ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress) లో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో మాత్రం ఆమెకు అసమ్మతి నేతల నుంచి గట్టిపోటీనే ఎదురవుతోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) లో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో మాత్రం ఆమెకు అసమ్మతి నేతల నుంచి గట్టిపోటీనే ఎదురవుతోంది. సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా రోజాను ప్రత్యర్థి వర్గం టార్గెట్ చేయడంతో వివాదం తారా స్ధాయికి చేరుకుంది. ఐదు మండలాల నేతలకు రోజా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రెండు వర్గాల నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రోజా ప్రత్యర్ధి వర్గం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను ఏర్పాటు చేసింది. అయితే రాత్రి రాత్రికి ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేయడంతో రోజా ప్రత్యర్ధి వర్గాలు మండి పడుతున్నాయి.
నగిరి ఎమ్మెల్యే రోజానే టీడీపీ నాయకులతో కలిసి ఫ్లెక్సీలను చింపించారని రోజా వ్యతిరేక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నగిరిలో సొంత పార్టీ నేతలతోనే పొత్తుకుదరడం లేదు. ఈ క్రమంలో వారం క్రితం రోజా ప్రత్యర్ధి వర్గాలైన ఐదు మండలాలకు చెందిన అధికార పార్టీ నేతలు సీఎం జన్మదిన వేడుకలను వేరుగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. రోజా చేసిన ప్రాంతంలో తాము సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించ కూడదని తీర్మానించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా వర్గం తమ ఫ్లెక్సీలను చించేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా సీఎం బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తుంటే నగరిలో వైసీపీ నేతలు ఫ్లెక్సీల విషయంలో గొడవలకు దిగడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే రోజా రెండోసారి గెలవడం, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేక వర్గం తయారైంది. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల సమయంలో రోజా నిలబెట్టిన అభ్యర్థులను ఓడించేందుకు యత్నించారు. అంతేకాదు ఎంపీపీ ఎన్నిక సమయంలో నేరుగా ఆమెతోనే వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది. చివరకి రోజా తన పంతం నెగ్గించుకొని ఆదిపత్యం నెగ్గించుకున్నారు.
అప్పటి నుంచి రోజా ప్రత్యర్థి నేతలంతా కలిసిపోయి ఆమెకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇటీవల సమావేశమైన అసమ్మతి నేతలు వచ్చే ఎన్నికల్లో రోజాకు ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా చేయాలని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. తమ ఎవరు పోటీ చేసినా సరేగానీ రోజాకు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వకూడదని భావిచినట్లు టాక్. అందుకు జగన్ బర్త్ డే వేడుకలనే వేదిక చేసుకొని రోజా ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు వేయించారని నగరిలో చర్చించుకుంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.