Extramarital Affair: ప్రియురాళ్ల మోజులో తండ్రి... ఆస్తిని తగలేస్తున్నాడన్న కోపంతో కొడుకు ఏం చేశాడంటే..!

ప్రతీకాత్మకచిత్రం

అలాంటి అందమైన జీవితాల్లోకి చెడువ్యసనాలు, వ్యక్తలు వస్తే పరిస్థితులు తారుమారు కాక తప్పదు. తాత్కాలిక సుఖాలకు అలవాటు పడితే పోనుపోను అవే చేదుగా మారతాయి.

 • Share this:
  GT Hemanth Kumar, Tirupathi, News18

  బంధుత్వాలతో కలగలిసిన మనిషి జీవితం చాలా అందమైనది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సందడిగా ఉంటుంది. అలాంటి అందమైన జీవితాల్లోకి చెడువ్యసనాలు, వ్యక్తులు వస్తే పరిస్థితులు తారుమారు కాక తప్పదు. తాత్కాలిక సుఖాలకు అలవాటు పడితే పోనుపోను అవే చేదుగా మారతాయి. అలాంటి వివాహేతర సంబంధాలు (Extramarital  Affairs) బయటకు తెలియనంతవరకు అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ అలాంటి బంధాలు నలుగురికి తెలిస్తే నవ్వులపాలు కాక తప్పదు. కొన్నిసార్లు అవే ఘోరమైన నేరాలకు దారితీస్తాయి. ప్రియురాలి మోజులో పడి ఆస్తినంతా పోగొడుతున్న తండ్రికి నచ్చజెప్పాలని ప్రయత్నించిన కొడుకు.. అతడిలో మార్పురాకపోయే సరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం అతడితో పాటు అతడి స్నేహితుల కుటుంబాల్లోనూ కలకలం రేపింది. తండ్రిలో మార్పు తీసుకురావాలని భావించిన వాటు కటకటాలపాలయ్యాడు.

  వివరాల్లోకి వెళితే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని  అనంతపురం జిల్లా (Anantapuram District) కేంద్రంలో మూడు రోజుల క్రితం నారాయణపురం గ్రామానికి చెందిన నగేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నగరశివారులోని హెచ్ఎల్సీ కెనాల్ లో అతడి శవాన్ని గుర్తించారు. ఇది హత్యేనని నిర్ధారించిన పోలీసులు అన్ని కోణాల్లోను విచారించారు. అతని జీవనశైలి, అలవాట్లు, కుటుంబ వివరాలు, గొడవలు, వివాదాలపై లోతుగా ఆరాతీశారు. ఈ క్రమంలో నగేష్ కుమారుడు నాగరాజు ప్రవర్తన అనుమానం రావడంతో అతడ్ని అదుపులోకి తీసుకోని విచారించారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

  ఇది చదవండి: భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన ప్రభుత్వ పథకం.. ఆధార్ కార్డు వద్ద మొదలై హత్య వరకు వెళ్లింది..


  మృతుడు నగేష్ కు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయి. ఈ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఐతే ప్రియురాలి మోజులో పడిన నగేష్ ఆస్తిని ఆమె కోసమే ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. నగేష్ ను కుమారుడు నాగరాజు.. తండ్రిని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఐతే వివాహేతర సంబంధాల మోజులో ఆస్తినంతా తగలేస్తున్నాడని భావించిన నాగరాజు.., తండ్రిని చంపితేగానీ ఆస్తిని కాపాడుకోలేమని భావించాడు. తన నిర్ణయాన్ని స్నేహితులైన మధుసూదన్, సురేష్ కు చెప్పారు. వారు కూడా హత్యకు ఒప్పుకోవడంతో తండ్రిని ఇనుపరాడ్డుతో తలపై కొట్టి.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తర్వాత డెడ్ బాడీని హెచ్ఎల్సీలో పడేశారు.

  ఇది చదవండి: బావ, ప్రియుడితో కలిసి యువతి స్కెచ్.. వలపు వలతో సర్వం దోచేసింది


  తండ్రి పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఆస్తిని కరిగించేస్తుండటంతో ఇలా చేసినట్లు నాగరాజు అంగీకరించాడు. దీంతో పోలీసులు నాగరాజుతో పాటు అతడికి సహకరించిన స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఒక వ్యక్తి తన సుఖాన్ని చూసుకోవడంతో అతడి కుమారుడు హంతకుడయ్యాడు.. ఫ్రెండ్ కి సాయం చేసినందుకు మరో ఇద్దరు యువకులు జైలుపాలై వారి కుటుంబాలను కూడా సమస్యల్లో పడేశారు. గతంలో చిత్తూరు జల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో సహచింని మొదటిభార్య కుమారుడు ఆస్తికోసం నిలదీశాడు. దీంతో కన్నతండ్రే కొడుకును సుపారీ ఇచ్చిమరీ హత్య చేయించాడు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయాడు.
  Published by:Purna Chandra
  First published: