హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bank of Baroda Scam: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ స్కామ్.. డిపాజిట్లు గల్లంతు...

Bank of Baroda Scam: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ స్కామ్.. డిపాజిట్లు గల్లంతు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Bank Scam: తమ డబ్బుకు నమ్మకమైన కాపలాదారుగా ప్రజలను బ్యాంకులను భావిస్తారు. కానీ అలాంటి బ్యాంకులోనే ప్రజల డబ్బుకు గ్యారెంటీ లేకపోతే. నమ్మిన జనాన్ని నట్టేట ముంచితే..!

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

Bank of Baroda Scam: బ్యాంక్. సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు తాము సంపాదించిన డబ్బుకు భద్రతనిచ్చేది. ఏ చిన్న లావాదేవీ జరగాలన్నా బ్యాంకు సాయముండాల్సిందే. బ్యాంకు లేనిలేది ఆర్ధిక లావాదేవీలు లేవు. సామాన్యులు తాము సంపాదించుకున్న కొద్దిమొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకుంటారు. బ్యాంకులంటే భరోసా. ఎక్కువ వడ్డీ రాకపోయినా తమ డబ్బుకు నమ్మకమైన కాపలాదారుగా ప్రజలను బ్యాంకులను భావిస్తారు. కానీ అలాంటి బ్యాంకులోనే ప్రజల డబ్బుకు గ్యారెంటీ లేకపోతే. నమ్మిన జనాన్ని నట్టేట ముంచితే..! అదే స్కామ్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  ఆంధ్రప్రదేశ్ లోని  చిత్తూరు జిల్లా, కలికిరి  బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు జమ చేసుకున్న సుమారు మూడు కోట్లకుపైగా సొమ్మును బ్యాంకు అధికారులు మాయం చేశారు. ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. దాచుకున్న సొమ్ము మాయమైనట్లు నాలుగైదు రోజుల నుంచి గుసగుసలు ప్రారంభమయ్యాయి. మండలంలోని 150 డ్వాక్రా సంఘాల్లో (Dwakra Groups) ఎకౌంట్ల నుంచి రూ.1.50కోట్ల మేర స్వాహా చేసినట్లు వెల్లడైంది.

మేడికుర్తి పంచాయతీ మజ్జిగవాండ్లపల్లికి చెందిన గణపతి ఎన్.హెచ్.జి గ్రూపులో (SHG) లక్షా 38,500 రూపాయలు స్వాహా అయిన విషయం కనుగొన్న గ్రూపు సభ్యులు బ్యాంకు అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మరో గ్రామానికి చెందిన స్వాతి గ్రూపులో 40 లక్షల 50 వేలు మాయం చేశారు. నగదు మాయమైన విషయంపై విచారణ జరపాల్సిందిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డిపాజిట్ చేసుకున్న వివిధ రకాల ఖాతాల్లో నుంచి ఎంత మొత్తం అధికారులు తాజాగా దోచుకున్నారన్న విషయం వెల్లడికావాల్సి ఉంది.

ఇది చదవండి: హాలిడే ట్రిప్ కి వెళ్లిన సీఎం జగన్... మళ్లీ ఎప్పుడొస్తారంటే..!


ఐతే బ్యాంకులో 14ఏళ్లుగా తాత్కాలిక ప్రాతిపదికన మెసెంజర్ గా చేస్తున్న అలీఖాన్ అనే వ్యక్తి బ్యాంక్ మొత్తాన్ని కనుసన్నల్లో పెట్టుకొని ఈ కుంభకోణాన్ని నడిపినట్లు అనుమానిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలు ఎలా సాగుతాయి.. ఎలా మాయ చేయొచ్చనే దానిపై పట్టుసాధించి డబ్బు దోచేసినట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంక్ కీలక లావాదేవీలకు సంబంధించిన ఐడీ, పాస్వర్డ్ కూడా అలీఖాన్ తెలుసుకున్నట్లు సమాచారం. అలీఖాన్ ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.


ఇది చదవండి: ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలేసింది.. నాలుగేళ్ల సహజీవనానికి అనుకోని ముగింపు...

ఏమైనప్పటికీ పోలీసుల విచారణతో పాటు జిల్లా డీఆర్డిఓ పీడీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని ఖాతాదారులు అంటున్నారు. ప్రజల సొమ్ము బ్యాంకులో దాచుకుంటే భద్రంగా ఉంటుందని ఎంతో నమ్మకంతో తమ వద్ద మిగిలిన మొత్తాన్ని అవసరాల నిమిత్తం పనికివస్తుందన్న గంపెడాశతో బ్యాంకులో జమ చేసుకుంటే దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్లు అధికారులు ప్రజల దర్జాగా దోచుకోవడం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులను కఠినంగా శిక్షించడంతో పాటు ఉద్యోగం నుండి తొలగించాలని భాధితులు డిమాండ్ చేస్తున్నారు.  నమ్మకంతో డబ్బులు డిపాజిట్ చేస్తే తమను మోసం చేశారని.. తమ డబ్బును తిరిగి ఇప్పించాలని  కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Bank of Baroda, Chittoor, Tirupati

ఉత్తమ కథలు