Home /News /andhra-pradesh /

TIRUPATI SELF LOCK DOWN IN TIRUPATI TOWN GOVERNMENT ALREADY DECLARED AS CONTAINMENT ZONE NGS

Tirupati: తిరుపతి వెళ్లే వారికి అలర్ట్. రేపటి నుంచి లాక్ డౌన్. కరోనా కట్టడి బాధ్యత ప్రజలదే అంటున్న అధికారులు

తిరుపతిలో లాక్ డౌన్

తిరుపతిలో లాక్ డౌన్

మరో నగరంలో లాక్ డౌన్ ప్రారంభమవుతోంది. ఏపీలో ఇప్పటికే పలు పట్టణాల్లో స్వచ్చంధంగా లాక్ డౌన్ అమలవుతోంది. తాజాగా ఆ జాబితాలో తిరుపతి కూడా చేరింది. అయితే ఇప్పటికే తిరుపతిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు.. కరోనాను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజలదే అంటున్నారు.

ఇంకా చదవండి ...
    ఆధ్యాత్మిక నగరం తిరుపతిని కరోనా వెంటాడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు చూసుకుంటే క్రమం తప్పకుండా చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా నమోదు అవుతున్నాయి. చిత్తూరు వ్యాప్తంగా వేయికి మందికి పైగా పాజిటివ్ నిర్ధారణ అవుతుంటే.. అందులో సాగానికి పైగా తిరుపతి నుంచి వస్తున్న బాధితులే ఉంటున్నారు. గత వారం రోజుల నుంచి పరిశీలిస్తే తిరుపతిలో పరిస్థితి దారుణంగా ఉంది.. ఊహించని స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

    తాజాగా తిరుపతిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు నగర పాలక కమిషనర్ గిరీషా. తిరుపతి కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో కరోనా బాధితులు ఉండడంతో.. మొత్తం పట్టణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. అయితే కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించిన ఆయన.. కరోనాను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. అందరూ కచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్ ను అదుపులోకి తీసురాగలమన్నారు.

    తిరుపతిలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉండడంతో స్థానిక వ్యాపార సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి స్వచ్చంధ లాక్ డౌన్ కు పిలుపు ఇచ్చాయి. రేపటి నుంచి తిరుపతిలో మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు ఉంటాయని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. మధ్యాహ్నం 2 తర్వాత స్వచ్చందంగా దుకాణాలు మూసివేసేందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ అంగీకారం తెలిపిందన్నారు ఆయన. తిరుపతి మార్కెట్ ని నగరంలో ఏడు ఎనిమిది చోట్ల డీ సెంట్రలైజ్ చేస్తామని కరుణకర్ రెడ్డి చెప్పారు. ఆటోలు, జీపుల్లో పరిమిత సంఖ్యలో ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎంతో ప్రాముఖ్యమైన పండగ గంగమ్మ జాతరను ఏకాంతంగా జరపాలని నిర్ణయించామని చెప్పారు.

    అంతకుముందు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గిరీషా పట్టణ ప్రజాసంఘాల ప్రతినిధులతో, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అందరి ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు కమిషనర్. తిరుపతి వ్యాప్తంగా కేసులు బాగా పెరుగుతున్నందున.. ఇక ముందు కరోనాను కట్టడి చేసే బాధ్యత ప్రజలమీదే ఎక్కువగా ఉంటుందని, ప్రజలంతా కచ్చితంగా కరోనా నియమాలు పాటించాల్సి ఉంటుందని కమిషనర్ తేల్చి చెప్పారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెబుతున్న అధికారులు.. వారికి మరి ఎలాంటి భద్రత కల్పిస్తారు. ఆకలితో అలమటించే వారి పరిస్థితి ఏంటి అన్నదానిపై మాత్రం ఏం మాట్లాడకపోవడం విచారకరం. ప్రజలను బయటకు రావొద్దు అని చెప్పడం తప్పు కాదు.. కానీ మరి ఇంట్లోనే కూర్చొని ఉండాలంటే వారికి ఆదాయం ఎలా? నిత్యావసరాలు అందించేది ఎవరు అన్నదానిపై ఎందుకు మాట్లాడడం లేదని విపక్షాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

    మరోవైపు కరోనా కారణంగా తిరుపతి యాత్రికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 25వ తేదీన తిరుమల సందర్శించిన వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కేవలం 16వేల 560 మంది సందర్శించారు. తలనీలాలు సమర్పించిన వారు 8,191 మంది ఉన్నారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 1.21 కోట్ల రపాయలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా తిరుపతి వ్యాప్తంగా ఆంక్షలు అమలు చేస్తుండడంతో ఆ ఎఫెక్ట్ తిరుమలపైనా పడుతుంది. తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడంతో ఆ పైగా వెళ్లాలి అంటే భక్తులు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Corona, Corona cases, Corona positive, Corona second wave, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు