Treasure Hunt in Tirumala: తిరుమలలో గుప్తనిధులున్నాయా...? ఆ సొరంగంలో ఏమున్నాయి..?

శేషాలచం అడవుల్లో బయటపడిన సొరంగం

శేషాచలం అడవులు (Seshachalam Forest). అరుదైన జంతువులు, అపరూపమైన వృక్షాలకు నెలవు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎర్రచందనానికి (Red Sandal) శేషాచలం నిలయం.

 • Share this:
  శేషాచలం అడవులు. అరుదైన జంతువులు, అపరూపమైన వృక్షాలకు నెలవు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎర్రచందనానికి శేషాచలం నిలయం. అన్నికంటే ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన పవిత్రమైన ప్రదేశం. దేవతలు నడయాడిన ప్రాంతంగా పేరు. నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించి తరిస్తుంటారు. కరోనా కారణంగా తిరుపతి, తిరుమల ప్రాంతంలో భక్తుల రాక రద్దీ తగ్గింది. దీంతో గుప్తనిధుల ముఠాలు బయలుదేరాయి. కర్ఫ్యూని అదునుగా చేసుకుంటున్న కొన్ని ముఠాలు శేషాచలం అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాయి. ఏకంగా ఒక ఊరి నుంచి మరొక ఊరుకు వెళ్లేలా సొరంగమార్గాన్ని తవ్వేశారు. చాలాకాలంగా సాగుతున్న ఈ తవ్వకాలకు పోలీసులు చెక్ పెట్టారు. సాధారణంగా తనిఖీల్లో భాగంగా శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన పోలీసులకు ఒక్కసారిగా షాక్ కు గురిచేసే సొరంగ మార్గం కనిపించింది. ఆ సొరంగాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు పోలీసులు. దట్టమైన అడవిలో కొండను తొలుస్తూ భారీ సొరంగాన్ని తవ్వేశారు. సొరంగమార్గం పై కేసు నమోదు చేసిన అపిలిరి పోలీసులు విచారంగా చేపట్టారు. పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.

  దాదాపు ఏడాదిన్నరగా గుట్టుగా సాగుతున్న ఈ బాగోతాన్ని అలిపిరి పోలీసులు రట్టు చేశారు. అనకాపల్లికి చెందిన పెయింటర్ మంకునాయుడు భార్యను వదిలేసి 2014లో తిరుపతికి మకాం మార్చాడు. ఎంఆర్ పల్లెలో ఉంటూ కూలీల మేస్త్రీగా పనిచేస్తూనే గుప్తనిధుల కోసం గాలించే వాడు. ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన రామయ్యస్వామితో పరిచయం ఏర్పడింది. కొన్ని పురాతన రాగిరేకులను బట్టి శేషాచలం అడవుల్లో గుప్త నిధి ఉందని రామయ్యస్వామి భావించాడు. అప్పట్నుంచి మంకునాయుడు ఆరుగురు కూలీలతో కలిసి తవ్వకాలు ప్రారంభించాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేలా మూడు నెలల వ్యవధి తో గోప్యంగా తవ్వుతూ వచ్చారు. ఇలా మంకునాయుడు బృందం 80 అడుగుల సొరంగాన్ని తవ్వింది. సొంరగ మార్గంలో త్రిశూలం గుర్తులు కూడా కనిపించాయి. అలాగే అక్కడ పూజలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

  ఇది చదవండి: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. దేశంలో ఇదే మొదటిసారి.. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు


  నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేరకు తవ్వాల్సి ఉందట. ఈ నేపథ్యంలో తవ్వకాలు సాగించేందుకు శుక్రవారం రాత్రి మంకునాయుడు కూలీలతో బయలుదేరాడు. మంగళం వెంకటేశ్వర కాలనీ సమీపంలో వీరు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో స్థానికులు అలిపిరి పోలీసులకు సమాచారమిచ్చారు. ఇలా తిరుగుతున్న ముగ్గురిని సీఐ దేవేంద్రకుమార్ అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధుల తవ్వకా లకు వచ్చినట్లు విచారణలో వారు అంగీకరించారు. వారిచ్చిన సమాచారంతో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుప్తనిధులపై వీరికి ఓ బాబా సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

  ఇది చదవండి: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి రిలయన్స్ సాయం.. ఫ్రీ పెట్రోల్, ఆక్సిజన్ సరఫరా..

  Published by:Purna Chandra
  First published: