Home /News /andhra-pradesh /

AP Floods Effect: "జగన్ మామా మమ్మల్ని ఆదుకోండి.." ఈ చిన్నారులకు వచ్చిన కష్టమేంటో తెలుసా..?

AP Floods Effect: "జగన్ మామా మమ్మల్ని ఆదుకోండి.." ఈ చిన్నారులకు వచ్చిన కష్టమేంటో తెలుసా..?

వంతెన కట్టించాలని సీఎం జగన్ ను కోరుతున్న విద్యార్థినులు

వంతెన కట్టించాలని సీఎం జగన్ ను కోరుతున్న విద్యార్థినులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాయలసీమ జిల్లాలకు వచ్చిన వరదలు (AP Floods) పెద్ద విలయాన్నే సృష్టించాయి. చిన్నచిన్న ఇళ్లతో పాటు భారీ వంతెనలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. అలాగే చిన్న చిన్న రోడ్ల నుంచి హైవేల వరకు తుడిచిపెట్టుకుపోయాయి. ఇళ్లు కొట్టుకుపోవడంతో వేలాది మంది రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupathi, News18

  ప్రకృతి ప్రకోపానికి ఏదైనా తలవంచాల్సిందే..! జల ప్రళయం వస్తే చిన్నా, పెద్దా భవనాలు, బ్రిడ్జిలు, నిర్మాణాలన్నీ కుప్పకూలే అవకాశాలు ఎక్కువ. ఇక నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండే నిర్మాణాలు దెబ్బతినడం ఖాయం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాయలసీమ జిల్లాలకు వచ్చిన వరదలు (AP Floods) పెద్ద విలయాన్నే సృష్టించాయి. చిన్నచిన్న ఇళ్లతో పాటు భారీ వంతెనలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. అలాగే చిన్న చిన్న రోడ్ల నుంచి హైవేల వరకు తుడిచిపెట్టుకుపోయాయి. ఇళ్లు కొట్టుకుపోవడంతో వేలాది మంది రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. అలాగే రోడ్లు, వంతెనలను నదీ ప్రవాహం తీసుకెళ్లిపోయింది. దీంతో రోజువారీ పనులు, ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. కొందరు ప్రమాదకర పరిస్థితుల్లో స్కూళ్లకు, కూలిపనులు, ఇతర పనుల నిమిత్తం నదులు, ప్రమాదకరమైన ప్రవాహాలు దాటాల్సి వస్తోంది.

  ఇటీవల వచ్చిన వరదలకు కడప జిల్లా (Kadapa District) లో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో పదికి పైగా గ్రామాలు ధ్వంసమయ్యాయి. అలేగా పాపాగ్ని నది ఉధృతికి వంతెన కుంగిపోయిన పరిస్థితి. ఇక చిన్నచిన్న చెక్ డ్యాములు, కాలవగట్లు తెగిపోయి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద తగ్గుముఖం పట్టినా అది మిగిల్చిన విధ్వంసం మాత్రం అలాగే ఉంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని ఓ గ్రామంలోని విద్యార్థులు మాత్రం జగన్ మామ తమ సమస్య తీర్చాలని సీఎం జగన్ వేడుకుంటున్నారు.

  ఇది చదవండి: వరద మిగిల్చిన కన్నీటి గాధ.. చెట్ల కిందే బతుకీడుస్తున్న బాధితులు


  వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజు పేట పంచాయితీ నుంచి రామయ్య పాలెం వెళ్లే బ్రిడ్జి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అయితే ఇదే దారిలో రోజూ 50 మందికిపైగా విద్యార్ధులు ప్రతి రోజూ స్కూలుకు వెళ్తుంటారు. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో విద్యార్థులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వంకనుదాటి స్కూలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

  ఇది చదవండి: తిరుపతిలో మరో షాకింగ్ ఘటన... పరుగులు పెడుతున్న జనం.. అసలేం జరుగుతోంది..?


  దినదిన గంటంగా వాగును దాటుతున్న విద్యార్థులు జగన్ మామ తమ బ్రిడ్జి నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. పిల్లలు వాగును దాటేసమయంలో ఉధృతి పెరిగితే ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదముందని స్థానికులంటున్నారు. విద్యార్థులే కాదు గ్రామంలో ఇతర పనులకు వెళ్లేవారు, వ్యవసాయ కూలీలకు ఈ వంతెనే దిక్కు. సీఎం జగన్ వెంటనే స్పందించి వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

  ఇది చదవండి: ఏపీలో దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. వారం రోజుల్లో సీన్ రివర్స్.. కిలో ఎంతంటే..!


  ఇదిలా ఉంటే కడప జిల్లాలో వరదల ధాటికి ఇప్పటికీ చాలా గ్రామాలు తేరుకోలేదు. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలు నాశనమయ్యాయి. ఇళ్లు కూలిపోవడంతో వందలాది మంది ఇంకా చెట్లకిందనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా కొందరు మాత్రం గ్రామాలకే పరిమితమై తమ ఇళ్ల వంక దీనంగా చూస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Floods, Kadapa

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు