• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • TIRUPATI SPECULATIONS OVER TIRUMALA TIRUPATI DEVASTHANAM NEW BOARD CHAIRMAN POST IN ANDHRA PRADESH POLITICS FULL DETAILS HERE PRN TPT

TTD Chairman: టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని కొనసాగిస్తారా..? సీఎం జగన్ మనసులో ఏముంది..?

ప్రతీకాత్మకచిత్రం

రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పదవుల్లో టీటీడీ ఛైర్మన్ (TTD Chairman) పదవి ఒకటి. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు జరిగేవి.

  • Share this:
    GT Hemanth Kumar, Tirupathi Correspondent, News18

    ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వివాద రహిత పాలకమండలిగా పేరు తెచ్చుకుంది. 2019 జూన్ 22వ తేదీ పాలకమండలి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన ప్రభుత్వం అయన పదవీకాలం ఎన్నాళ్ళో తెలుపలేదు. సార్వత్రిక ఎన్నికలో టీడీపీ నుంచి మాగుంట వైసీపీలోకి చేరారు. దీంతో తన సీటును మాగుంటకు కేటాయించాల్సి వచ్చింది వైవీ సుబ్బారెడ్డి. ఎంతో కీలకమైన టీటీడీ చైర్మన్ పదవిని బాబాయికి అప్పగించారు. అయితే సాధారణంగా టీటీడీ చైర్మన్ గా ఏడాది నుంచి రెండేళ్ల కాలం వరకు పదవి బాధ్యతలు అప్పగిస్తారు. ప్రభుత్వానికి. నచ్చితే అదే పాలకమండలిని మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది. అయితే పాలకమండలి గడువు ముగిసిన ప్రభుత్వం పొడిగింపు పై ఎలాంటి జీవో గాని, నూతన పాలకమండలిపై కసరత్తు చేస్తున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అసలు టీటీడీ పాలకమండలి కొనసాగిస్తారా..? లేక నూతన పాలకమండలి ఏర్పాటు చేస్తారా..? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    టీటీడీ పాలకమండలి సభ్యుల నుంచి చైర్మన్ పదవి వరకు ఉన్న డిమాండే వేరు. పాలకమండలి సభ్యుల నియామకం కోసం ఢిల్లీ నుంచి పైరవీలు చేయించుకొని పదవులు పొందినవారున్నారు. ఇంత డిమాండ్ ఉన్న పదవులకు గుర్తింపు కూడా అదే స్థాయిలో ఉంటుంది. రాజకీయ నాయకులు ఒక్కసారి టీటీడీ చైర్మన్ పీఠం ఎక్కితే... దిగేందుకు అసలు ఆసక్తి చూపరు. కానీ టీటీడీ చైర్మన్ పదవి మాకే ఇవ్వాలని కొందరు ఆశావహులు సీఎం జగన్ ను ఇప్పటికే కలసి పైరవీరలు ప్రారంభించారు.

    ఇది చదవండి: లబ్ధిదారుల ఖాతాల్లో వైఎస్ఆర్ చేయూత నగదు.. సీఎం జగన్ ఏమన్నారంటే..!


    ముఖ్యంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో తన సీటును ఆదాల ప్రభాకర్ రెడ్డికి త్యాగం చేశారు. వయో భారంతో పాటుగా ఒక్కసారైనా టీటీడీ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టి... స్వామివారి సేవ చేసుకోవాలని భావిస్తున్నారట. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండలేని పరిస్థితి కాబట్టి తనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి పాలకమండలి చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. కుల సమీకరణాల ఆధారంగా తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదుగానీ టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ లిస్టులో తిరుపతి ఎమ్మెల్యే భూమన, కడప జిల్లా నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు ఉన్నట్లు సమాచారం.

    ఇది చదవండి: సీఎం జగన్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు... కారణం ఇదే..!


    టీటీడీ చైర్మన్ బాధ్యత్యలు వేరొకరికి అవ్వాలంటే ముందుగా వైవీ సుబ్బారెడ్డికి వేరొక పదవి కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వైవీ సుబ్బారెడ్డి సీఎం ఎలాంటి బాధ్యతలు ఇచ్చిన తాను సిద్ధంగా ఉన్నానని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇప్పటికే స్పష్టం చేసారు. కానీ తనకు రాష్ట్ర మంత్రి పదవి, రాజ్యసభ కోరినట్లు పార్టీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో 4 నెలల్లో మంత్రివర్గ విస్తరణ కానుందనే ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా కీలకమైన మంత్రి పదవి వైవీ సుబ్బారెడ్డికి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని కొనసాగిస్తున్నట్లు సంకేతాలు అందినట్లు అధికారిక వర్గాల్లో చర్చజరుగుతోంది. మరో ఏడాది పాటు వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం పొడుగింపుకు గ్రీన్ సింగ్నల్ అందిందని.., రేపోమాపో జీవో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published: