హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati News: భర్త శాడిస్ట్ అయినా కాపురం చేస్తానంది.. వెళ్లిన అరగంటకే ఘోరం జరిగిపోయింది

Tirupati News: భర్త శాడిస్ట్ అయినా కాపురం చేస్తానంది.. వెళ్లిన అరగంటకే ఘోరం జరిగిపోయింది

పద్మ, వేణుగోపాల్ (ఫైల్)

పద్మ, వేణుగోపాల్ (ఫైల్)

శాడిస్ట్ అయినా, సైకో అయినా సరే.. భర్తను తానే మార్చుకుంటానంటూ అత్తారింటికెళ్లిందో యువతి. కానీ అరగంటలోనే ఆమె జీవితం ముగిసింది. మారతానన్న వాడు.. మృగంలా తయారయ్యాడు. కట్టుకున్న మమకారం లేకుండా భార్యను దారుణంగా బత్య చేశాడు.

GT Hemanth Kumar, News18, Tirupati

అల్లారుముద్దుగా కనిపించిన కుమార్తెను తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఓ అయ్య చేతిలో పెట్టి అత్తారింటికి పంపుతారు. కానీ అల్లుడు సైకో అయితే.. కూతురిపాలిట శాడిస్టు అయితే.. జరిగిందేదో జరిగిపోయిందనుకొని కూతుర్ని ఇంటికి తెచ్చుకుంటారు. కానీ వాడు శాడిస్ట్ అయినా, సైకో అయినా సరే.. భర్తను తానే మార్చుకుంటానంటూ అత్తారింటికెళ్లిందో యువతి. కానీ అరగంటలోనే ఆమె జీవితం ముగిసింది. మారతానన్న వాడు.. మృగంలా తయారయ్యాడు. కట్టుకున్న మమకారం లేకుండా భార్యను దారుణంగా బత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) నగరంలోని కొర్లగుంటకు చెందిన పద్మకు.. సత్యనారాయణపురంకు చెందిన వేణుగోపాల్ తో 2019లో పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. వేణుగోపాల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో భార్యను తీసుకెళ్లి చెన్నైలో కాపురం పెట్టాడు.

ఐతే పెళ్లైన కొత్తలో భార్యతో ప్రేమగానే ఉన్న వేణుగోపాల్.. ఆ తర్వాత తనలోనే శాడిజాన్ని బయటపెట్టాడు. భార్యను అనుమానించడం, శారీరకంగా మానసికంగా వేధించడం, తరచూ కొడతుండటంతో అతడి వేధింపులు భరించలేక నాలుగు నెలకే పద్మ పుట్టింటికి వచ్చేసింది. పెద్దలు ఎన్నిసార్లు సర్దిచెప్పి పద్మను అత్తారింటికి పంపినా వేణుగోపాల్ లో మార్పురాలేదు సరికదా మరింత రెచ్చిపోయేవాడు. ఇక చేసేది లేక విడాకులు తీసుకోవాలని కుటుంబ సభ్యులు సూచించా.. మళ్లీ పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు ఎలా ఉంటాడోనన్న భయంతో.. భర్తనే మార్చుకుంటానంటూ అత్తారింటికి వెళ్లింది పద్మ.

ఇది చదవండి: రామలక్ష్మితో ఎఫైర్.. ఎర్రినాయుడు, కర్రి కృష్ణ కలిసి ఏం చేశారంటే..!


ఈ ఏడాది జనవరిలో భర్త వచ్చి పద్మను తీసుకెళ్లాడు. ఐతే వెళ్లిన అరగంటలోనే ఆమెతో గొడవపెట్టుకొని కర్రతో బలంగా తలపై మోదాడు. దీంతో పద్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్యను కప్పిపుచ్చేందుకు వేణుగోపాల్ పద్మ డెడ్ బాడీనీ చీరల్లో చుట్టి సూట్ కేసులో పెట్టి తన ఫ్రెండ్ సంతోష్, కుటుంబ సభ్యుల సాయంతో తీసుకెళ్లి వెంకటాపురం చేపల చెరువులో పడేశాడు. ఐతే అత్తారంటికి వెళ్లినప్పటి నుంచి పద్మ నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో అల్లుడికి ఫోన్ చేసేవారు.

ఇది చదవండి: ప్రేమించిన భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. కట్ చేస్తే ఓ రాత్రి షాకింగ్ సీన్..


ఐతే పద్మ మీతో మాట్లాడదు, మిమ్మల్ని కలవదు అంటూ విసురుకుంటూ ఫోన్ పెట్టేసేవాడు. ఐతే వేణుగోపాల్ పై అనుమానంతో ఈనెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మ అదృశ్యానికి అల్లుడే కారణమని అందులో పేర్కొన్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో జరిగిన విషయం మొత్తం బయటపెట్టాడు. హత్య ఎలా చేసింది.. డెడ్ బాడీని ఎలా మాయం చేసిందీ అన్నీ విషయాలను పూసగుచ్చినట్లు వివరించాడు. అతడ్ని ఘటనాస్థలికి తీసుకెళ్లి మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు.. వేణుగోపాల్ తో పాటు అతడి కుటుంబ సభ్యులు,స్నేహితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Husband kill wife, Tirupati

ఉత్తమ కథలు