Home /News /andhra-pradesh /

TIRUPATI RETIRED POLICE OFFICER BUILT HIS TUMB BEFORE HE DIED IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Chittoor News: మరణమంటే భయమేలేదు.. తన సమాధి తానే నిర్మించుకున్నాడు.. ఓ పోలీస్ స్టోరీ ఇది..!

సమాధి వద్ద ముజీబ్ సాహెబ్

సమాధి వద్ద ముజీబ్ సాహెబ్

Chittoor: మరణం మానవ సహజం.. పుట్టేట్టపుడు ఏమి తీసుకురారు.. పోయేటప్పుడు ఏమి ఎత్తుకొని వెళ్లలేరన్నది అక్షర సత్యం. మనం రాత్రి పగలు అంటూ తేడాలేకుండా శ్రమించి కష్టించి... సంబంధించినదంతా మన సొతం కాదు. స్మశానంలో ఆరు అడుగుల స్థలం, మట్టి మాత్రమే మన సొతం అంటున్నాడు ఓ రిటైర్డ్ పోలీస్.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    మరణం మానవ సహజం... పుట్టేట్టపుడు ఏమి తీసుకురారు.., పోయేటప్పుడు ఏమి ఎత్తుకొని వెళ్లలేరన్నది అక్షర సత్యం. మనం రాత్రి పగలు అంటూ తేడాలేకుండా శ్రమించి కష్టించి... సంబంధించినదంతా మన సొతం కాదు. స్మశానంలో ఆరు అడుగుల స్థలం, మట్టి మాత్రమే మన సొతం అంటున్నాడు ఓ రిటైర్డ్ పోలీస్. ఎలా మరణిస్తామో తెలియదు. మరణించిన అనంతరం ఎక్కడ ఖననం చేస్తారో చూడలేము. మరణించిన వ్యక్తి స్మారకంగా సమాధులు అందరూ నిర్ణయిస్తారు. అందులో ఎలాంటి అదిసయోక్తి లేదు. కానీ ఆ రిటైర్డ్ పోలీస్ మాత్రం తాను చనిపోక ముందే తన సమాధిని నిర్మించుకున్నాడు. అంతేకాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాధి వద్దనే ఉంటూ కాలక్షేపం చేస్తున్న వింతైన ఘటన ఇది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పూతలపట్టు మండలం పాటూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు షేక్ ముజీబ్ సాహెబ్(72). కటిక పేదరికంలో పుట్టిన సాహెబ్ చదువుపై మక్కువతో ఎన్నో కష్టాలుపడి 1973లో బీఏ పూర్తి చేశాడు.

    అదే ఏడాదిలో పోలీస్ శాఖలో కొలువుకు చేరాడు. ఎస్సైగా 2010లో సాహెబ్ రిటైర్డ్ అయ్యాడు. తనకున్న రెండు ఎకరాల భూమిలో మామిడి.., అరటి చెట్లసాగు చేస్తున్నాడు. మామిడి తోపుకు చివరి భాగంలో ముందు సమాధులు నిర్మాణం చేపట్టారు. అందులో ఒకటి తన తల్లి ఎస్ బీబీజాన్ సమాధి కాగా.. మరొకటి అతని అన్న ఎస్ఏ సత్తార్ సమాధి. తాను బ్రతికి ఉండగానే తనకోసం మరొక సమాధిని నిర్మించుకున్నాడు. ఇరవై ఏళ్ళ క్రితమే తాను బ్రతికి ఉండగానే తన సమాధిని తానే నిర్మించుకున్నాడు షేక్ ముజీబ్ సాహేబ్.

    ఇది చదవండి: వైసీపీలో ముదిరిన స్వామి భక్తి.. కీలక నేత ఎదుట మోకరిల్లిన మంత్రి..


    రాతితో నిర్మించిన ఈ సమాధి కేవలం సమాధిపై భాగంలో ఉన్న రాతిని తొలగిస్తే సరిపోతుంది. మృతిదేహాన్ని లోపల ఉంచి సమాధిని మూసి వేసే విధంగా ముజీబ్ సాహేబ్ సమాధి నిర్మాణం చేపట్టారు. ఎంతగానో ప్రేమించిన తన తల్లి మృతి చెందడంతో మనోవేదనకు గురైన ముజీబ్ సాహేబ్ తన తల్లి సమాధికి అతి సమీపంలోనే తన సమాధిని నిర్మించుకున్నాడు. తన తల్లి ఎస్.బీబీజాన్ పేరుతో ఓ దర్గాను కూడా ఏర్పాటు చేశాడాయన. ‌ఉద్యోగ విరమణ పొందిన తరువాత మామిడి తోటలో నిర్మించిన తన సమాధి వద్దనే అధికంగా సమయం గడుపుతూ వస్తుంటారు. ఇతను తెలివిని చూసి గ్రామస్తులు కొందరు ఆశ్చర్యానికి గురై, ముజీబ్ సాహేబ్ ని ప్రశ్నలతో ముంచెత్తారు. కానీ వారి ప్రశ్నలకు అన్నింటికి ముజీబ్ సాహెబ్ కేవలం నవ్వుతోనే సమాధానం ఇచ్చేవారు.

    ఇది చదవండి: ఐదు రోజులు అస్సలు బయటకు వెళ్లొద్దు.. ఈ జిల్లాలకు అలర్ట్..


    రిటైరయిన తర్వాత ఎక్కువ సమయం తన సమాధి వద్ద గడపడంతో తనకు ఎంతో ప్రశాంతను కలుగజేస్తుందని ముజీబ్ సాహెబ్ అంటున్నారు. తాను పోలీసులుగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అనేక ఘటనను తనను కలిచివేసాయని, అందుకే తాను జీవితంపై విరక్తితో తాను దగ్గరుండి మరి‌ సమాధిని నిర్మించుకోవడం జరిగిందని అంటున్నారు. ఈ సృష్టిలో మనిషి మరణం తద్యంమని, మరణం‌ను ఎవరూ తప్పించుకోలేరని అటువంటప్పుడు మరణంను చూసి ఎందుకు‌ భయపడాలని ఆయన అంటున్నారు. మట్టిలో కలిసిపోయే మనిషి శరీరం గురించి దిగులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదని ఆయన అంటున్నారు. అంతేకాకుండా తన సమాధిని నిర్మించిన మామిడి తోపు గోడలపై అనేక రకాల సూక్తులు ఉంటాయని, దానిని చూసి అందరూ తమ స్వార్ధాన్ని వదిలి పది మందికి సహాయం పడుతారనే కోరికతో తాను ఉన్నట్లు ఆయన అంటున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు