తిరుపతికి వెళ్లి భాస్కర్‌నాయుడు (Bhaskar Naidu)ఎవరూ అని ఎవర్ని అడిగినా చెబుతారు. అతను సెలబ్రిటీ కాకపోయినా..మనుషుల ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు, బుసలు కొట్టే నాగుపాములను ఒంటి చెత్తో పట్టుకుంటాడు. తిరుపతి(Tirupati), తిరుమల(Tirumala)పరిసరాల్లో ఎక్కడ పాములు ఉన్నాయన్న అక్కడ క్షణాల్లో వాలిపోయి వాటిని జాగ్రత్తగా పట్టుకొని ఎవరికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వాటిని తీసుకెళ్లి దూరంగా ఫారెస్ట్‌లో వదిలేస్తాడు. అందుకే భాస్కర్‌నాయుడ్ని స్నేక్‌నాయుడు (Snake naidu)అని కూడా తిరుపతి, తిరుమలలో పిలుస్తుంటారు. అటవీశాఖ(Forest department)లో మజ్ధూర్‌గా రిటైర్ అయినప్పటికి భాస్కర్‌నాయుడు సేవలను టీటీడీ ఇంకా కొనసాగిస్తూ వస్తోంది. భాస్కర్‌నాయుడు ఇప్పటి వరకూ సుమారు 10వేల పాముల్ని(10 Thousand snakes) పట్టుకున్నారు. ఎంతో మందికో పాములను చూసి భయపడవద్దని అవగాహన కల్పించారు. కానీ ప్రస్తుతం ఆయనే పాము కాటుకు గురయ్యారు. ప్రాణపాయస్థితిలో ఉన్న స్నేక్ క్యాచర్ భాస్కర్‌నాయుడిని ముందుగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి(Svims hospital)లో చేర్పించారు బంధువులు. అయితే అతని ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెప్పడంతో రేణిగుంట(Renigunta)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. భాస్కర్‌నాయుడు శరీరంలోకి పాము విషం చేరి 24గంటలు గడిచిపోవడంతో అతని ఆరోగ్య పరిస్థితిపై గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు వైద్యులు.
పాములతో ఓ ఆట ఆడుకున్నాడు..
రెండ్రోజుల క్రితం పాము తమ ప్రాంతానికి వచ్చిందని తిరుపతిలో ఎవరో సమాచారం ఇచ్చారు. దాన్ని పట్టుకునేందుకు వెళ్లారు భాస్కర్‌నాయుడు. పామును పట్టుకునే క్రమంలో అది కాటేయడంతో అస్వస్థతకు గురయ్యారు. భాస్కర్‌నాయుడ్ని కాటేసిన పాము అత్యంత విషపూరితమైనది కావడంతో అతడ్ని వెంటనే స్విమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని సూచించడంతో రేణిగుంటలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చారు.
స్నేక్‌నాయుడ్ని కాటేసిన విషసర్పం..
పాము శబ్ధం వినిపించినా..వాటి కదలికలు కనిపించినా..ఎక్కడున్నా క్షణంలో వాటి ముందు వాలిపోయే భాస్కర్‌నాయుడు అంటే తిరుపతి, తిరుమల వాసులకు చాలా సుపరిచితుడు. విషం చిమ్మే సర్పాలైనా, బుసలు కొట్టే నాగుపాములను కళ్లు, మూసి తెరిచేలోపే ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం చాలా సార్లు వార్తల్లో చూశాం. ఇంత వరకూ అతడ్ని చూసి పాములు భయపడిన సందర్బాలు ఉన్నాయే తప్ప పాములకు భాస్కర్‌నాయుడు భయపడిన చరిత్రలేదు. తిరుపతిలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసుకునే భాస్కర్‌నాయుడు పాముల్ని పట్టడంలో నేర్పరిగా పేరు సంపాధించుకున్నారు. కానీ ప్రస్తుతం అదే వ్యక్తి పాము కాటుకు గురై ప్రాణపాయస్థితిలో ఉంటారని ఎవరూ ఊహించలేకపోయారు. భాస్కర్‌నాయుడు పాముకాటు నుంచి కోలుకొని క్షేమంగా బయటకురావాలని అందరూ కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Snake bite, Tirumala, Tirupati