హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్సై.. కానీ రెండేళ్లకే రూటు మార్చాడు.. ఏకంగా కోర్టు వద్దే భార్యపై..

Nellore: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్సై.. కానీ రెండేళ్లకే రూటు మార్చాడు.. ఏకంగా కోర్టు వద్దే భార్యపై..

నాగార్జున, లావణ్య (పెళ్లి ఫోటో)

నాగార్జున, లావణ్య (పెళ్లి ఫోటో)

Nellore: పెళ్లైన రెండు నెలల తర్వాత నాగార్జునకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. భర్త పోలీస్ కావడంతో లావణ్య ఆనందంతో పొంగిపోయింది. ట్రైనింగ్ పూర్తైన అనంతరం గుంటూరు జిల్లా (Guntur District) అచ్చంపేట ఎస్సైగా పోస్టింగ్ వచ్చింది. ఐతే ఆ ఆనందం లావణ్యకు ఎంతోకాలం నిలవలేదు.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, Tirupathi, News18

పెళ్లంటే ఓ జంట నిండు నూరేళ్లు కలిసి సాగించే ప్రయాణానికి నాంది. అగ్ని సాక్షిగా తాళికట్టిన భార్యను ప్రేమ చూసుకోవాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది. అందునా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అయితే మరింత ప్రేమగా చూసుకోవాలి. పెళ్లికి ముందు నువ్వే సర్వస్వం అను మాటలు చెప్పిన భర్త.. తీరా పెళ్లై పోలీస్ ఉద్యోగం వచ్చిన తర్వాత బుద్ధి మార్చుకున్నాడు. అప్పటివరకు నువ్వ తప్ప ఎవరూ వద్దన్నవాడు ఆ తర్వాత కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. అడిగిందల్లా కొనివ్వాల్సిన వాడు అడిగినంత ఇస్తేనే కాపురం చేస్తానంటూ చిత్రహింసలు గురిచేశాడు. పోలీస్ కంప్లైంట్లు, పెద్దల పంచాయతీలు నడిచినా మార్పురాలేదు. చివరకు భార్యను వదిలించుకునేందుకు విడాకుల కోసం కోర్టుకెక్కాడు. ఏకంగా కోర్టులోనే భార్యపై దాడికి యత్నించాడు. కట్నం కోసం దిగజారి ఉద్యోగాన్ని కూడా ప్రమాదంలో పెట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore District) సంగం గ్రామానికి చెందిన నాగార్జున తనకు సమీప బంధువైన లావణ్యను 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన రెండు నెలల తర్వాత నాగార్జునకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. భర్త పోలీస్ కావడంతో లావణ్య ఆనందంతో పొంగిపోయింది. ట్రైనింగ్ పూర్తైన అనంతరం గుంటూరు జిల్లా అచ్చంపేట ఎస్సైగా పోస్టింగ్ వచ్చింది. అక్కడే భార్యతో కొత్త కాపురాన్ని మొదలుపెట్టాడు. ఐతే కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. 2019లో భర్త నాగార్జున అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ ఎదుటే లావణ్య పోలీస్ స్టేషన్ ఎదుటే ధర్నాకు దిగింది. దీంతో పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పి కాపురానికి పంపారు.

ఇది చదవండి: పెళ్లై ఏడాది కాలేదు.. అప్పుడే పాడుబుద్ధి పుట్టింది.. చివరికి ఏం జరిగిందంటే..!


ఐతే ఈ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత తనకు విడాకులు కావాలంటూ నాగార్జున ఆత్మకూరు కోర్టును ఆశ్రయించాడు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఐతే గురజాల ఎస్సైగా పనిచేస్తూ మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతుండటంతో యువతి తల్లిదండ్రులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 2వ తేదీన అతడ్ని వీఆర్ కు పంపంతూ ఆదేశాలిచ్చారు.


ఇది చదవండి: బాలుడితో యువతి లవ్ ఎఫైర్.. లేచిపోయి గుడిలో పెళ్లి.. సాయంత్రానికి ఊహించని ట్విస్ట్..

ఈ నేపథ్యంలో బుధవారం ఆత్మకూరు కోర్టుకు వాయిదా కోసం వచ్చిన భార్య లావణ్యపై కోర్టు ఆవరణలోనే ఎస్సై నాగార్జున విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు అడ్డొచ్చిన అత్తమామలను కూడా చితకబాదాడు. భర్తదాడిలో తీవ్రంగా గాయపడిన లావణ్య ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఐతే ఇంత జరిగినా భర్తతో కాపురం చేయడానికి తాను సిద్ధమైనని లావణ్య చెప్పడం గమనార్హం.

First published:

Tags: Andhra Pradesh, Nellore Dist, Wife and husband

ఉత్తమ కథలు