హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sravana Bhargavi: దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఎట్టకేలకు వీడియో డిలీట్.. వివాదం సద్దుమణిగేనా?

Sravana Bhargavi: దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఎట్టకేలకు వీడియో డిలీట్.. వివాదం సద్దుమణిగేనా?

శ్రావణ భార్గవి వీడియో డిలీట్

శ్రావణ భార్గవి వీడియో డిలీట్

Sravana Bhargavi: వారం రోజులుగా వివాదానికి కేంద్రబింధువైన సింగర్ శ్రావణ భార్గవి ఎట్టకేలకు దిగివచ్చింది. అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శల దాడి పెరగడంతో.. వీడియో డిలీట్ చేయకతప్పలేదు.. మరి ఇప్పటికైనా ఆ వివాదం సద్దుమణిగినట్టేనా.?

  Sravana Bhargavi: సినీ ప్రేమికులు.. సంగీత ప్రియులకు (Music Lovers) పరిచయం అవసరం లేని పేరు శ్రావణ భార్గవి (Sravana Bhargavi) .. తెలుగు రాష్ట్రాల్లో్ మంచి పాపులారిటీ ఉంది. అయితే ఇటీవల ఆమె పాడి.. నటించిన అన్నమయ్య కీర్తన (Annamayya keerthana) వివాదానికి కేంద్ర బింధువు అయ్యింది. ఆమె పాటపై అన్నమయ్య వంశీకులు తీవ్ర్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియోను డిలీట్ చేయాలని కోరినా.. ఆమె వెనక్కు తగ్గలేదు.. తన పాటలో అసభ్యత ఏముందని తిరిగి ప్రశ్నించింది. అయితే ఆ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. అన్నమయ్య కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యారు. ఇక శ్రీవారి భక్తులు.. తిరుమల (Tirumala) వాసులు సైతం శ్రావణ భార్గవి వార్నింగ్ ఇచ్చారు. ఆమెను తిరుమలలో అడుగుపెట్టనీయం అంటూ హెచ్చరించారు. ఇలా అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో శ్రావణ భార్గవి ఎట్టకేలకు దిగొచ్చారు. యూట్యూబ్ (Youtube) నుంచి వివాదాస్పద వీడియోను శనివారం డిలీట్ చేశారు. ఇప్పటికే వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. ఆ పాట వివాదాస్పదం అవ్వడంతో మరింత వ్యూస్ వచ్చేవి.. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వీడియోను డిలీట్ చేయక తప్పలేదు..

  అసలేం జరిగిందంటే.. శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన తాజా మ్యూజికల్ వీడియో వివాదానికి కేంద్రం అయ్యింది. అన్నమయ్య కీర్తనల్లో ఒకటైన `ఒకపరి ఒకపరి వయ్యారమే` అంటూ సాగే కీర్తనలతో శ్రావణ భార్గవి దీనిని రూపొందించింది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే..? ఇందులో తనే యాక్ట్ చేసింది. తన అందాన్ని వర్ణించుకున్నట్టు ఈ పాటను రూపొందించింది. అనూహ్యంగా ఈ పాటకు యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తుంది.

  కానీ శ్రావణ భార్గవి మ్యూజికల్ వీడియోను.. అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు, అన్నమయ్య వారసులు తప్పుబట్టారు. అన్నమయ్య కీర్తనలను అపహాస్యం చేసేలా, కించపరిచేలా ఉన్నాయని అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు ఆరోపించారు. భక్తితో కూడుకున్న పాటను ఇలా అసభ్యకరంగా రూపొందించడం ఏంటని.. వెంటనే వీడియో డిలీట్ చేయాలని వారు కోరారు. ఈ క్రమంలోనే అన్నమయ్య ట్రస్ట్‌ సభ్యునికి, శ్రావణ భార్గవికి మధ్య జరిగినట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలువురు శ్రావణ భార్గవి వీడియోపై అభ్యంతరం వ్యక్తం చే శారు. మరికొంతమంది శ్రావణ భార్గవిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. కొందరు తిరుపతి వాసులైతే.. ఆమె వీడియో డిలీట్ చేసి క్షమాపణ చెప్పకపోతే.. తిరుపతిలో అడుగుపెట్టనీయమని హెచ్చరించారు.

  ఇదీ చదవండి : పుష్ప కావడిలో మొక్కులు చెల్లించిన రోజా..? అసలు పుష్పకావడి ప్రత్యేకత ఏంటి అంటే..?

  కారణం ఏదైనా.. ఆమె మాత్రం వీడియోను డిలీట్ చేయకతప్పలేదు. ఇక లీగల్ చర్యలకు సిద్ధమవుతామన్న అనమయ్య కుటుంబ సభ్యులు ఏం చేస్తారో చూడాలి.. అయితే ఆమె వీడియో డిలీట్ చేయడంతో వివాదం సద్దుమణిగినట్టే అంటున్నారు కొందరు. మరోవైపు ఈ వీడియోపై కరాటే కళ్యాణి సైతం సంచలన ఆరోపణలు చేశారు. శ్రావణ భార్గవి చేసిన వీడియోలో కొన్ని తప్పులున్నాయి. స్వామి సేవలో పాడే కీర్తనకు ఓ ఔన్నత్యం ఉంటుంది. దాని విలువను మనం కాపాడాలే తప్ప కాళ్లు రెండు పైకెత్తి ఊపుతూ చేయడమేంటి? నువ్వు పెళ్లైన అమ్మాయివి. కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు.. శాస్త్రబద్దంగా ఉన్నప్పుడు అవెందుకు పాటించలేదు. ముందు అవి వేసుకో.. కీర్తనలు పాడుకునేటప్పుడు మీ పైత్యాన్ని ఇందులో చూపించొద్దు అంటూ మండిపడ్డారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirupati, Viral Video, Youtube

  ఉత్తమ కథలు