తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Tiurmala Brahmotsavalu) శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. స్వామి వారి బ్రహ్మాండోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు చిన్న శేష వాహనంపై గీత కృష్ణునిగా దర్శనమిచ్చిన శ్రీవారు రాత్రి హంస వాహనంపై వీణాపాణిగా దర్శనమిచ్చారు. సర్వాంతర్యామి తానే అంటూ చాటిచెప్పే ఉత్సవాలే ఈ బ్రహ్మోత్సవాలు. గోకులంలో కృష్ణుడైనా, వైకుంఠంలో శ్రీనివాసుడైన.., అయోధ్యలో రాముడైన అన్ని తానే అంటూ భక్తులకు సందేశాని ఇస్తారు మలయప్ప స్వామి. ఇక ఉదయం జరిగే సింహ వాహనంపై.... యోగ నరసింహ మూర్తిగా మలయప్ప స్వామి దర్శనమిస్తే..., ముత్యాల పందిరిలో శ్రీదేవి భూదేవి సమేతుడై అనుగ్రహాన్ని ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఉదయం యోగ నరసింహా రూపంలో సింహా వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు.
విశిష్టతలివే..!
శ్రీవారు విహరించే ప్రతివాహనానికి ఒక విశిష్టత ఉంది. సింహ వాహనం ప్రత్యేకమైనది. వనరాజు, మృగరాజు సింహాం, గాంభీర్యానికి, దక్షతకు ప్రతీక, దూష్టశిక్షణ, శిష్టరక్షణ ఈ వాహనసేవ పరమార్థం. ప్రహ్లదుని రక్షించడానికి శ్రీమహావిష్ణువు ధరించిన అవతారం నరసింహావతారం. ఆ వృత్తంతాన్ని భక్తులందరుకి తెలియజేసేందుకే సింహావాహన సేవ జరుగుతుంది.. ఉన్నతమైన అసనానికి సింహాసనమని పేరు. నరోత్తముడు సింహాసానన్ని అధిష్టించి ప్రజలను, రాజ్యాన్ని సంరక్షిస్తాడు, దుష్టలను శిక్షిస్తాడు. యోగశాస్త్రంలో సింహాం వహనశక్తికి శీఘ్రగమనానికి అదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహాబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడే భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలడని ఈ సింహావాహన సేవలోని అంతారార్థం.
నిర్మాలాకాశంలో మొరుస్తున్న నక్షత్రాలను మించి ప్రకాశిస్తున్న విద్యుద్దీపాలు వెలుగులో దేదీప్యమానంగా ముత్యాపుపందరి వాహనంపై స్వామివారు నయనందకరంగా దర్శనమిస్తాడు.. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారని స్వీకరిస్తున్న వేంకటేశ్వరస్వామివారి దర్శనం భక్తులలోని తాపత్రాయలను పొగొడుతుందని విశ్వాసం. స్వాతికార్తెలో వానచినుకు సముద్రంలోని ముత్యపుచిప్పలో పడి మంచి ముత్యంగా మారిన్నట్లే ఈ వాహనసేవలను తిలకించిన భక్తులు చిత్తచాపల్యాన్ని పొగొట్టుకొని నిర్మల హృదయులుగా మారుతారని ఈ వాహన సేవలోని చెబుతుంది.
కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తోంది టీటీడీ. ఆలయ ప్రకారంలోని కల్యాణోత్సవ మండపంలో వివిధ వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారిని కొలువుతీరుస్తారు ఆలయ అర్చకులు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మరథం, వృషభ, అశ్వ, ఏనుగులదే అగ్రస్థానం. కానీ కోవిడ్ - 19 కారణంగా ఆలయంలోని కల్యాణమండపంలో స్వామివారి వాహనసేవలు ఏకాంతంగా జరుగుతున్న విషయం విదితమే. శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో నమూనా బ్రహ్మరథం, వృషభాలు, అశ్వాలు, ఏనుగుల సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.