GT Hemanth Kumar, News18, Tirupati
వాళ్లంతా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను బోధించే విద్యాసంస్థలో ఉంటున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు అర్ధరాత్రి సీసీ కెమెరాలు, సెక్యురిటీ గార్డుల కళ్లుగప్పి ఏకంగా ఎనిమిది అడుగుల ఎత్తైన గోడదూకి పారిపోయారు. పోలీసులు, మీడియా, తల్లిదండ్రులు ఎంతగాలించినా ఆచూకీ దొరకలేదు. చివరకు ఎవరూ ఊహించని విధంగా ముంబైలో ప్రత్యక్షమయ్యారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati district) చంద్రగిరిలో సంచలనం సృష్టించిన విద్యార్థినుల మిస్సింగ్ మిస్టరీ వీడింది. వివరాల్లోతి వెళ్తే.. చంద్రగిరికి సమీపంలోని తొండవాడలో శ్రీ కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంప్రదాయ పాఠశాల్లో ఈనెల 8న నలుగులు డిగ్రీ విద్యార్థినులు కాంపౌండ్ వాల్ దూకి పారిపోయారు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే పాఠశాల సెక్యూరికీ చెప్పాడు. ఐతే అప్పటికే అమ్మాయిలు అక్కడి నుంచి పారిపోయారు. ఎంతగాలించినా అచూకీ తెలియకపోవడంతో నిర్వాహకులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి కించి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో గాలించారు. విద్యార్థినుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సోషల్ మీడియాలో బాలికల ఫోటోలను చూసిన ముంబైకి చేందిన ఓ వ్యక్తి నలుగురు బాలికలను చేరదీసి, వారిని తీసుకొని విజయవాడ వైపు వస్తున్నట్లు అతనే పోలీసులకు సమాచారం అందించాడు. అప్పటికే కొల్హాపూర్లో విచారణ జరుపుతున్న ఒక పోలీసు బృందం తిరుపతి ఎస్పి ఆదేశాల మేరకు పూణే చేరుకుని పూణే పోలీసుల నుంచి బాలికలను స్వాధీనం చేసుకొని సురక్షితంగా శుక్రవారం తిరుపతికి తీసుకొచ్చారు.. దీంతో ఆ నలుగురు బాలికల ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. తిరుపతి చేరుకున్న బాలికలను చంద్రగిరి తాహసీల్దార్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.
పారిపోవడానికి కారణం ఇదే..!
సాంప్రదాయ పాఠశాలలో విశాఖపట్నంకు చెందిన రావి విద్యాలక్ష్మి వర్షిని(18), కడపకు చెందిన వెల్ల ప్రణతి(18), విజయవాడకు చెందిన జయంతి స్రవంతి(18), విజయనగరంకు చెందిన అక్కినేని శ్రీవల్లి (19)లు చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. కాలేజీ ముగిన తర్వాత వేదాలు, ఉపనిషత్తులు, సంగీతం నేర్చుకుంటూ సాంప్రదాయపాఠశాలలో హాస్టల్లోనే ఉంటున్నారు.
ఐతే హాస్టల్లో సెల్ ఫోన్లపై నిషేధం ఉంది. అయితే అక్కడ మరో ఇద్దరు యువతులు నిర్వాహకులకు తెలియకుండా సెల్ ఫోన్లు వాడుతూ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. దీనిని గుర్తించిన పాఠశాల యాజమాన్యం ఆరుగురు విద్యార్థినులను బాధ్యులుగా చేస్తూ వారికి డిగ్రీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన హాల్ టికెట్లు ఇవ్వమని హెచ్చరించారు. విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏం చేస్తారోనన్న భయంతో నలుగులు విద్యార్థినులు గోడదూకి పారిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
తిరుపతి నుండి ముంబైకి ఎలా వెళ్ళారంటే..?
గత అదివారం అర్ధరాత్రి గోడదూకి పారిపోయిన విద్యార్థినులు.. తిరుపతిలో ట్రైన్ ఎక్కి కొల్లాపూర్.. అక్కడి నుంచి ముంబై చేరకున్నారు. ముంబైలోని ఓ పార్క్ లో ఉండగా విజయవాడకు చెందిన మర్చంట్ నేవీ ఉద్యోగి అయిన మోపిదేవి శ్రీనివాస్ కంటపడ్డారు. వెంటనే వారిని చేరదీసి రక్షణ కల్పించి పోలీసులకు అప్పగించారు. కాలేజీలో లెక్చరర్లు, ఇంట్లో తల్లిదండ్రులు హెచ్చరిస్తే ఇలా పారిపోవడం సరికాదని పోలీసులు సూచించారు. అదృష్టవశాత్తూ యువతులు నేరస్తులకు చిక్కకుండా క్షేమంగా తిరిగొచ్చారని.. లేదంటా జీవితాలు బలైపోయావని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Four girls missing, Tirupati