Home /News /andhra-pradesh /

TIRUPATI RAINS HEAVY RAINS FLOOD MANY AREAS VEHICLES AND ANIMALS WASHED AWAY IN FLOOD STREAM IN TIRUMALA SK

Tirupati: తిరుపతిపై జలఖడ్గం.. కనివినీ ఎరుగని వరద బీభత్సం.. షాకింగ్ వీడియోలు

తిరుమల తిరుపతిలో వరద బీభత్సం

తిరుమల తిరుపతిలో వరద బీభత్సం

Tirumala Rains: కనివినీ ఎరుగని రీతితో వరద ముంచెత్తిందని వాపోతున్నారు. శ్రీనివాసుడా... ఈ జలఖడ్గం నుంచి తిరుమల, తిరుపతిని నువ్వే కాపాడాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

    తిరుమల తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో తిరుమల గిరులన్నీ జలపాతాల్లా మారాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా వరద నీరే. వరద వెళ్లే కాలువలు చిన్నగా ఉండడం.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో.. కాలనీలన్నీ నదుల్లా మారిపోయాయి. వాహనాలు, జంతువులు కళ్ల ముందే కొట్టుకుపోయాయి. ఇళ్లలోని సామానులు కాగితపు పడవల్లా నీటితో తేలియాడుతూ వెళ్లిపోయాయి. తిరుమల, తిరుపతిలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యాలను చూడలేదని స్థానికులు తెలిపారు. కనివినీ ఎరుగని రీతితో వరద ముంచెత్తిందని వాపోతున్నారు. శ్రీనివాసుడా... ఈ జలఖడ్గం నుంచి తిరుమల, తిరుపతిని నువ్వే కాపాడాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. 1996 తర్వాత ఈ స్థాయిలో వరదను ఎప్పుడూ చూడలేదని... ఇంతటి ప్రకృతి విపత్తును ఊహించలేదని చెబుతున్నారు.



    కపిలతీర్థం వద్ద వరద పరిస్థితి



    తిరుపతి వీధుల్లో ఈతకొడుతున్న స్థానికులు



    వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న పశువులు, జంతువులు



    కపిలతీర్థం



    వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన స్థానికులు



    వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి



    ఘాట్‌రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు



    కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్న వాహనాలు



    వరదలో కొట్టుకుపోతున్న గేదెలు



    నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆటోలు



    ఘాట్ రోడ్లలో వరద ప్రవాహం



    వరద ప్రవాహంలో చిక్కుకున్న వాహనాలు



    తిరుమల ఆలయ పరిసరాలు



    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతోనే తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి గురించి ప్రత్యేకంగా చర్చించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Heavy Rains, Tirumala, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు