Andhra Pradesh: సహజీవనం చేస్తున్న వ్యక్తే తండ్రి అని కూతుర్ని నమ్మించిన తల్లి.. కానీ అతడు మాత్రం ఆమెను అలా చూడలేదు..

ప్రతీకాత్మక చిత్రం

భర్తను కోల్పోయిన ఓ మహిళ.. సమీప బంధువుతో సహజీవనం చేస్తోంది. ఆమెకు జన్మించిన పిల్లలు కూడా అతడితోనే ఉంటున్నారు. అతడ్నే తండ్రిగా నమ్మించిది. కానీ అతడు మాత్రం..

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  సహజీవనం... ఈ కాలంలో సాధారణంగా మారిపోయింది. పెళ్లి కానీ వారి నుంచి పెళ్ళై విడాకులు తీసుకున్న వారు, భాగస్వాములు చనిపోయిన వారు జీవితంలో తోడుకావాలి అనే సాకుతో సహజీవనం అనే కాన్సెప్ట్ ను వాడుకుంటున్నారు. పెళ్లి కానివారి కథ పక్కన పెడితే.... పెళ్ళై విడాకులు తీసుకున్నవారు, భర్త లేద భార్య చనిపోయి… పిల్లలున్నవారు వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుంటే పరిణామాలు వేరుగా ఉంటున్నాయి. భర్తను కోల్పోయిన ఓ మహిళ.. సమీప బంధువుతో సహజీవనం చేస్తోంది. ఆమెకు జన్మించిన పిల్లలు కూడా అతడితోనే ఉంటున్నారు. ఐతే తల్లితో సహజీవనం చేస్తూ ఆమె పిల్లలకు తండ్రిలా ఉండాల్సిన వాడు కట్టుతప్పాడు. కన్నకూతురిలా చూడాల్సిన బాలికను వక్రబుద్ధితో చూశాడు. అభం శుభం తెలియని బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు నెలలుగా ఆమెకు నరకం చూపిస్తున్నాడు. ఇది తెలిసి అతడ్ని మందలించాల్సిన తల్లి కూడా మిన్నకుండిపోయింది. దీంతో ఆ బాలిక వేదన అరణ్యరోదనలా మారింది. చివరకి తన అక్కపై జరుగుతున్న అకృత్యాన్ని బాలిక తమ్ముడు వెలుగులోకి తీసుకురావడంతో ఆ కీచకుడికి ఆగడాలకు అడ్డుకట్టపడింది.

  వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో సమీప బంధువైన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే పిల్లలకు తండ్రిగా వారిని నమ్మించింది. దీంతో ఆ చిన్నారులను తండ్రిలా లాలించాల్సిన వాడు.. ఆమె 14 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను బెదిరిస్తూ గత ఆరు నెలలుగా తన కామ వాంఛను తీర్చుకుంటున్నాడు.

  ఇది చదవండి: ఫేస్ బుక్ లో లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిన యువతి… ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే...


  అమ్మా.. నాన్న ఇలా చేస్తున్నాడని ఆ బాలిక తల్లితో చెప్పుకుంది. కానీ ఒంటరిగా ఉన్న తనకు తోడున్నాడని భావించి ఆమె ఆ కీచకుడు చేస్తున్న అకృత్యాలను చూసీచూడనట్లు వదిలేసింది. దీంతో అతడు మరింత రెచ్చిపోయాడు. ప్రతి రోజూ బాలికకు నరకచం చూపించడం మొదలుపెట్టారు. ఆ చిన్నారి తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలిపోయేది. వారం క్రితం బాలికకు తీవ్రంగా కడుపు నొప్పిరావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించి తీసుకొచ్చారు. బాలిక అనారోగ్యంగా ఉన్నా కూడా మారుతండ్రి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

  ఇది చదవండి: కరోనా భయంతో ఏడాదిన్నరగా ఇంటికే పరిమితం.. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే..


  బాలికపై అత్యాచారం చేయడాన్ని కళ్లారా చూసిన ఆమె తమ్ముడు జరిగిన విషయాన్ని స్థానిక వార్డు సచివాలయంలోని మహిళా కార్యదర్శి కి చెప్పాడు. దీంతో వారు పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చి బాలిక నివాసానికి వెళ్లారు. ఐతే ఆ మృగాడు ఆ బాలికనే కాకుండా చుట్టుపక్కల ఉండే చిన్నారులను కూడా లైంగిక వేధించేవాడని విచారణలో వెల్లడైంది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

  ఇది చదవండి: తెలిసిన వ్యక్తేకదా అని ఇంటికి వెళ్లింది.. కానీ అతడు అలా చేస్తాడని అస్సలు ఊహించలేకపోయింది..

  Published by:Purna Chandra
  First published: