Home /News /andhra-pradesh /

TIRUPATI RELATIVES SAY TTD EMPLOYEE KILLED IN TIRUPATI SWIMS DUE TO DOCTORS NEGLIGENCE SNR

స్విమ్స్‌లో టీటీడీ ఉద్యోగి మృతి..వైద్యుల నిర్లక్ష్యమేనంటున్న బంధువులు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Negligence: తిరుపతి స్విమ్స్‌లో టీటీడీ ఉద్యోగి గజేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. గుండెపోటు వచ్చిన వ్యక్తికి వైద్యం చేసే విషయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణం పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో సమయానికి చికిత్స అందక టీటీడీ ఉద్యోగి (TTD employee)మృతి చెందాడు. తిరుపతి సత్యనారాయణపురానికి చెందిన గజేంద్ర(Gajendra) తిరుమల తిరుపతి దేవస్థాన కోపరేట్ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్‌(Junior assistant)గా పని చేస్తున్నారు. శుక్రవారం (Friday)రాత్రి రెండు గంటల సమయంలో గజేంద్రకు గుండె నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు స్విమ్స్ (Svims)హాస్పిటల్‌ ఎమర్జెన్సీ విభాగంలో చేర్చారు. గజేంద్రకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి  ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఎమర్జెన్సీ(Emergency)విభాగం డాక్టర్లు తెలిపారు. ఇవాళ ఉదయం ఆరున్నర గంటల సమయంలో గజేంద్రకు విపరీతమైన చాతి నొప్పితో పాటు కాళ్లు చేతులు బిగుసుకుపోవడం చూసిన కుటుంబ సభ్యులు డాక్టర్‌కి చెప్పేందుకు వెళ్లారు. ఆ సమయంలో డాక్టర్లు కొద్దిగా సేపు ఆగి వస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని గజేంద్ర కుటుంబ సభ్యులు అంటున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే గజేంద్ర మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి వచ్చి ట్రీట్‌మెంట్ చేసి ఉంటే బ్రతికే వాడని కన్నీరుమున్నీరుగా విలపించారు.

రోగి ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం ..
తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి.  అయినా  వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిలో ఒక టీటీడీ ఉద్యోగికే సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వలేని స్థితిలో డాక్టర్లు ఉండటం దురదృష్టకరమని మృతుడు గజేంద్ర బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గజేంద్ర మృతికి కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మృతుడు గజేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.

డాక్టర్ల వల్లే చెడ్డ పేరు..
తిరుపతితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఎంతో మందికి మెరుగైన వైద్య సేవలందించాలన్న మంచి లక్ష్యంతో టీటీడీ స్విమ్స్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ఇక్కడకు రోగులతో పాటు టీటీడీలో పనిచేస్తున్న సిబ్బంది,ఉద్యోగులు, పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు కూడా వైద్య సేవలు పొందుతారు.

మీ నగరం నుండి (​తిరుపతి)

ఆంధ్రప్రదేశ్
​తిరుపతి
ఆంధ్రప్రదేశ్
​తిరుపతి
Published by:Siva Nanduri
First published:

Tags: Tirupati, Ttd

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు