హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati: బ్యాంకు దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్.. ఇంటి దొంగలే ఇంత స్కెచ్ వేశారా..?

Tirupati: బ్యాంకు దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్.. ఇంటి దొంగలే ఇంత స్కెచ్ వేశారా..?

ఫిన్ కేర్ బ్యాంక్ దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్

ఫిన్ కేర్ బ్యాంక్ దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్

Tirupati News: ఫైనాన్స్ కంపెనీలన్నీ నమ్మకంతోనే వ్యాపారం చేస్తుంటాయి. రుణాలిచ్చేముందు కస్టమర్ల దగ్గర పత్రాలు, బంగారం సరిగా ఉన్నాయా లేదా అనేది ఒకటికి పదిసార్లు చెక్ చేస్తారు. ప్రతి సంస్థ ఉద్యోగులపై నమ్మకంతోనే వ్యాపారాన్ని సాగిస్తుంటాయి. కానీ కొందరు ఉద్యోగులు మాత్రం ఓవర్ నైట్ కోటీశ్వరులు కావాలని పగటి కలలుగంటారు.

ఇంకా చదవండి ...

  GT Hemanth Kumar, News18, Tirupati

  ఫైనాన్స్ కంపెనీలన్నీ నమ్మకంతోనే వ్యాపారం చేస్తుంటాయి. రుణాలిచ్చేముందు కస్టమర్ల దగ్గర పత్రాలు, బంగారం సరిగా ఉన్నాయా లేదా అనేది ఒకటికి పదిసార్లు చెక్ చేస్తారు. ప్రతి సంస్థ ఉద్యోగులపై నమ్మకంతోనే వ్యాపారాన్ని సాగిస్తుంటాయి. కానీ కొందరు ఉద్యోగులు మాత్రం ఓవర్ నైట్ కోటీశ్వరులు కావాలని పగటి కలలుగంటారు. అందుకే తిన్నింటి వాసాలు లెక్కేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati District) లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.., శ్రీకాళహస్తి పట్టణంలోని పెద్దమసీదు వీధిలో గత మూడేళ్లుగా ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్ధ‌ ఓ బ్రాంచ్ ను నిర్వహిస్తోంది. శ్రీకాళహస్తి పట్టణంకు చెందిన వారే కాకుండా, చుట్టు‌ప్రక్కల‌ ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్ధలో ఎంతో‌ నమ్మకంతో నగదు, బంగారు నగలను దాచుకుంటూ ఉంటారు.

  ఈ క్రమంలో ఫైనాన్స్ సంస్ధలో‌ ఈ నెల 26న దోపిడీ జరిగిదన్న వార్తలు, స్థానికంగా కలకలం రేపాయి. సిబ్బంది ఎవరి పనుల్లో వాళ్లుండగా.. దుండగులు వచ్చి నోట్లో గుడ్డలు కుక్కి.. రూ.80 లక్షల విలువ గల‌ బంగారు నగలు, నగదును దోచుకెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలంకు చేరుకుని ఫైనాన్స్ కంపెనీలో‌ పని చేసే ఉద్యోగులు అందరిని‌ పిలిచి విడిచిడిగా విచారించారు.

  ఇది చదవండి: సంక్షేమ పథంలో సవాళ్ల ప్రయాణం.. మూడేళ్లు పూర్తి చేసుకున్న జగన్ సర్కార్..


  అయితే ఉద్యోగులను ప్రశ్నిస్తున్న క్రమంలో పోలీసులకు పలు అనుమానాలు రేకెత్తాయి. దోపిడీ జరిగిందంటూ చెప్తున్న మాటలకు, ఉద్యోగుల తీరుకు పొంతనలేకపోవడంతో మరింత లోతుగా విచారించారు. ఉద్యోగుల్లో ఇద్దరు చెప్పిన మాటలపై డౌట్ రావడంతో వారిని విడివిడిగా పిలిచి ప్రశ్నించారు. ఆ ఇద్దరే ఇందులో సూత్రధారులుగా నిర్ధారించుకొని దర్యాప్తు చేయగా.. పట్టణానికి చెందిన ఓ అంబులెన్స్ డ్రైవర్, అతడి భార్యకు దీనితో సంబంధమున్నట్లు తేల్చారు. ఈ నలుగుర్నీ తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

  ఇది చదవండి: పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్.? త్వరలోనే రంగంలోకి.. బాబు స్కెచ్ ఇదేనా..?


  ఫైనాన్స్ కంపెనీలో‌ దొంగలించిన‌ సొమ్మును చెన్నైలో ఓ ద్విచక్ర వాహనం మెకానిక్ వద్దకు తరలించినట్లు పోలీసులు గుర్తించి, చెన్నైకు వెళ్ళిన ఓ‌ పోలీసు బృందం మెకానిక్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటుగా ఫైనాన్స్ కంపెనీలో‌ పని చేసే ఓ యువతితో ప్రేమాయణం సాగిస్తున్న యువకుడిపై పోలీసులు అనుమానం‌ వ్యక్తం చేస్తూ అతగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫైనాన్స్ కంపెనీలో‌ రూ.80లక్షలు దోపిడీకి గురైనట్లు ఉగులు చెప్తుంటే.. కాదు కోటి రూపాయలని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు అంటున్నారు. ఇదంతా ఇంటి దొంగల పనేనని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఖాతాదారుల వివరాలు కూడా సేకరిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Robbery, Tirupati

  ఉత్తమ కథలు