Anandaiah Medicine : బ్లాక్ మార్కెట్లో ఆనందయ్య మందు..? ఇది వారి పనేనా..?

ఆనందయ్య ముందుపై రేపు క్లారిటీ

కరోనా విజృంభిస్తున్న వేళ ప్లాస్మా(Plasma), ఆక్సిజన్ (Oxygen), రెమిడిసివిర్ (Remdesivir) లాంటి అత్యవసర మందులు బ్లాక్ మార్కెట్ కు తరలివెళ్లాయి. ఇప్పుడు ఆనందయ్య అందిస్తున్న మందు (Anandaiah Mandu) కూడా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 • Share this:
  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఆనందయ్య ఆయుర్వేద మందు ఫేమస్ అవుతోంది. కేవలం రెండు రోజుల్లోనే కరోనాను మాయం చేస్తోందంటూ ప్రజలు ఆ మందు కోసం పరుగులు పెడుతున్నారు. చాలా మందిలో కరోనా తగ్గిపోవడంతో ఆనందయ్య ఇచ్చే మందుపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. దీంతో వేలాది మంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నంవైపు పరుగులు పెడుతున్నారు. ఐతే ఆయుర్వేద మందుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం పంపిణీని వెంటనే నిలిపేసింది. దీనిపై ఐసీఎంఆర్ తో పాటు రాష్ట్ర ఆయుష్ శాఖ దృష్టిపెట్టింది. ఇప్పటికే ఆయుష్ శాఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని మందుకు సంబంధించిన శాంపిల్స్, అందులో ఉపయోగించే మూలికలను పరిశీలించారు. వాటిపై అద్యయనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఓ రహస్య ప్రాంతంలో ఆనందయ్య.. అధికారులకు డెమో ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.

  ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మందును పంపిణీ చేయవద్దంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణపట్నం నిర్మానుష్యమైంది. ఐతే ఈ మందు కోసం కొందరు దూరప్రాంతాల నుంచి ఇంకా కృష్ణపట్నం వెళ్తున్నారు. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లుగా కూడా విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కరోనా రోగుల బంధువుల పేరుతో మందును తీసుకెళ్లిన కొందరు వాటిని బ్లాక్ మార్కెట్లు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోగుల అవసరాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తున్నారన్నట్లు సమాచారం. ఐతే దీనిని ఎక్కడ ఎవరు విక్రయిస్తున్నారనేదానిపై సమాచారం మాత్రం బయటకురావడం లేదు. ఐతే ఈ ప్రచారాన్ని కృష్ణపట్నం వాసులు కొట్టిపారేస్తున్నారు.

  ఇది చదవండి: ఆనందయ్య మందుపై ఆర్జీవీ రియాక్షన్ ఇదే... కృష్ణపట్నంతో అమెరికాకు లింక్...


  ఇదిలా ఉంటే ఆనందయ్య దగ్గర పసరు మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్యకు మళ్లీ అనారోగ్యం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం అత్యంత విషమపరిస్థితుల్లో ఉన్న సమయంలో కోటయ్యకు ఆనందయ్య కంటి పసరు మందు ఇచ్చారు. ఆ సమయంలో ఆక్సిజన్ లెవల్స్ వెంటనే పెరగ్గా.. రెండు రోజుల తర్వాత మళ్లీ ఆక్సిజన్ శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. అలాగే కంటికి సంబంధించిన ఇన్ ఫెక్షన్ కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కంటిలో వేసిన పసరులో జిల్లేడు ఉండటంతో సమస్య వచ్చినట్లు డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయనకు నెల్లూరు జీజీహెచ్ లో ట్రీట్ మెంట్ జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

  ఇది చదవండి:  ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం పట్టుకోల్పోతోందా..? కరోనా పేరుతో బ్లాక్ మెయిలింగ్ దందా..


  ఇప్పటికే ఆనందయ్య మందు గురించి తెలుసుకునేందుకు రాష్ట్రమంత్రి పేర్ని నాని నెల్లూరు వెళ్లారు. మందును తయారు చేసే పద్ధతి, అందులో వాడుతున్న మూలికలు, రోగులకు ఇచ్చే డోసులు తదితర అంశాలపై మంత్రి.. ఆనందయ్యతో చర్చించినట్లు తెలుస్తోంది. మరి ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆయూష్, ఐసీఎంఆర్ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది.
  First published: