Home /News /andhra-pradesh /

TIRUPATI SI ARRESTED FOR CHEATING WOMEN ON THE NAME OF LOVE MARRIAGE IN TIRUPATI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Cheating Police: ఖాకీ డ్రెస్ వేసుకొని అమ్మాయిలతో సయ్యాటలు.. పెళ్లి చేసినా బుద్ధిమారలేదు.. చివరకు..

ఎస్సై విజయ్ కుమార్ (ఫైల్)

ఎస్సై విజయ్ కుమార్ (ఫైల్)

Police Love: ప్రేమ పేరుతో యువతులకు వల విసురుతున్న ఎస్ఐని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఐని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు.

    ప్రజల మాన, ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలే కొన్నిసార్లు దారితప్పుతున్నారు. ఆపద అంటూ వచ్చిన వారిని ఆదుకోవాల్సిన పోలీసులే.. బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. దీంతో శిక్షించాల్సిన వారే శిక్షకు గురవుతున్నారు. ప్రేమ పేరుతో యువతులను మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati District) చంద్రగిరి ఎస్ఐ విజయ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి ఎస్ఐ విజయకుమార్ పై దిశ పోలీస్ స్టేషన్ లో కొన్ని రోజుల క్రితం ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్ఐ ఆ యువతిని ఇటీవల వివాహం చేసుకున్నాడు.

    మొదటి యువతితో కాపురం చేస్తుండగానే మనొడికి బుద్ధి పక్కచూపులు చూసింది. భార్యతో ఉంటూనే మరోవైపు తిరుపతిలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అనంతపురం జిల్లా పామిడి మండలం జి.కొట్టాలకు చెందిన మరో యువతిని ఎస్ఐ ప్రేమపేరుతో ట్రాప్ చేశాడు. ఐతే అప్పటికే విజయ్ కుమార్ కు పెళ్లైందన్న విషయం తెలుసుకున్న యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

    ఇది చదవండి: ప్రేమించానంటే హద్దులు దాటింది.. కానీ తండ్రికే అలాంటి ఫోటోలు పంపాడు..!


    ఎస్సై విజయ్ కుమార్ ప్రేమించి మోసం చేయడంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి తల్లిదండ్రులు పామిడి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని స్వగ్రామంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐపై కేసు నమోదు చేశామని.., తాడిపత్రి డీఎస్పీ తెలిపారు. ఇతనిపై గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులొచ్చాయన్నారు.

    ఇది చదవండి: పెళ్లై 24ఏళ్లైనా ఈ మహాతల్లి పక్కచూపులు మానలేదు.. 


    ఇటీవల గుంటూరు జిల్లాలో ఎస్సై భార్యను వేధిస్తూ సస్పెన్షన్ కు గురయ్యాడు. ఒంగోలు పిటిసిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై వినోద్ కుమార్ గతంలో మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంతకాలం నుంచే తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య ఫిర్యాదు చేసింది. గతంలోనే అధనపుకట్నం వేధింపులపై మంగళరిగి పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. వినోద్ కుమార్.. భార్యపై వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు. దీంతో అతడ్ని సస్పెండ్ చేస్తున్నట్లు డీఐజీ త్రివిక్రమ వర్మ ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బంది ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు