Tirupathi: తిరుపతి వాసులకు సాయంకాలం వేళల్లో ఆనందాన్ని కల్పించేందుకు 2001లో అప్పటి ప్రభుత్వం దాదాపు 75 లక్షలతో శిల్పారామం ఏర్పాటు చేసింది. కానీ దెబ్బకు అంతా మారిపోయింది. ఆదాయం కోల్పోవడంతో పాటు కళావిహీనంగా మారింది.
ప్రతి ఒక్కరు స్ట్రెస్ నుంచి బయటపడేందుకు మనోవికాసం ఎంతో అవసరం. కొంతసమయం పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటారు ప్రజలు. పిల్లలతో సరదాగా గడిపేందుకు సైతం పార్కులకు వెళ్తుంటారు. ఇలా తిరుపతి (Tirupathi) వాసులకు సాయంకాలం వేళల్లో ఆనందాన్ని కల్పించేందుకు 2001లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం దాదాపు 75 లక్షలతో శిల్పారామం ఏర్పాటు చేసింది. తమిళ, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడం, వివిధ ప్రదేశాల నుండి తిరుమల యాత్రకు వచ్చే భక్తులు ముందుగా తిరుపతికి చేరుకుంటారు. స్వామి వారి దర్శనంతరం తిరుపతికి వచ్చిన యాత్రికులు శిల్పారామంను సందర్శించి ఎంతో గానీ అనుభూతిపొందే వారు. ఇలా నిత్యం యాత్రికులు, స్ధానికులు, ఇతర రాష్ట్రాల సందర్శకులతో కరోనా ముందు వరకూ కళకళ లాడే శిల్పారామం నేడు బోసి పోయింది.
కోవిడ్ కారణంగా గత రెండు ఏళ్ళుగా నష్టాల వైపు సాగుతుంది. ఎక్కువ రోజులు మూసి వేయడంతో సందర్శకుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. దీంతో సందర్శకుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. శిల్పారామంలో ప్రవేశ టికెట్ల రూపంలో నెలకు రూ.5 లక్షల మేర ఆదాయం సమకూరేది. ప్రవేశ రుసుము రూ.20 కాగా బోటు షికారుకు రూ.30 చెల్లిస్తే ఒకరిని అనుమతిస్తారు. అంతేకాకుండా గుర్రపు స్వారీ, జెయింట్ వీల్స్, ఊయ్యాల, మ్యూజిక్ లైట్స్, కారు రేసింగ్లు, జప్పింగ్ స్పాట్స్, వంటవి చిన్నారులను ఎంతగానో ఆకట్టుకునేవి, అలాగే ఐరన్ స్ర్పాప్ తో తయారు చేసిన దేవతామూర్తుల విగ్రహాలు, వివిధ కులవృత్తుల కళాకృతులు సందర్శకులను ఎంతగానో ఆకర్షించేది. ఇవే కాకుండా కోవిడ్ ముందు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణ వాసులను యాత్రికులను ఎంతగానో ఆకట్టుకునేది.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. శిల్పారామంలో అడుగుపెట్టిన సందర్శకులను ఆహ్లాదకరమైన వాతావరణం ఆకట్టుకునేది. ప్రత్యేక పర్వదినాల్లో వరుస సెలవు రోజుల్లో సందర్శకుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఇక రెండేళ్లుగా కోవేట్ కారణంగా సందర్శకుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో చాలా వరకు దుకాణాలు మూతపడ్డాయి. దుకాణాల ద్వారా వచ్చే రెండు లక్షల రూపాయల ఆదాయం కూడా నిలిచిపోయింది.
తిరుపతి వాసుల సౌకర్యార్థం శిల్పారామంలో కళ్యాణ మండపం నిర్మాణ పనులు సైతం నత్తనడకన సాగుతోంది. ఇలా రెండేళ్ల కాలంలో దాదాపు రెండు కోట్ల మేర నష్టం వాటిల్లింది. శిల్పారామంలో దాదాపు 20 మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సరైన ఆదాయం లేకపోవడంతో ఏడు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ఇదే విషయము పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం కనిపించకపోవడంతో జీతాల కోసం ఉద్యోగులు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతిరోజు నాలుగు వందల నుంచి 500 వరకు సందర్శకులు వస్తుండడంతో అంతంత మాత్రమే ఆదాయం సమకూరుతుంది. దీంతో సిబ్బందికి అరకొర జీతాలు ఇస్తూ కాలం నెట్టుకొస్తున్నారు అయితే ప్రభుత్వం దయచేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.