Andhra Pradesh: ఏపీలో వింత.. కోడిపుంజు చేసిన పనికి అంతా షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

గుడ్లుపెడుతున్న కోడిపుంజు

ఈ లోకంలో అప్పుడప్పుడూ ఊహించని వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నిచోట్ల ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  ఈ లోకంలో అప్పుడప్పుడూ ఊహించని వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నిచోట్ల ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. పురుషులు గర్భం దాల్చడం, అవుపాలను పందిపిల్ల తాగడం, కుక్క పిల్లి స్నేహం చేయడం లాంటి ఘటనలు ప్రజల్ని అబ్బురపరుస్తుంటాయి. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా కొడి పుంజు అంటే పొద్దున్నీ కొక్కొరొక్కో అంటూ జనాల్ని నిద్రలేపడం. పందెంలో కాలుకు కత్తికట్టుకొని ఎదుటి పుంజును ఓడించడం, పెట్టలతో జతకట్టడం చేస్తుంటాయి. కానీ ఓ పుంజు ఏకంగా గుడ్లు పెట్టేస్తూ పిల్లల్ని పొదురుతోంది. ఈ వింతను చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమందైతే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ముడిపెట్టేస్తున్నారు.

  చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గ్రామంలోని ఎస్టీకాలనీలో ఉంటున్న సబ్రహ్మణ్యం అనే వ్యక్తికి చెందిన కోడిపుంజు.. పెట్టమాదిరిగా గుడ్లుపెట్టి పొదిగింది. తొలుత అన్ని పుంజుల్లాగే చక్కగా ఉందనుకుని పెంచుతున్న సుబ్రహ్మణ్యం ఉన్నట్లుండి ఓ రోజు అది గుడ్లుపెట్టడం గమనించాడు. ఇదేం వింతరా బాబు అనేకునే సరికే అది గుడ్లు పెట్టసాగింది. వాటిని పొదిగి పిల్లల్ని చేయడమే కాకుండా వాటిని కంటికి రెప్పలా చూసుకుంటోంది.

  ఇది చదవండి: సోషల్ మీడియాలో సీఎం జగన్ జోరు.. కొత్త యాప్ ద్వారా ప్రజలకు మరింత చేరువ


  తన ఇంట్లో పెట్టకు పది కోడి పిల్లలను చేసిందని.. అందులో ఇది కూడా ఒకటని సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు. తొలుత పెట్టమారి జాతికి చెందిన పుంజుగా భావించామన్నారు. ఆ తర్వాత గుడ్లుపెట్టడం, పొదగడం చేసినట్లు వివరించారు. దీనికి కళ్లు తప్ప అన్నీ పుంజు లక్షణాలేనని కానీ గుడ్లు పెట్టడం ఆశ్చర్యం కలిగించిందని సుబ్రహ్మణ్యం చెప్పాడు. ప్రస్తుతం ఈ కోడిపుంజు పెద్దకన్నెలి గ్రామంలో ఓ సెలబ్రెటీ అయింది. ఈ వింత పుంజును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై పశుసంవర్ధక అధికారులను సంప్రదించగా జన్యులోపం వల్ల పుంజులు గుడ్లుపెడతాయని వెల్లడించారు.

  ఎమ్మెల్యే రోజాకు రోజాపూలతో అభిషేకం... పూలవానలో తడిసి ముద్దైన జబర్దస్త్ జడ్జ్


  ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇదే రకమైన ఘటన చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో నిద్రిస్తున్న ఓ ఆవు పొదుగు చుట్టూ పందిపిల్లలు చేరాయి. అలా అవి ఆవు పాలు తాగాయి. కాస్త టేస్ట్ గా అనిపించడంతో అవి నిత్యం ఇక ఆవుపాలు తాగడం ప్రారంభించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే తమ సెల్‌ఫోన్‌లకు పని చెప్పారు. వీడియోలు, ఫోటోలు తీశారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వింత సంఘటనను చూసిన జనాలు బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకున్నారు.

  ఇది చదవండి: మెత్తగా మాటలు చెప్పింది.. రూ.45కోట్లు దోచేసింది.. అది ఎలాగంటే..!  ఇటీవల విశాఖపట్నంలో కూడా వింత ఘటనే జరిగింది. ఓ వీధి కుక్క.. అమ్మలేని రెండు పిల్లి పిల్లలకు పాలివ్వడం వైరల్ గా మారింది. తాజాగా ఇప్పుడు ఓ ఆవు.. పంది పిల్లలకు పాలివ్వడం, కోడిపుంజు గుడ్లుపెట్టి పొదగడం వైరల్ గా మారింది.
  Published by:Purna Chandra
  First published: