హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cheating: ఈ చెంబు మీ ఇంట్లో ఉంటే దరిద్రం పరార్... యూట్యూబ్ లో చూసి ఏం స్కెచ్ వేశాడు..!

Cheating: ఈ చెంబు మీ ఇంట్లో ఉంటే దరిద్రం పరార్... యూట్యూబ్ లో చూసి ఏం స్కెచ్ వేశాడు..!

పోలీసులు స్వాధీనం చేసుకున్న చెంబు

పోలీసులు స్వాధీనం చేసుకున్న చెంబు

అమాయకులను మోసం (Cheating) చేస్తున్న ముఠాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చాలానే వెలుగు చూశాయి. తాజాగా తిరుపతి (Tirupahti) పోలీసులు ఇలాంటి గ్యాంగ్ ఆట కట్టించారు. మోసాలు ఇలా కూడా చేయొచ్చాని పోలీసులే షాకయ్యారు.

ఈ రోజుల్లో సైన్స్ కంటే బాబాలకే క్రేడ్ ఎక్కువ. లాజిక్ కంటే మ్యాజిక్ నమ్మే జనాలకు కొదవే లేదు. కష్టపడకుండేనే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలని కలలుకనేవారు ఇంటికొక్కురుంటారంటే అతిశయోక్తికాదు. ఇందుకోసం కష్టపడటం మానేసి మూఢనమ్మకాలను(Superstitions) ఆశ్రయిస్తుంటారు. పూజలు, చేతడబడులు, రైస్ పుల్లింగ్ ను నమ్మి మోసపోతుంటారు. ఇలాంటి అత్యాసపరులు ఉన్నన్ని రోజులు మోసాలకు పాల్పడే కేటుగాళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి. జనాల బలహీనతను ఆసరాగా చేసుకొని లక్షలు కొట్టేసేందుకు సిద్ధమైపోతుంటారు. ఇలా రైస్ పుల్లింగ్ పేరిట అమాయకులను మోసం (Cheating) చేస్తున్న ముఠాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చాలానే వెలుగు చూశాయి. తాజాగా తిరుపతి (Tirupahti) పోలీసులు ఇలాంటి గ్యాంగ్ ఆట కట్టించారు. మోసాలు ఇలా కూడా చేయొచ్చాని పోలీసులే షాకయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా (Chittoor District) మదనపల్లెకు చెందిన బండారి హేమంత్ కుమార్ అనే యువకుడు యూట్యూబ్ లో చూసి రైస్ పుల్లింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఓ రాగి చెంబుకు కొన్ని రసాయనాలు పూసి బియ్యాన్ని ఆకర్షించేలా తయారు చేశాడు. దానికి అతీత శక్తులున్నాయని నమ్మించి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేశాడు. అలా గుంటూరు జిల్లా (Guntur District) పెదకాకానికి చెందిన షేక్ యాసిన్ అనే వ్యక్తికి చూపించి ఆ చంబుకు అతీత శక్తులున్నాయని చెప్పాడు.

ఇది చదవండి: ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రూ.10లక్షలు పోయాయి.. కేటుగాళ్ల తెలివి మాములుగా లేదుగా..!దీంతో ఆ చెంబును కొనేందుకు యత్నించిన యాసిన్ రూ.1.54 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. చెంబును తీసుకునేందుకు తన స్నేహితుడితో కలిసి తిరుపతికి వచ్చాడు యాసిన్. స్థానిక సత్యానారాయణపుం సర్కిల్లో హేమంత్ తన స్నేహితులైన మనోజ్ కుమార్, విజయ్ కుమార్, బిర్ల నాగరాజుతో కలిసి ఆ చెంబును యాసిన్ కు చూపించారు. ఐతే ఆ చెంబుకు ఎలాంటి శక్తులు లేవని గ్రహించి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.54 లక్షల నగదు, రాగి చెంబును స్వాధీనం చేసుకున్నారు.

ఇది చదవండి: లవర్స్ మధ్య ఎంటరైన మూడో వ్యక్తి.. అన్ని రకాలుగా బ్లాక్ మెయిల్ చేశాడు.. చివరికి ఏమైందంటే..!


గతంలో విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేసేందుకు యత్నించిన ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు సంతబొమ్మాళి మండలం, దండుగోపాలపురానికి చెందిన కిరణా వ్యాపారి పి.శ్రీనివాసరావు జీవితంపై అసంతృప్తితో ఉండేవాడు. తన జీవితంలో ఎదుగూబొదుగూ లేదని బాధపడేవాడు. ఇతడికి విజయనగరానికి చెందిన స్వర్ణకారుడు దాసరి శ్రీనివాస్ తో పరిచయం అయింది. శ్రీనివాసరావు తన మనసులోని బాధ దాసరి శ్రీనివాస్ తో చెప్పుకున్నాడు. దీంతో అతడు మాస్టర్ ప్లాన్ వేశాడు.

ఇది చదవండి: ఇంజనీరింగ్ చదివి ఇదేం పోయేకాలం..? పైత్యం పీక్స్ చేరి పోలీసులకు చిక్కాడు..!


తన దగ్గర ఓ మహిమాన్విత చెంబు ఉందని.. అది ఎవరి దగ్గర ఉంటే వారికి అదృష్టం వరిస్తుందని నమ్మించాడు. ఈ క్రమంలో చెందిన కీర్తి లక్ష్మణరావు, చందక వెంకట్రావు, పతివాడ అప్పారావును పరిచయం చేశాడు. ఆ చెంబు కావాలంటే రూ.25 కోట్లు ఇవ్వాలని కీర్తి లక్ష్మణరావు కోరాడు. వారి మాటల నమ్మిన శ్రీనివాసరావు అతడికి శ్రీనివాసరావు రూ.25 లక్షలు ఇచ్చాడు. ఆ చెంబును మరో వ్యాపారికి రూ.50 కోట్లకు అమ్మి రూ.25కోట్లు లక్ష్మణరావుకు ఇవ్వాలని శ్రీనివాసరావు మరో ప్లాన్ వేశాడు. కానీ అంతా తలకిందులైంది. శ్రీనివాసరావును.. దాసరి శ్రీను అండ్ కో నమ్మించి మోసం చేశారు. ఇదిగో అదుగో అంటూ ఓ రాగి చెంబును చేతిలో పెట్టారు. వారిపై అనుమానం వచ్చిన అతడు పోలీసులను ఆశ్రయించాడు.

First published:

Tags: Andhra Pradesh, Cheating

ఉత్తమ కథలు