హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Psycho: నీ భర్తను వదిలేసి నాతో వచ్చేయ్.. అర్ధరాత్రి మహిళ ఇంటిముందు ప్రేమోన్మాది హల్ చల్.. అక్కడితో ఆగలేదు..

Psycho: నీ భర్తను వదిలేసి నాతో వచ్చేయ్.. అర్ధరాత్రి మహిళ ఇంటిముందు ప్రేమోన్మాది హల్ చల్.. అక్కడితో ఆగలేదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో ప్రేమోన్మాదుల (Psycho) ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. ప్రేమ అనే పేరుతో ఉన్మాదంగా వ్యహరిస్తూ ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు.

  GT Hemanth Kumar, Tirupati, News18

  ప్రేమోన్మాదుల (Psycho) ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. ప్రేమ అనే పేరుతో ఉన్మాదంగా వ్యహరిస్తూ ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. స్కూలుకు వెళ్లే బాలికల నుంచి నుంచి పెళ్ళైన వివాహిత వరకు ఇలాంటి వేధింపుల తప్పడం లేదు. కొందరు ఉన్మాదులు పెళ్ళైన మహిళలను టార్గెట్ చేస్తూ ప్రేమ.... ప్రేమ అంటూ వారి వెంట పడుతూ విసిగిస్తుంటారు. ఓ గుర్తుతెలియని ఉన్మాది వివాహితను భర్తను వదిలి వచ్చేయాలంటూ వేధింపులకు దిగాడు. అర్ధరాత్రి ఆమె ఇంటి ముందు వీరంగం సృష్టించాడు. అంతేకాదు కార్లకు నిప్పుపెట్టి గోడలపై పిచ్చిరాతలు రాశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లాలో (Ananthapuram District) చోటు చేసుకుంది. ఇంతకీ ఆ పని చేసిందెవరు.. ఆమెను వేధిస్తున్నదెవరనేది మిస్టరీగా మారింది. అర్ధరాత్రి సైకో హల్ చల్ చేయడంతో గ్రామస్తులు కూడా బిక్కుబిక్కుమంటున్నారు.

  వివరాల్లోకి వెళితే....అనంతపురం జిల్లా అరకటవేముల గ్రామంలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అర్ధరాత్రి ఓ ఇంటి ముందు భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఏదో జరుగుతోందని చుట్టుపక్కలవారు పరుగులు పెట్టుకుంటూ రాగా.. పరిమి నారాయణ అనే వ్యక్తికి చెందిన డస్టర్ కారు.. ఆ పక్కనే ఉన్న సిఫ్ట్ కారుకు మంటలు అంటుకున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు అంటుకున్నాయని అందరూ భావించారు.

  Love Harassment, Harassment, Psycho Harassing Woman, Psycho, Anantapuram District, Anantapuram News, Andhra Pradesh News, Andhra News, AP News, Telugu News, Breaking news in Telugu, Telugu Breaking news, Andhra Breaking news, Andhra Updates, Telugu Updates, ప్రేమ పేరుతో వేధింపులు, ప్రేమోన్మాది, సైకో వేధింపులు, సైకో, అనంతపురం జిల్లా, అనంతపురం వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్, తెలుగు అప్ డేట్స్, ఆంధ్రా అప్ డేట్స్
  గోడపై సైకో రాసిన రాతలు

  ఇది చదవండి: విశాఖ బాలిక మృతిపై మంత్రి, ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. లిఫ్టులో రక్తపుమరకలు ఎవరివి..?  గోడమీద రాతలు...

  ఐతే ఆ పక్కనే గోడమీద ఉన్న రాతలు చూసి అందరూ షాకయ్యారు. స్థానికంగా ఓ వివాహితను ఓ ప్రేమోన్మాది వేధిస్తున్నాడు. నిత్యం ఆమె వెంటపడుతూ నువ్వే ప్రాణం అంటూ వెంటపడుతూ వేధిస్తున్నాడు. భర్తకు విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. విడాకులు తీసుకోకుంటే నిన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఆమె ఇంటి వద్దకు వచ్చి నువ్వంటే నాకిష్టం.. వచ్చేయ్ అంటూ కేకలు వేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు భర్తకు విడాకులిచ్చి వచ్చేయాలంటూ గోడపై రాశాడు.

  ఇది చదవండి: హెరాయిన్ కేసులో సంచలన నిజాలు.. విజయవాడతో లింక్ ఎలా కుదిరిందంటే.!  వచ్చింది ఎవరు..?

  అర్థరాత్రి శబ్దాలు రావడంతో తలుపు తెరిచి చూసిన యజమాని నారాయణకు అగ్నికి ఆహుతి అవుతున్నకారు కనిపించడం తో కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి మంటలను అదుపుచేశారు. విషయం తెలుసుకున్న పుట్లూరు రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. యజమాని నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అరకటవేములలలో కార్లకు నిప్పు అంటించడం వెనుక కారణం..? గోడపై అలాంటి రాతలు రాసింది ఎవరు..? ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అందులో ఒకే ఇంటి వద్ద ఉన్న రెండు కార్లకు నిప్పు అంటించడం వెనుకఉన్న అసలు కారణం ఏంటి..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆ సైకో కోసం గాలిస్తున్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న వివాహిత నుంచి కూడా వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Harassment, Psycho

  ఉత్తమ కథలు