హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: తిరుమల లడ్డూ కౌంటర్ లో భారీ చోరీ..ఎన్ని లక్షలు దోచేసాడో తెలుసా?

Tirumala: తిరుమల లడ్డూ కౌంటర్ లో భారీ చోరీ..ఎన్ని లక్షలు దోచేసాడో తెలుసా?

తిరుమల (file)

తిరుమల (file)

తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి నుండి రూ.2 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. సోమవారం అర్ధరాత్రి లడ్డూ కౌంటర్ నిర్వహుకుడు కౌంటర్ కు తాళాలు వేయకుండా నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కౌంటర్ లో ప్రవేశించి నగదును అపహరించాడు. విషయం తెలుసుకున్న టిటిడి విజిలెన్స్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజి ద్వారా అనుమానితుడిని గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుని దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు స్వామి దర్శనం అనంతరం లడ్డు ప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటారు. స్వామి వారి లడ్డు ప్రసాదాల కాంప్లెక్స్ లో పొందుతూ..వారికీ కావాల్సిన లడ్డూలను కొనుగోలు చేస్తుంటారు. దర్శనానికి వచ్చిన ప్రతి భక్తునికి టీటీడీ ఒక్క లడ్డును ఉచితంగా అందిస్తూ వస్తుంది. ఇక అదనంగా లడ్డులు కావాలంటే ఒక్కో లడ్డుకు రూ.50 రూపాయలు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా భక్తులు కొనుగోలు చేసే లడ్డులా నగదును కౌంటర్ లోని సిబ్బంది భద్రపరిచి..విధులు పూర్తి అయినా అనంతరం సంబంధిత అధికారులకు అందించడం జరుగుతుంది. అలాంటి కౌంటర్ లోకి ఓ దొంగ ప్రవేశించి..నగదు దోచుకెళ్లిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.

Ap: జీవో నెంబర్ 1పై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి నుండి రూ.2 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. సోమవారం అర్ధరాత్రి లడ్డూ కౌంటర్ నిర్వహుకుడు కౌంటర్ కు తాళాలు వేయకుండా నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కౌంటర్ లో ప్రవేశించి నగదును అపహరించాడు. విషయం తెలుసుకున్న టిటిడి విజిలెన్స్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజి ద్వారా అనుమానితుడిని గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో నెల క్రితం రాజా కిషోర్ కౌంటర్ బాయ్ గా విధుల్లో చేరాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో విధులు ముగించుకుని లడ్డూల విక్రయం ద్వారా వసూలైన రెండు లక్షల రూపాయలను తన వద్దే ఉంచుకొని గడియ పెట్టడం మరిచిపోయి కౌంటరులోనే నిద్రపోయాడు.

ఉదయం నిద్ర లేచి చూసే సరికి నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించి పాత నేరస్తుడైన సీతాపతి అనే అనుమానితుడిని గుర్తించారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డూ కాంప్లెక్స్ కు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కౌంటర్లలో పని చేస్తున్న సిబ్బందికి కౌంటర్ల నిర్వహణ, నగదు నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తున్నారు.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Crime, Crime news, Tirupati