Draupadi Murmu : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) రెండో రోజు పర్యటన నేడు కొనసాగనుంది. ప్రస్తుతం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఉన్న ఆమె.. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30కి శ్రీ వరాహ స్వామి వారినీ, 9.40కి శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి వచ్చి.. బ్రేక్‌ఫాస్ట్ చేసి తిరుపతికి వెళ్తారు. ఐతే.. ఆమె.. ఈ నెల 28న శీతాకాల విడిది కోసం తెలంగాణ వస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కి వస్తారు. తన పర్యటనలో భాగంగా ఆమె.. 29న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అదే రోజు సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో ప్రముఖులు, ఉన్నతాధికారులకు టీ పార్టీ ఇస్తారు. డిసెంబర్ 30న ఆమె తిరిగి ఢిల్లీ వెళ్తారు.
నిన్న ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన రాష్ట్రపతి.. తాడిగడప పురపాలక సంఘం పరిధిలో.. పోరంకి మురళి రిసార్టులో.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పౌర సన్మాన కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వం తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సన్మానించారు. ద్రౌపది ముర్ము.. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారనీ.. ఆమె అందరికీ ఆదర్శప్రాయం అని సీఎం జగన్ అన్నారు.
తర్వాత విజయవాడలోని రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్ ఏర్పాటు చేసిన విందులో ముర్ము పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30కి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్లారు. అక్కడ రామకృష్ణ బీచ్ (RK Beach)లో తూర్పు నౌకాదళం జరిపిన నౌకాదళ (Navy Day Celebration) దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.