Home /News /andhra-pradesh /

TIRUPATI RUIA HOSPITAL TRAGEDY RAISING MANY QUESTIONS OVER 11 PATIENTS KILLED FOR NOT ARRANGING OXYGEN IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Tirupati Oxygen Tragedy: 5 నిముషాల ఆలస్యం.. 11 ప్రాణాలు బలి.. రుయా విషాదానికి బాధ్యులెవరు..?

తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం

తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం

తిరుపతి రుయా ఆస్పత్రి (Tirupat Ruia Hospital) విషాదంపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    రాయలసీమలోనే పెద్దాసుపత్రి. సకల వసతులు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి రుయా. ఇందులో అనేక విభాగాలకు వేర్వేరుగా ఆక్సిజన్ ప్లాంట్ల్స్ ఉంటాయి. ప్రస్తుతం రోజుకు వేల సంఖ్యలో కరోనా బాధితులు ఆసుపత్రి భారిన పడుతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వారికీ రుయా ఆసుపత్రి పెద్ద దిక్కుగా మారింది. ఆసుపత్రిలో అత్యధిక బెడ్లు కలిగిన విభాగాలని ఇప్పుడు కోవిడ్ ఆసుపత్రిగా సేవలు అందిస్తున్నాయి. వెయ్యి పడకల కరోనా చికిత్స కోసం వినియోగిస్తున్నారు. అందులో 135 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐ.సి.యూ)లో చికిత్స పొందుతున్నారు. 460 మంది ఆక్సిజన్ బెడ్లపై వైద్యం చేయించుకున్నారు. అయితే 163మంది వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాసతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఎంఎం వార్డ్ లో ప్రత్యేకించి 10కేఎల్ సామర్ధ్యం గల ఆక్సిజన్ ప్లాంట్లో ఒక్కసారిగా ఆక్సిజన్ స్తంభించింది. ప్రాణవాయువు పైప్ లైన్ ద్వారా ఆగడంతో కొన్ని బెడ్ల వద్ద ఉన్న ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా కృత్రిమ ప్రాణవాయువు అందించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు.

    అప్పటికే కోన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్న బాధితులకు ఆక్సిజన్ అంధక పోవడంతో గిలగిలా కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న బాధిత బంధువులు....వార్డులోకి పరుగులు తీశారు. అప్పటికే కొంతమంది ప్రాణం గాల్లో కలిసిపోయింది. వెంటిలేటర్ పై ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న వారికీ అట్ట ముక్కలతో విసురుతున్న హృదయ విదారక దృశ్యాలు రుయా ఆసుపత్రిలో చోటు చేసుకున్నాయి. 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా ఆగిందని, నామమాత్రంగా కొందరికి మాత్రమే ఆక్సిజన్ ను నామమాత్రంగా సరఫరా చేసారని కరోనా బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.

    ఇది చదవండి: ఏపీలో e-Pass పొందాలంటే ఇలా చేయండి.. గంటలో పర్మిషన్ గ్యారెంటీ...


    30 నిమిషాల వ్యవధిలో ఆక్సిజన్ అందక బాధితుల బంధులువ అరుపులు కేకలతో రుయా ఎంఎంవార్డ్ దద్దరిలింది. రెండు అంతస్తులు 6వార్డులలో ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతున్నారు బాధితులు. రాత్రి 8 గంటలకు ఆక్సిజన్ నిల్వ ఉన్న ట్యాంకార్ పూర్తిగా కాళీఅయ్యింది. దీంతో రోగుల పరిస్థితి విషమంగా మారింది. బాధితుల సహాయకులు వైద్యులకు, అక్కడ ఉన్న సిబ్బందికి సమాచారం చేరవేశారు. బాధితుల సహాయలులు తమ వారిని రక్షించుకునేందుకు అట్టముక్కలు, పేపర్ లతో బాధితులకు విసరడం ప్రారంభించారు. ఆక్సిజన్ అందక...ప్రాణాల కోసం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ కుటుంబీకులను చూసి బాధితుల బంధువుల ఆర్తనాదాలతో రుయా దద్దరిలింది. అయినవారు తమ కళ్ళముందే ప్రాణాల కోసం పోరాటం చేస్తుంటే ఎం చేయాలో తెలియని అయోమయ స్థితికి వెళ్లిపోయారు. మరి కొందరు గట్టిగా ఏడుస్తూ బంధువులకు సమాచారం అందించే ప్రయత్నం చేసారు. వారిని ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు ఆసుపత్రిలోని వార్డులోనే నిలువరించారు.

    ఇది చదవండి: ఏపీలో వ్యాక్సిన్ కోసం సీఎం జగన్ కొత్త ప్లాన్.. కేంద్రం ఒప్పుకుంటుందా..?


    విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు వందల సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. నిమిషాల వ్యవధికి ముందు మాట్లాడిన తమ వారు ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు లేరని రోధించారు. డాక్టర్స్, అక్కడ సిబ్బందిపై ఆగ్రహంతో వాదోపవాదనకు దిగారు. చేసేదేమి లేక కన్నీటి పర్యంతరమై ఇంటికి వెనుదిరిగారు. వార్డులోని డాక్టర్స్, సిబ్బంది పై అక్కడ ఉన్న సహాయకులు గొడవకు దిగడంతో సిబ్బంది వార్డులలో నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే 9 గంటల సమయానికి శ్రీపెరంబదూర్ నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకార్ రావడంతో ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు. ఇంతలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    ఇది చదవండి: ఏపీలో త్వరలో లాక్ డౌన్..? కరోనా కట్టడికి కఠిన నిర్ణయం తప్పదా..?


    ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ రుయా ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటన జరిగిన ఆక్సిజన్ ప్లాంట్, ఎంఎం వార్డులను పరిశీలించారు. రుయాలో వెయ్యిమంది చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు. ఇందులో 700 ఆక్సిజన్, మరో 300 సాధారణ పడకలు ఉన్నాయి తెలిపారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రాణవాయువు సరఫరా కొంత తగ్గడం వల్ల ఘటన జరిగిందని పేర్కొన్నారు. దీని వల్ల కొంతమంది కొవిడ్ చికిత్స పొందుతున్న వాళ్లు చనిపోయారు వెల్లడించారు. కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా కొంత తగ్గిందని ఈలోగా ట్యాంకర్ రావడం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడగలిగినట్లయిందని అన్నారు. వెంటిలేటర్ల మీద ఉన్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. 30 మంది డాక్టర్లు ఐసీయూలో పనిచేస్తూ వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

    ఘటనలో మొత్తం 11 మంది మరణించారని స్పష్టం చేసారు. మిగిలిన వాళ్లకు చికిత్స అందిస్తున్నామన్నారు. ఇప్పుడు ఉన్న ట్యాంకర్ నిల్వ సరిపోతుంది. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రోగులకు భరోసా ఇచ్చారు. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతికపరమైన తప్పిదాలు ఏమి లేవని ట్యాంకర్ రావడం కొంత ఆలస్యం వల్లే ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. బల్క్ సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మొదటి అంతస్తులోని వెంటిలేటర్ ఐసీయూ పడకలకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇది జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీస్ విచారణ చేపడుతున్నామని...బల్క్ సిలిండర్లు స్టాండ్ లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అన్నారు.

    అయితే మృతుల బంధువులు మాత్రం హాస్పిటల్ అధికారుల తప్పిదంతోనే ఇలాంటి ఘటన జరిదని ఆరోపిస్తున్నారు. వెయ్యి మందికి వైద్యం అందిస్తున్న ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు పరిశులించుకోరా..? అని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు మరణాల లెక్కలు తప్పు చెప్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. 25మందికిపైగా ఆక్సిజన్ అందక మృత్యువు ఒడిలో ఒదిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Corona virus, Oxygen, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు