హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Married Woman: కానిస్టేబుల్ పాడుబుద్ది.. ఇంట్లో అద్దెకుండే వివాహితను ఇలా చేస్తాడనుకోలేదు..!

Married Woman: కానిస్టేబుల్ పాడుబుద్ది.. ఇంట్లో అద్దెకుండే వివాహితను ఇలా చేస్తాడనుకోలేదు..!

సోమశేఖర్ (ఫైల్)

సోమశేఖర్ (ఫైల్)

Harassment: ఆడవారిపై అఘాయిత్యానికి పాల్పడితే కాపాడాల్సిన ఓ ఖాకీ తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓ మహిళపై కన్నేశాడు. తనను వదిలేయాలని వేడుకున్నా వినకుండా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

  GT Hemanth Kumar, Tirupati, News18

  నిత్యం మహిళలకు వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. టెక్నాలజీ పుణ్యమా అని సోషల్ మీడియా (Social Media)లో సైతం వేధింపులు ఎదుర్కొక తప్పడం లేదు. వాట్సాప్ (What’s App) , పేస్ బుక్ (Facebook), ఇన్ స్టాగ్రాం (Instagram) అంటూ సామాజిక మాధ్యమాల్లోనూ వేధింపులు ఎదుర్కొవాల్సి వస్తోంది. పేస్ బుక్ ద్వారా మెసేజ్ చేయడం.., కాల్ రికార్డ్ కాకుండా వాట్సాప్ కాలింగ్ (Whats App Calling) చేయడం చేస్తున్నారు. ఇవన్నీ ఎవరో చేస్తే సరే కామంతో కళ్ళుమూసుకుపోయి చేస్తున్నారని అనవచ్చు. ఆడవారిపై అఘాయిత్యానికి పాల్పడితే కాపాడాల్సిన ఓ ఖాకీ తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓ మహిళపై కన్నేశాడు. రూమ్ కి రా... ఎంజాయ్ చేద్దామంటూ వాట్సాప్., ఫేవ్ బుక్ ద్వారా మెసేజ్ లు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎంతో సహనంతో ఉన్న ఆ మహిళా.... అతడు విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్లోనే మహిళా ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

  వివరాలలోకి వెళితే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పలమనేరుకు చెందిన సోమశేఖర్ స్థానిక పోలిస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు పనిచేస్తూ.. గంగవరం మండలం సాయినగర్లో నివాసం ఉంటున్నాడు. తాను నివాసం ఉంటున్న ఇంటి మిద్దెపైనే కుటుంబ సభ్యులతో కలసి ఓ వివాహిత ఉంటోంది. పొరుగింటివారి పట్ల గౌరవంగా ఉండాల్సిన వాడు ఆమెపై కన్నేశాడు.

  ఇది చదవండి: మెడిసన్ చదివేందుకు ఫారిన్ వెళ్లి ఇతగాడు నేర్చుకున్నది ఇదీ.. డాక్టర్ కావాల్సిన వాడు జైలుకు వెళ్లాడు..


  ఫోన్లో వేధింపులు...

  తరచూ ఫోన్లు, మెసేజీలతో వేధించడమే కాకుండా.., నేరుగా కూడా నువ్వంటే ఇష్టం.., నా దగ్గరకురా.. అంటూ వేధించసాగాడు. అక్కడితో ఆగకుండా అసభ్యకర మెసేజులు వీడియోలను పంపుతున్నాడు. లైంగికంగా కావాలని బెదిరించేవాడు. తన ప్రవర్తనతో విసుగు చెందిన ఆ వివాహిత తన భర్తకు, పోలీసులకు పిర్యాదు చేస్తానని చెప్పింది. దీంతో సోమశేఖర్ నీ దిక్కున్నచోట చెప్పుకోవాలని.., నన్ను ఏమి చేయలేరు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.

  ఇది చదవండి: ఆ అమ్మాయిని ప్రేమించడమే ఈ కుర్రాడు చేసిన తప్పు... మరీ అంత కిరాతకమా..?  పోలీసులకు ఫిర్యాదు...

  సోమశేఖర్ తీరుతో విసిగిపోయిన ఆ మహిళ భర్త సహకారంతో పలమనేరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. తనను తరచు కానిస్టేబుల్ సోమశేఖర్ వేధింపులకు గురి చేస్తున్నాడని స్థానిక ఎస్సైతో మొరపెట్టుకుంది. పేస్ బుక్., వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజులు సైతం చేస్తున్నాడని పిర్యాదులో పేర్కొంది. ఇదే అంశంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళా పిర్యాదు మేరకు విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను కానిస్టేబుల్ కావడంతో కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా బెదిరిస్తున్నట్లు సమాచారం. గతంలో  చిత్తూరు జిల్లాలోనే ఓ పోలీస్ అధికారి మహిళను వేధించడంతో ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై  చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే..!

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Harassment on women

  ఉత్తమ కథలు