారు. నిరాశ్రయులకు అవసరమైన భోజన సదుపాయాలను కల్పించామన్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

  ఇది చదవండి: RRR, భీమ్లానాయక్ కు జగన్ సర్కార్ షాక్.., పెద్ద సినిమాలకు నష్టాలు తప్పవా..?


  అవన్నీ ప్రభుత్వ హత్యలే..!
  వరదల్లో చనిపోయిన 60 మందివి హత్యలే.., వారికి ఒక్కో కుటుంబానికి పాతిక లక్షలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వరి, చెరుకు, పత్తి, వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, మామిడిలకు పరిహారం పెంచాలన్నారు. తిరుమలలో వరద నివారించేందుకు కపిలతీర్థం నుంచి కొండపక్కనే కాలువ తీయాలని.. కపిలతీర్థం నీరు స్వర్ణముఖినదిలోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి చంద్రబాబు డిమాండ్ చేశారు.

  ఇది చదవండి: మూడు రాజధానులపై వెనక్కి తగ్గడానికి కారణాలేంటి..? సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..?


  అవసరాని ఖర్చు చేయండి..!
  ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడానికి, తీయడానికి 6వేల కోట్ల రూపాయలు అనవసర ఖర్చు చేశారన్న చంద్రబాబు.. అనవసర ఖర్చులు చేస్తూ అవసరమైన వాటికి ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను సక్రమంగా ఖర్చు పెట్టాలని హితవు పలికారు. వరదల్లో 62మంది చనిపోయారని... మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశముందని ఈసారైనా ముందుగానే అప్రమత్తం కావాల్సిన అవసరముందన్నారు.

  ఇది చదవండి: గ్రామ సచివాలయ ఉద్యోగుల వింత పరిస్థితి.. పెళ్లికి ప్రొబేషన్ కు లింక్..! అదెలాగంటే..!

  ఆదుకోకుంటే పోరాటమే..!
  వరద బాధితులను ఆదుకోవడానికి, రాయలచెరువుకు పరిశీలకు వెళ్తే కేసులు పెడతారా అని బాబు ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోకుంటే పోరాటం చేస్తామని.., త్వరలో వరద భీభత్సంపై ఎపి సిఎస్ కు లేఖ రాస్తానన్నారు. కడపలో వరద భీభత్సం సృష్టిస్తే అసెంబ్లీ పెట్టుకుంటారా..? వరద నీటిలో దిగి సీఎం ఎందుకు పరామర్సించలేదు..? వరద నీటిలో కొట్టుకుపోయిన సుబ్బారావు కుటుంబానికి ఏం సమాధానం చెబుతారు..? అని చంద్రబాబు ప్రశ్నించారు. తిత్లీ, హుద్ హుద్ తుఫాన్ సమయంలో బాధితులను అప్పటి టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందని ఆయన గుర్తు చేశారు.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Floods, Chandrababu naidu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు