Home /News /andhra-pradesh /

TIRUPATI SVIMS HOSPITAL GET OXYGEN IN LAST MINUTE WITH ALERTNESS OF HIGHER OFFICIALS IN TIRUPATI ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Andhra Pradesh: కాస్త లేటైనా రుయా ఘటన రిపీట్ అయ్యేదే..! చివరి నిముషంలో అందిన ఆక్సిజన్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరొకటి జరిగేది. ఐతే అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.

  తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాణవాయువు ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. దింతో జిల్లాలోని అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో కరోనా రోగులకు చికిత్స అందిస్తోంది. రుయా ఘటనతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.., వైద్య బృందానికి ప్రత్యేక సూచనలు జారీ చేస్తున్నారు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ. ప్రస్తుతం స్విమ్స్ 145 ఐసీయూ, 328 ఆక్సిజన్ పడ కలు, 40 వెంటిలేటర్ల ద్వారా కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ 24 కేఎల్ నిల్వ సామర్థ్యం కలిగిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. ప్రతి రోజూ బాధితులకు సుమారు 14 కేఎల్ ప్రాణవాయువు అవసరమని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎప్పటిక ప్పుడు పరిస్థితులను సమీక్షించి ఆక్సిజన్ తెప్పించుకుంటున్నారు స్విమ్స్ అధికారులు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్విమ్స్ ప్లాంటులో ఆక్సిజన్ తగ్గుతున్న విషయాన్ని గుర్తించిన వైద్యులు వెంటనే సరఫరా సంస్థకు సమాచారం అందించారు.

  అయితే బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్ పంపుతామని ఆ సంస్థ స్పష్టం చేసింది. మధ్యాహ్నం 1గంట వరకు ఆక్సిజన్ నిల్వలు సరిపోతాయని భావించారు అధికారులు. కానీ కొంత ఆలస్యం అయిన కోవిడ్ బాధితులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. నిమిషం పాటు ఆలస్యమైనా.... ఏం జరుగుతుందో రుయా ఘటనలో చూసిన వైద్యులు అప్రమత్తమయ్యారు. ఉదయం 4 గంటల సమయంలో పరిస్థితిని సమీక్షించిన స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినా రాయణన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనేస్పందించిన కలెక్టర్ ఏర్పేడులో పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ సరఫరా చేసే శ్రీకృష్ణ ఇండస్ట్రియల్ గ్యాసెస్ సంస్థ నుంచి ప్రాణవాయువును తెప్పించే ప్రయత్నం చేసారు.

  ఇది చదవండి: ఏపీలో ‘‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’... యువ ఎంపీ వినూత్న ఆలోచన


  ఇక ఇదే విషయంపై తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా తగ్గిన ఆక్సిజన్ నిల్వలు తగ్గాయని, ఏర్పేడు వద్ద గల శ్రీకృష్ణ ఇండ్రస్ట్రీస్ నుంచి ఆక్సిజన్ త్వరగా స్విమ్స్ కు చేరుకునేలా చర్యలు చేపట్టాలని ఎస్పీని స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ కోరారు. ఏర్పేడు రుయా మార్గంలో ఎస్పీ వెంకట అప్పల నాయుడు ఆదేశాలతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ తో ట్రాఫిక్ లేకుండా పోలీస్ వాహనాల్తో ఆక్సిజన్ స్విమ్స్ కి తరలించేలా ఏర్పాటు చేసారు.

  ఇది చదవండి: ఏపీలో పదోతరగతి పరీక్షలు వద్దు... అందర్నీ పాస్ చేయాల్సిందే.. లోకేష్ డిమాండ్..


  ఎలాంటి అంతరాయం లేకుండా ముందుగానే ట్రాఫిక్ క్లీయరెన్స్ చేపట్టారు. అనుకున్న విధంగా అన్ని ప్లాన్ లను అమలు చేసి 25నిమిషాల్లో ఏర్పేడు నుంచి స్వీమ్స్ కు ట్యాంకర్ ను తరలించారు. ఆక్సిజన్ ను స్టోరేజ్ ట్యాంక్ లో నింపడటంతో జిల్లా కలెక్టర్ హరినారాయనాన్, ఎస్పీ వెంటక అప్పల నాయుడు, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మతో పాటుగా హాస్పిటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. స్విమ్స్ సిబ్బంది అప్రమత్తతే ప్రాణాలు కాపాడిందన్నారు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ.

  అయితే ఆక్సిజన్ను నిల్వ చేసుకునేందుకు వీలుగా స్విమ్స్ కు కొత్తగా 10కేఎల్ ట్యాంకును శ్రీసిటీ ఉచితంగా అందజే సింది. అయితే స్విమ్స్ నిత్యం ప్రాణవాయువును సర ఫరా చేసే సంస్థ అదనంగా పంపేందుకు సుముఖంగా లేదు. ఇతర ప్రాంతాల్లోని వారితో సంప్రదిస్తున్నా ఆక్సిజన్ లభించని పరిస్థితి. ఈ విషయాన్ని స్విమ్స్ అధికారులు ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Oxygen, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు