Home /News /andhra-pradesh /

TIRUPATI POLITICAL DISCUSSION OVER TDP CHIEF NARA CHANDRA BABU NAIDU KUPPA TOUR AFTER PARISHAT ELECTIONS RESULTS FULL DETAILS HERE PRN TPT

CBN Kuppam Tour: చంద్రబాబు కుప్పం టూర్ వెనుక కారణం ఇదేనా..? తమ్ముళ్లు దారికొస్తారా..?

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం (Kuppam Assembly Constituency) ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు (TDP Chief Nara Chandra Babu Naidu) కంచుకోట. ఇక్కడ చంద్రబాబు చెప్పిందే మాట.., చేసిందే శాసనంగా సాగిపోతుంది. కానీ ఇటీవల అక్కడ పరిస్థితులు మారాయి.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupati, News18

  చిత్తూరు జిల్లాలోని (Chittoor District) కుప్పం నియోజకవర్గం (Kuppam Assembly Constituency) ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) కంచుకోట. ఇక్కడ చంద్రబాబు చెప్పిందే మాట.., చేసిందే శాసనంగా సాగిపోతుంది. ఓటమెరుగని సూర్యునిలా చంద్రబాబు 1989 నుంచి 2019 ఎన్నికల వరకు వరుస విజయాలతో కుప్పం దూసుకెళ్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఇక్కడ చంద్రబాబు మాటే సాగుతుంది. అయితే 2019 ఎన్నికల అనంతరం కుప్పంలో క్రమంగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఎలాంటి ఎన్నికలైనా కుప్పంలో టీడీపీదే పైచేయి. కానీ ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. పంచాయితీ ఎన్నికల నుంచి ఎంపీపీ ఎన్నికల కుప్పంలో టీడీపీకి ఘోరమైన ఓటమి తప్పలేదు. పార్టీ పోటీలో ఉన్న లేకున్నా టీడీపీ బలపరిచిన అభ్యర్థినే అధిక శాతం గెలిపించుకోవడం కుప్పం ప్రజల ఆనవాయితీ. కానీ గత రెండున్నరేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికితోడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తిన విభేదాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి.

  ఈ ఏడాది పంచాయితీ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు మూడు రోజుల కుప్పంలో పర్యటించారు. ఆ పర్యటనలో నేరుగా కార్యకర్తలనే తప్పుబడుతూ చంద్రబాబు ప్రసంగించారు. అప్పుడు చంద్రన్న ముందు సైలెంట్ అయినా కార్యకర్తలు మనుసులో మాత్రం ఆయన మాటలు జీర్ణించుకోలేక పోతున్నారట. కుప్పంలో చంద్రబాబు లేకున్నా పార్టీ వ్యవహారాలు చూసేందుకు మనోహర్, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ఉన్నారు. దీంతో అక్కడ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని అధిష్టానం భావిస్తోంది. ఐతే అసలు వివాదం కార్యకర్తలకు చబుద్రబాబుకి చెడింది ఇక్కడే అంటూ బలమైన టాక్. మనోహర్ ను పార్టీ నుంచి తొలగించాలని కార్యకర్తల డిమాండ్. కానీ చంద్రబాబు అందుకు ససేమేరా అన్నారట. వారిని మార్చే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పేశారట. మనోహర్ లేకుంటే మీలో ఎవరు ఆ బాధ్యతలు చూస్తారని ప్రశ్నించారట.

  ఇది చదవండి: నగరిలో రోజాకు తప్పని తలనొప్పులు... సొంత నియోజకవర్గంలో మాట నెగ్గకపోతే ఎలా..?  ఆ మూడు రోజుల పర్యటన పార్టీలో ఊపునిచ్చింది అనుకున్నారట చంద్రబాబు.. కానీ స్థానిక నాయకత్వం పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరించడం లేదంటే అసలు పట్టించుకోకపోవడం చేస్తోందట. మరికొందరు పెద్దిరెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ లో వైసీపీ కండువాలు కప్పుకొన్నారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో మళ్లీ సీన్ రివర్స్ అయింది. 44 మంది పోటీ చేసినా గెలుస్తామనుకున్న స్థానాల్లో టీడీపీ ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో ఆలోచనలో పడ్డ చంద్రబాబు... మరోసారి కుప్పం పర్యటనకు సిద్ధమయ్యారు.

  ఇది చదవండి: అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పిన తారక్..  పక్క వ్యూహాలతో ప్రత్యర్థులను బురిడీ కొట్టేలా చేస్తాడని చంద్రబాబుకి పేరుంది. పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ బలోపేతానికి, నాయకులు.., కార్యకర్తల మధ్య సయోధ్య కుదిర్చే విధంగా పలువులు కదిపేందుకే చంద్రబాబు మరోమారు కుప్పంలో పర్యటన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా మారుతున్న పరిణామాలను చక్కదిద్దే విధంగా ఈ సారి ఆయన టూర్ ఉంటుందని క్యాడర్ బలంగా నమ్ముతోంది. పార్టీకి ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకొనే విధంగానూ, వైసీపీ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపే శైలిలో యాత్ర సాగబోతోంది.

  ఇది చదవండి: ముందస్తు ఎన్నికల వ్యూహంలో సీఎం జగన్..? దీనివెనుక అసలు కారణం ఇదేనా..!  బాబు టూర్ ఇలా..
  ఈ నెల 12,13,14 తేదీల్లో చంద్రబాబు కుప్పం నియోజకర్గంలో పర్యటిస్తారు. 12న విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో చేరుకుంటారన్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన కోలారు, కేజీఎఫ్‌, బంగారుపేట మీదుగా రాళ్లబూదుగూరుకు చేరుకుంటారు. కుప్పం ఆర్టీసీ బస్టాండులో మధ్యాహ్నం 1.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలు ప్రజలను ఉధ్యేసించి ప్రసంగం చేస్తారు. 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటిస్తారు. ఇక 14న గుడుపల్లె సభలో పాల్గొని.., సాయంత్రం 4 గంటలకు సభ ముగించుకుని బెంగళూరు మీదుగా విజయవాడకు ప్రయాణమవుతారు. ఈసారి పర్యటనలోనైనా చంద్రబాబు కార్యకర్తలను బుజ్జగిస్తారా.. లేక మళ్లీ క్లాస్ పీకి వెళ్లిపోతారో వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Tdp, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు