తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) కుప్పం పర్యటనలో కలకలం రేగింది. కుప్పంలో బహిరంగ సభ నిర్వహిస్తుండా ఓ వ్యక్తి బాంబు తెచ్చాడంటూ టీడీపీ కార్యకర్తలు అతడ్ని పట్టుకున్నారు. వెంటనే పోలీసులు అదుపోలకి తీసుకొని తనిఖీ చేయగా అతడివద్ద రాళ్లు లభ్యమయ్యాయి. దీంతో చంద్రబాబు సభలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు భద్రతాసిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ ఆయనకు రక్షణగా నిలబడ్డారు. రాళ్లు తెచ్చిన వ్యక్తిపై దాడి చేసేందు కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ చేతగాని పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జగన్ కుప్పం వస్తావా..? తిరుపతి వస్తావా..? లేకుండా జెరూసలేంకు వస్తావా..? అంటూ ఛాలెంజ్ చేశారు.
తాను బాంబులకు భయపడే వ్యక్తిని కాదన్న చంద్రబాబు.., అక్రమ కేసులకు భయపడి పార్టీని మూసేయాలని అని చంద్రబాబు ప్రశ్నించారు. సభ్యత, సంస్కారం ఉన్న వ్యక్తినని.. తమ పార్టీ నేతలు సభ్యతతో విమర్శలు చేస్తుంటే వైసిపి నాయకులు రెచ్చిపోతున్నారన్నారు. పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని.., పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారనడానికి టీడీపీ కార్యాలయాలపై దాడులే ఉదాహరణ అన్నారు.
పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేని చేతకాని పాలన ఏపీలో ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏపీలో నిత్యావసరాలు పెరుగుతుంటే ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్నారు. అసెంబ్లీలో తనను అనరాని మాటలన్నారని.., ఏపీ కేబినెట్లో బూతుల మంత్రి, బెట్టింగ్ మంత్రులున్నారున్నారు. ఒకటి, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన వారు కూడా నన్ను విమర్సించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. చెత్తపై పన్ను వేసిన ఘనత జగన్ దేనన్నారు. ఇంటి పన్నును త్వరలో 10రెట్లు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు తెలిపారు.
కుప్పంలో రౌడీలు, గూండాలు ప్రవేశించారని చంద్రబాబు విమర్శించారు. “బాబాయిని చంపినోడు భయపడాలిగానీ.. మనమెందుకు భయపడతాం. కోడికత్తికేసు ఏమైంది. తప్పుడు ప్రచారం వాళ్లు చేసుకున్నారు.. మనం కాదు. టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రాగానే కమిషన్ వేస్తాం. తప్పుచేసిన వారిని శిక్షించేవరకు వదిలిపెట్టను. న్యాయంకి తలొగ్గుతాం.. దుర్మార్గానికి గుండె చూపుతాం” అని హెచ్చరించారు.
రాష్ట్రంలో వింత వింత మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారని.. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం హామీ ఇచ్చిన సీఎం.. కరోనా సమయంలోనూ వైన్ షాపులు తెరచారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తకొత్త మద్యం బ్రాండ్లు తీసుకురావడమే కాకుండా.. రేట్లు కూడా విపరీతంగా పెంచేశారని చంద్రబాబు మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kuppam, TDP