Andhra Pradesh: అక్కరకురాని ఆరోగ్యశ్రీ... కాసుల కోసం పట్టించుకోని ప్రైవేట్ ఆస్పత్రులు...

ప్రతీకాత్మకచిత్రం

కరోనా (Corona Virus) విజృంభిస్తున్న వేళ ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రైవేట్ ఆస్పత్రులు (Private Hospitals) రెచ్చిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ (Arogya Sri) ఉన్నా లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి.

  • Share this:
    కరోనా మహమ్మారి సామాన్యుల పాలిట శాపంగా మారింది. వైరస్ కరోనా సోకి ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్న వారి బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. కరోనాను అదునుగా చేసుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు కరోనాతో వ్యాపారం సాగిస్తూ..... రెండువైపులా కానక వర్షం కురిపించుకుంటున్నాయి. ప్రజలే భయమే పెట్టుబడిగా పెట్టుకొని భారీగా వ్యాపారం సాగిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అంధక చనిపోయిన పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల వైపు ప్రజలు చికిత్స కోసం వెళ్తున్నారు. బాధితుల అభద్రతా భావంతో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం క్యాష్ చేసుకుంటోంది. ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆసుపత్రుల్లో మాత్రం పరిస్థితి ఇందుకు బిన్నంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ చేస్తూన్నారు. ఆరోగ్య శ్రీ క్రింద ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకోగా డిశ్చార్జ్ అయ్యేనాటికి డబ్బులు కట్టాలని ముక్కు పిండి వసూలు చేసుకుంటున్నారు. మరో వైపు ఆరోగ్య శ్రీ తరపున రాష్ట్ర ప్రభుత్వంకు బిల్లును అందజేసి కాసులు దండుకుంటున్నారు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు.

    కరోనాకు భయపడి బాధితులు ఆరోగ్య శ్రీ కార్డుతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆలాంటి బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రులకు యాజమాన్యం ఉచితంగా వైద్యం అందించాల్సి ఉంది. కానీ ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం పేరుకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చెస్తున్నామని చెప్తున్నా.. డిశ్చార్జ్ ఆయేనాటికి మాత్రం లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నాయి. మరికొందరి పరిస్థితి ఇంకా బిన్నంగా మారింది. ఆక్సిజెన్ సిలిండర్ తో పాటు మందులను కూడా బయట తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా ఎవరికి వారు బాధిత కుటుంబాల నుంచి భారీగా అదనంగా డబ్బులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు రెమ్ సివర్ ఇంజక్షన్ల పేరుతో రూ. లక్ష నుంచి రూ 1.5 లక్షల వర కూ బాధితుల నుంచి వసూలు చేస్తున్న ఘటనలున్నాయి.

    ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే కొందరు సిబ్బందిని రెమసివిర్ ఇంజెక్షన్ల అక్రమ దందాపై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆపత్కాలంలో బాధితులకు సకాలంలో వైద్యమందించి ప్రాణం నిలబెట్టాల్సిన ఆస్పత్రుల యాజమాన్యాలు కాసులకే పెద్దపీట వేస్తున్నారన్న అభిప్రాయం పలు వర్గాల నుంచి వినిపిస్తోంది. అనంత ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి చోద్యం వెలుగులోకి వచ్చింది. అనంత లోని టవర్క్ సమీపంలోనున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో పెనుకొండ పట్టణానికి చెందిన ఓ బాధితురాలు ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయింది. ఆ ఆస్పత్రిలో ఆ బాధితురాలు చికిత్స పొందుతూ.., ఐదు రోజుల తరువాత మృతి చెందింది. అప్పటికే వైద్యం పేరుతో మృతురాలి కుటుంబసభ్యులతో రూ.80 వేల రూ.30 వేలు మెడిసిన్ కోసం వసూలు చేశారు. ఆ బాధితు రాలి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకుగానూ అదనంగా రూ.1.10 లక్షలు కట్టాలని ఆ ఆస్పత్రి యాజమాన్యం మృతురాలి కుటుంబీకులపై ఒత్తిడి చేసింది.

    ఐతే ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు కదా....? మేమెందుకివ్వాలని ఆ మృతురాలి కుటుంబీకులు, బంధుమిత్రులు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. కానీ.. ఆస్పత్రి యాజమాన్యం ససేమిరా అనడంతో కొన్ని సంఘాలు కలుగజేసుకోవడంతో చినికి చినికి గాలి వానగా మారింది.

    విషయాన్ని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్య వెళ్లడంతో.. ఆస్పత్రి యాజమాన్యం వెనక్కు తగ్గి ఆ బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పింది. ఇదే తరహాలో సాయినగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఓ కరోనా బాధితుడి నుంచి వేలాది రూపాయలు వసూలు చేసింది. జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి కరోనాతో ఆస్పత్రిలో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. అయినా ఆ ప్రభుత్వ ఉద్యోగితోనూ రూ.లక్ష వరకూ కట్టించుకున్నట్లు సమాచారం. చెల్లించిన ఆ లక్షకు బిల్లు ఇవ్వమంటే ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చేది లేదని చెబుతోందంటే... జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల తీరు ఏపాటిదో దీన్నిబట్టే అర్థమవుతోంది.

    ఆరోగ్య మిత్రాలే కీలకం
    కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసుకునేందుకు ఆయా ఆస్పత్రుల్లో ఉన్న ఆరోగ్యమిత్రలే కీలకం. ఆ ఆరోగ్యమిత్రల్లో కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కై ఆదనపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల. బలంగా వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కరోనా బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసుకోవడం వెనుక కొందరు ఆరోగ్యమిత్రల వాటాలతో సరిపెట్టుకుంటుండటమే ప్రధాన కారణ మన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ వుతోంది. ఇదిలా ఉండగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షణాధికారులను ఏర్పాటు చేసినప్పటికీ ఆ అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహ రిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయిన బాధితులను పక్కనబెడితే... ఆరోగ్యశ్రీ లేని కరోనా బాధితుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నా పర్యవేక్షణాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

    ఆక్సిజన్, వెంటిలేటర్ పేరుతో రోజుకు రూ.25 వేలు వరకూ బాధితుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారంటే పర్యవేక్షణాధికారుల పర్యవక్షణ ఏమైందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారంలో కారణమై ఉంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరహా విమర్శలు, ఆరోపణలకు చెక్ పెట్టా లంటే పర్యవేక్షణాధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
    Published by:Purna Chandra
    First published: