Home /News /andhra-pradesh /

Boy Murder Mystery: చిత్తూరు జిల్లా బాలుడు హత్య కేసులో సంచలన నిజాలు.. తల్లిదండ్రులు ఏం చెప్పారంటే..!

Boy Murder Mystery: చిత్తూరు జిల్లా బాలుడు హత్య కేసులో సంచలన నిజాలు.. తల్లిదండ్రులు ఏం చెప్పారంటే..!

పీలేరు బాలుడు తేజేష్ హత్యకేసులో సంచలన నిజాలు

పీలేరు బాలుడు తేజేష్ హత్యకేసులో సంచలన నిజాలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పీలేరులో హత్యకు (Murder) గురైన బాలుడు తేజేష్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పీలేరులో హత్యకు (Murder) గురైన బాలుడు తేజేష్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుడి హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. ఒక్కగానొక్క కుమారుడు హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తేజేష్ హత్యపై పేరేంట్స్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. తేజేష్ తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లారు. దంపతులిద్దరూ అక్కడే ఉంటూ తేజేష్ ను పెద్దమ్మ కల్యాణి వద్ద ఉంచారు. దసరా సెలవులు కావడంతో ఈనెల 11న పుట్టినరోజు కావడంతో అమ్మమ్మ పార్వతి ఊరైన ఎగువమేకలవారిపల్లి వెళ్లాడు. ఈ క్రమంలో 12వ తేదీన ఆడుకుంటుండగా తేజేష్ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు గాలించినా ఆఛూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం తేజేష్ గ్రామ సమీపంలోని బొప్పాయి తోటలో శవమై కనిపించాడు.

  కన్నబిడ్డ హత్యకు గురైన సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు కువైట్ నుంచి వచ్చారు. తేజేష్ ను భూదేవిరెడ్డి, రవీందర్ రెడ్డి అనే వ్యక్తులో హత్య చేయించారని వారు ఆరోపించారు. డబ్బుకోసమే వారు తమ బిడ్డను చంపించారని.. వారిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. వాళ్లిద్దరి అరెస్ట్ చేసి విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని పోలీసులను కోరారు.

  ఇది చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త హత్యకు సుపారీ.. పక్కా స్కెచ్ వేసినా దొరికిపోయింది...


  అప్పుచేసి కువైట్ వెళ్లిన తల్లిదండ్రులు...
  తేజేష్ తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి.. భూదేవిరెడ్డి, రవీందర్ రెడ్డి వద్ద దాదాపు రెండు లక్షల రూపాయలు అప్పుచేసి కువైట్ వెళ్లారు. ఐతే అసలు చెల్లించి వడ్డీ ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో భూదేవిరెడ్డి, రవీందర్ రెడ్డికి.. తేజేష్ తల్లిదండ్రులకు మధ్య వివాదం నడుస్తోంది. త్వరలోనే వడ్డీడబ్బులు చెల్లిస్తామని వారు చెప్పినా వినకుండా తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని నాగిరెడ్డి, జ్యోతి ఆరోపిస్తున్నారు.

  ఇది చదవండి: ఐపీ పెట్టిన వ్యాపారి.. అప్పులిచ్చిన వారికి లెటర్.. వైరల్ గా మారిన వాట్సాప్ మెసేజ్..  తేజేష్ హత్యపై పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఆర్ధిక స్థితి, కుటుంబ వ్యవహారాలు, ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే వీరికి శత్రువులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తేజేష్ మేనమామ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. తేజేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు వడ్డీవ్యాపారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని తొలుత చూసిన వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు.

  ఇది చదవండి: విశాఖ బాలిక మృతిపై మంత్రి, ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. లిఫ్టులో రక్తపుమరకలు ఎవరివి..?


  తేజేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటివరకు అడుకుంటూ సందడిచేసిన తేజేష్ ఇలా విగతజీవిగా కనిపించడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ఉన్న పగను చిన్నపిల్లాడిపై తీర్చుకోవాల్సన అవసరం ఎవరికి వచ్చిందనేది బంధువులు ప్రశ్నిస్తున్నారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Crime news, Murder

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు