హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet Changes: సీఎం సొంత జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి..? రేసులో ఉన్నది వీళ్లేనా..!

AP Cabinet Changes: సీఎం సొంత జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి..? రేసులో ఉన్నది వీళ్లేనా..!

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ మార్పులపై (AP Cabinet Changes) చాన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. కేబినెట్లో వందశాతం మార్పులంటాయంటూ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కామెంట్ చేసిన తర్వాత దీనిపై జోరుగా చర్చజరుగుతోంది.

  GT Hemanth Kumar, Tirupati, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ మార్పులపై (AP Cabinet Changes) చాన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. కేబినెట్లో వందశాతం మార్పులంటాయంటూ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కామెంట్ చేసిన తర్వాత దీనిపై జోరుగా చర్చజరుగుతోంది. దీంతో ఏ జిల్లాలో ఏవరికి ఛాన్స్ ఉంటుందనే లెక్కలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓజిల్లాపై అందరి దృష్టి పడింది. అదే కడప జిల్లా (Kadapa District). సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సొంత జిల్లా. ఇతర జిల్లాల్లో మంత్రి పదవి దక్కాలంటే సదరు ఎమ్మెల్యే సీనియర్ అయి ఉండాలి.. లేదంటే గాడ్ పాదర్ అండదండలైనా ఉండాలి. కానీ కడప జిల్లాలో మంత్రి పదవి దక్కాలంటే మాత్రం అలాంటివేమీ పని చేయవు. సీఎం సొంత జిల్లా కావడమే ఇందుకు ప్రధాన కారణం. వైసీపీ అధికారంలోకి రావడంతోనే జిల్లా నుంచి చాలా మంది ఎమ్మెల్యేలే మంత్రి పదవులు ఆశించారు.

  కానీ జిల్లాలో కడప ఎమ్మెల్యే అంజాద్ ఒక్కరే మంత్రి పదవని దక్కించుకొని డిప్యూటీ సీఎం అయ్యారు. మరెవ్వరికి అవకాశం దక్కలేదు. కానీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు చాలా బలంగానే నమ్మారు. కానీ వీరిలో గడికోటకు ప్రభుత్వ చీఫ్ విప్, కొరముట్లకు విప్ తోను సరిపెట్టుకోవల్సి వచ్చింది. దీంతో మంత్రివర్గ విస్తరణ జరిగితే తమకు అవకాశం తప్పక ఉంటుందని ఈ సారి ఆశలు పెంచుకుని ఉన్నారు. అంతేకాకుండా మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో మార్పులు ఉంటాయని మంత్రి బాలినేని చెప్పడం.... ఈ సారి తమకు తప్పక అవకాశం దక్కుతుందనే ధీమాను జిల్లాకు చెందిన ఆశావాహులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: కేబినెట్ బెర్త్ కోసం ఊపందుకున్న లాబీయింగ్.. జిల్లాల వారీగా వినిపిస్తున్న పేర్లు ఇవే..!


  కడప జిల్లా నుంచి కేబినెట్ రేసులో మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఉన్నారు. అయితే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాత్రం జిల్లాలో సీనియర్ కావడం, వయస్సు రిత్యా తనకు ఈ సారి మంత్రి పదవి అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లోను తాను పోటీచేస్తానో లేదోనన్న కారణంగా మంత్రినని అనిపించుకోవాలన్న తన చిరకాలవాంఛ తీర్చాలని కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈయన మొదటి విడతలోనే ఆశించినా.... రాష్ర్ట స్ధాయిలో మంత్రి పదవి కోసం పొటీపడే వారి సంఖ్య అధికంగా ఉండటంతో ఈయనకు మంత్రి పదవి దక్కలేదని సమాచారం. కానీ ఈ సారి చివరి ప్రయత్నంగా తనను మంత్రి పదవి వరిస్తుందన్న గట్టి నమ్మకంతోనే ఉన్నట్లు సమాచారం.

  ఇది చదవండి: రిపీట్ అయితే రియాక్షన్ సీరియస్ గా ఉంటుంది.. టీడీపీకి సజ్జల వార్నింగ్...


  ఇదిలా ఉంటే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మంత్రి పదవిపై ధీమాగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన... వైఎస్ జగన్ ను నమ్ముకొని వైసీపీలో చేరారు. అలాగే సీఎంతో నేరుగా సంబంధాలుండటం, పార్టీ నిర్ణయాల్లోను సీఎంతో చర్చించే స్థాయిలో ఉండటం వంటి సానుకూల పరిస్ధితులు మేడా సొంతం. అంతేకాకుండా కరోనా సమయంలో మరణించిన వారికి ఆర్ధిక సహాయం, అంబులెన్స్ ల వితరణ, ఉచితంగా కొవిడ్ సెంటర్ ఏర్పాటుతో సిఎం దృష్టిలో పడి మెప్పు పొందడం, వివాదా రహితుడిగా ముద్రపడటం మేడాకు కలిసొచ్చే మరో ఆంశం. దీంతో మంత్రి పదవి విషయంలో సీఎం తమకు తప్పక న్యాయం చేస్తారన్న ధీమాలో మేడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  ఇది చదవండి: పట్టాభి వ్యాఖ్యలు సరికాదు.. చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేశా.. డీజీపీ సవాంగ్ కామెంట్స్..


  ఇక సామాజిక సమీకరణాలో భాగంగా తనకు మంత్రి బెర్త్ ఖాయమన్న ధీమాలో ఉన్నారు రైల్వేకోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు. మొదటి నుంచి వైఎస్ కుటుంబ విధేయుడిగా ఉండటం, సామాజిక సమీకరణాలు కలిసిరావడం తనకు ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. మొత్తం మీద మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో మార్పులుంటే.., జిల్లాలో ఉన్న డిప్యూటీ సీఎం అంజాద్ పరిస్ధితి ఎంటన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ ముగ్గురిలో మంత్రి పదవి ఎవరిని వరించనుందోనన్నది పార్టీలో ఆసక్తికరంగా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy, Kadapa

  ఉత్తమ కథలు