హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Super Husband: బాహుబలి భర్తను చూశారా..? ఏం చేశాడో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..?

Super Husband: బాహుబలి భర్తను చూశారా..? ఏం చేశాడో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..?

బాహుబలి భర్త ఏం చేశాడంటే?

బాహుబలి భర్త ఏం చేశాడంటే?

Super Husband: భర్త అంటే భాద్యతలు మోసేవాడే అంటారు.. సంసార బాధ్యతలను తన భుజాలపై మోస్తుంటాడు.. ఇది ఏ భర్తకైనా తప్పనిదే.. కానీ ఈ భర్త మాత్రం నిజంగానే బాహుబలి లాంటి వాడు.. తిరుమలలో ఆ భర్త చేసిన పని చూసి అంతా నోరెళ్ల బెడుతున్నారు.. ఏం చేశాడో చూడండి

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  Super Husband: కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాత.. శయనేషు రంభ.. అని భార్య గురించి చెబుతుంటారు. అదే భర్త అయితే భరించేవాడు అంటుంటారు. అదెంతవరకూ నిజమో తెలియకపోవచ్చు.. అయితే పెళ్లైన కొత్తలో (Newly Married Couple) ఇలాంటి ప్రేమలు సర్వసాధారణమే.. భార్య (Wife) కాలు కింద పెట్టకుండా ప్రేమగా చూసుకునే భర్తలు చాలామందే ఉన్నారు. అలా అని ఈ జంట నవ జంట కాదు.. వీరికి పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో చెబితే ఆశ్చర్యపోతారు. వీరి వివాహం 1998లో జరిగింది అంటే వీరి వివాహమై ఇరవై నాలుగేళ్లు దాటింది. వీరి ఇద్దరమ్మాయిలకూ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. తాత, అమ్మమ్మలు అయిపోయారు. అయినా బార్యపై అతడు చూపించిన ప్రేమ చూసిన అంతా నోరెళ్ల బెడుతున్నారు. ఏ జరిగింది అంటే.. వీరి పెద్ద అల్లుడు గురుదత్త అలియాస్ చందు.. ఓ మొక్కు మొక్కుకున్నాడు. తనకు మంచి సాప్ట్ వేర్ ఉద్యోగం వస్తే అటు పుట్టింటివారిని, ఇటు అత్తంటి వారిని తిరుమల తీసుకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు. ఉద్యోగం రావడంతో బస్సులో నలభై మందిని తిరుపతి (Tirupati) తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే ఈ సత్తిబాబు సాహసం చేశారు.

  సాధారణంగా గోదారోళ్ళు అంటే ఎటకారమే కాదు భక్తి, ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు. ఊరికే మాటలు చెప్పడం కాదు.. చేతలతో చూపిస్తుంటారు. అలాంటి దంపతులను ఇక్కడ చూడొచ్చు. వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య మీరు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కమని సరదాగా సవాల్ చేసింది. భార్య సవాల్ చేయడంతో తగ్గేదే లే అన్నాడు సత్తిబాబు. ఆ సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్న సత్తిబాబు భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు.

  Real Bahubali Husband || భరించేవాడే భర్త అని నిరూపించిన సత్తిబాబు.. అలాగ... https://t.co/NgYNRIDadN via @YouTube #Tirupati #Tirupathi #Tirupathi #brahmotsavalu #Konaseema

  వివాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు) లావణ్య దంపతులు ఏడుకొండలు దర్శనానికి తిరుపతి వెళ్లారు. గోదావరి జిల్లాల వారు అధికంగా కాలినడకనే ఏడు కొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. వీరు కూడా శ్రీవారి మెట్ల గుండా నడిచి వెళ్తున్నారు.

  ఇదీ చదవండి : ఏపీలో ఉన్నత విద్య చదవాలి అనుకున్న వారికి గుడ్ న్యూస్.. దరఖాస్తకు గడువు పెంపు.. ఎలా అప్లై చేయాలి? అర్హతలేంటి?

  సత్తిబాబు మాత్రం.. భర్త అంటే భార్యను మోసేవాడు అని నిరూపించాడు. వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య భార్య కోరిక కోరింది. మీరు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కమని సరదాగా సవాల్ చేసింది. అలాంటి సవాల్ విసిరితే.. నవ్వి ఊరుకుంటారు కొందరు. అదేదో సినిమాలో హీరో గోపీచంద్ హీరోయిన్ ని వందల మెట్లు ఎక్కి దైవదర్శనానికి తీసికెళతాడు. భార్య సవాల్ ని కూడా సత్తిబాబు ఇజ్జత్ కా సవాల్ గా స్వీకరించాడు. భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే ఫోటోలు,వీడియోలు తీయడానికి మిగిలిన భక్తులు పోటీపడ్డారు.

  ఇదీ చదవండి : మంత్రి రోజా బైక్ ర్యాలీ.. నాలుక కోసి కారం పెడతానంటూ వార్నింగ్

  అయితే పెళ్లైన కొత్తలో భర్తలు ఇలాంటి సహసాలు చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు.. కొత్త మోజులే అని సర్దిచెప్పుకుంటారు. కానీ వీరికి పెళ్లూఏకంగా ఇరవై నాలుగు వసంతాలు అయింది. పెళ్ళయిన తర్వాత 10.. 15 ఏళ్లకు భార్యపై భర్తకు, భర్తపై భార్యకు వివిధ కారణాల వల్ల ప్రేమలు తగ్గిపోతాయి. భార్య ఏం అడిగినా చూద్దాంలే అని భర్త… భర్త అడిగినదానికి ముభావంగా భార్య సమాధానాలు మనం చూస్తుంటాం. కానీ ఈ గోదారి సత్తిబాబు మాత్రం భార్య అడిగినదానిని కాదనలేకపోయాడు. ఇలా బాహుబలిగా మారాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అుతున్నాయి. వీడు మామూలోడు కాదు అంటూ అక్కడ కామెంట్లు వినబడ్డాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Tirumala tirupati devasthanam

  ఉత్తమ కథలు