Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వరుస రోడ్డు ప్రమాదాలు (Road Accidents) భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తమోడుతున్నాయి. వారం వ్యవధిలోనే రోడ్డు ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో మృతి చెందడంలో రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తాజాగా చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం (Kuppam)లో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. కుప్పం గుడిపల్లి మండలం సెట్టిపల్లి పెట్రోల్ బంక్ దగ్గర.. అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అతి వేగం కారణంగా కారులో ఉన్న ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు పిఈఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు వికాస్, కళ్యాణ్, ప్రవీణ్ గా గుర్తించారు.
ప్రమాదంలో మరణించిన ఈ ముగ్గురు వైద్య విద్యార్థులు.. పిఈఎస్ ఆసుపత్రిలో డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు కడప జిల్లాకు, ఒకరు నెల్లూరు జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులకు సమాచారం అందించారు.. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలను మనం చూస్తూనే ఉంటాం ప్రమాదాలకు గురైన వాహనాలు పూర్తి దెబ్బ తింటూ ఉంటాయి. కానీ ఈ రోడ్డు ప్రమాదానికి గురైన కారు. ఆనవాళ్లు కూడా లేకుండా ఇనుప ముద్దలాగా మారిపోయింది. అంటే ఎంత వేగంతో ఈ కారు ఆ లారీని ఢీ కొట్టిందో చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా చెప్తే కానీ ఇది కారు అని గుర్తుపట్టలేనంత గా ధ్వంసం అయ్యిందంటే ప్రమాదం స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూపు రేఖలు లేకుండా పోయిన ఈ కారు మారుతి స్విఫ్ట్. కారు వేగానికి తోడు లారీ కూడా వేగంగా వస్తుండడంతో ఘోర ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి : వైఎస్ వివేకా హత్యకేసులో కీలకం గూగుల్ టేకౌట్.. అసలేంది.. ఎలా యూజ్ చేస్తారు..?
గడిపల్లి మండలం సెట్టిపల్లి దగ్గర వేగంగా కారు దూసుకొచ్చింది. ఎంత వేగంగా వస్తోంది అంటే ఎదురుగా వాహనాలు ఉన్నాయి స్లో చేద్దం అనుకున్నా కుదరలేదు.. పూర్తిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వైద్యవిద్యార్ధుల మృతిలో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన తీరు హృదయవిదారకంగా వుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chittoor, Crime news, Road accident