Home /News /andhra-pradesh /

Tirumala Temple: శ్రీవారికి సంపంగి అంటే ఎందుకంత ఇష్టం... చరిత్ర ఏం చెబుతోందంటే..!

Tirumala Temple: శ్రీవారికి సంపంగి అంటే ఎందుకంత ఇష్టం... చరిత్ర ఏం చెబుతోందంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Tirumala Temple: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవారికి (Lord Venkateswara) విషయంలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే. ఆయనకు జరిపించే పూజా కంకైర్యాలు, సమర్పించే నైవేద్యాలు, అలంకరణలు ఇలా ప్రతిదీ చాలా ప్రత్యేకం. శ్రీవారు అలంకార ప్రియుడు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, Tirupathi, News18

    అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవారికి (Tirumala Temple) విషయంలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే. ఆయనకు జరిపించే పూజా కంకైర్యాలు, సమర్పించే నైవేద్యాలు, అలంకరణలు ఇలా ప్రతిదీ చాలా ప్రత్యేకం. శ్రీవారు అలంకార ప్రియుడు. అందుకే వివిధ రకాల ఆభరణాలతో పాటు విశిష్టమైన పుష్పాలతోనూ స్వామివారిని అలంకరిస్తారు. ఇందుకోసం వందల రకాల పుష్పాలను వినియోగిస్తుంటారు. శ్రీవారికి (Lord Venkateswara) అలంకరించే పుష్పాల్లో ప్రత్యేకమైనవి చాలా ఉన్నాయి. అందులో ముందువరుసలో ఉంటుంది సంపంగి. కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమలలోను సంపంగి చెట్లు అధికంగా చూడవచ్చు. అంతే కాదు శ్రీవారికి సమర్పించే పుష్పాలలో సంపంగికి ప్రత్యకే స్థానం ఉంది. ఏ పూజ కైంకర్యం అయినా అందులో కచ్చితంగా శ్రీవారికి సంపంగి పూలను వినియోగిస్తారు. ఎందుకంటే శ్రీవారు అలంకార ప్రియుడు... సువాసన వెదజల్లే పూజలంటే ఆ శ్రీనివాసునికి ఎంతో ఇష్టం కాబట్టే సుగంధ భరితమైన సంపంగి పూజలకు అంత ప్రాధాన్యత ఉంటుంది.

    తాజాగా తిరుమలలో శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే పూలను తిరుమలలోనే పెంచాలని టీటీడీ (TTD) ఈవో కేఎస్ జవహర్ రెడ్డి సూచనలు చేసారు. కేవలం సంప్రదాయ పద్దతిలో పూల చెట్ల పెంపకం సాగాలని అధికారులకు స్పష్టం చేసారు. దీంతో తిరుమలలోని సేవ సదన్ సమీపంలో పూల మొక్కలను పెంచుతున్నారు టీటీడీ గార్డెన్ విభాగం సిబ్బంది. అయితే క్షేత్ర వృక్షంగా ఏదొక చెట్టును కాకుండా శ్రీవారికి ఎంతో ఇష్టమైన పుష్పాన్ని అందించే చెట్టును క్షేత్ర వృక్షంగా ఖరారు చేయాలనీ టీటీడీ ఆలోచన చేసింది.

    ఇది చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఈ అవకాశం..


    సంపంగికి ప్రాముఖ్యత
    చారిత్రక ఆచార వ్యవహరాల్లో ప్రాముఖ్యత ఆధారంగా, తిరుమలక్షేత్రం ప్రాశ‌స్త్యాన్ని అనుస‌రించి టీటీడీ అధికారులు వివిధ రకాల పుష్పాలను పరిశీలించారు. ఇందులో తిరుమల గురించి వివిధ పురాణాలలో పేర్కొన్న విధంగా పూల మొక్కలు మరియు చెట్లను ఏర్పాటు చేశారు పూర్వికులు. ప్రతిరోజూ పూజాధికాల సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామిని అలంకరించే దివ్య పుష్పాలలో సంపంగి ప్రధాన పాత్రగా పరిగణలోకి తీసుకోవాలి.

    ఇది చదవండి: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!


    చారిత్రక ఆధారాలు..
    మహా మునులు రచించిన పురాణ ఆధారాల‌ను ‌లెక్కలు వేశారు. సంపంగి పూల ప్రత్యేక గురించి శ్రీవారే చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలో పేర్కొనబడింది. భవిష్యోత్తర పురాణంలోని 13వ అధ్యాయంలోని 33 మరియు 34 శ్లోకాలు ప్రాకారం శ్రీ‌వారికి ఆల‌యాన్ని నిర్మించేటప్పుడు సంపంగి వనాన్ని తొలగించవద్దని సాక్షాత్తు శ్రీనివాసుడే స్వయంగా తొండమాన్ చక్రవర్తికి సూచించాడని తెలుస్తోంది. శ్రీవారికి ఎంతో ఇష్టమైన పుష్పము కాబట్టే శ్రీవారి ఆలయంలోని ఓ ప్రాకారానికి సంపంగి అనే పేరు పెట్టారు పూర్వికులు. నేటికీ, నడిమి పడికావిలి గోపురం మరియు మహా ద్వార గోపురం మధ్య 30 అడుగుల ప్రాకారం (గోడ) సంపంగి ప్రాకారం అని పిలువబడుతోంది. ఎంతో ముఖ్యంగా భావించే ఈ పుష్పాలను కైంక‌ర్యాల‌లో కూడా వినియోగిస్తారు. ఈ పుష్పం యొక్క ప్రాధాన్యతను మ‌రియు చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, సంపంగి తిరుమలక్షేత్రం యొక్క వృక్షంగా టీటీడీ గుర్తించింది.

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala, Tirumala Temple, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు