Home /News /andhra-pradesh /

TIRUPATI POLICE ARRESTED GANJA SMUGGLING GANG IN CHITTOOR DISTRICT AND INTERESTING FACTS REVEALED FULL DETAILS HERE PRN TPT

Shocking: స్మగ్లింగ్ కు డ్రెస్ కోడ్, ముహూర్తం.. రెండేళ్లుగా సాగుతున్న దందా.. ఎలా బయటపడిందంటే.!

ఆ పని చేస్తే పథకాలు కట్

ఆ పని చేస్తే పథకాలు కట్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) రెండు రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటోంది. ఓ వైపు కర్ణాటక., మరోవైపు తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాలు 100 కిలోమీటర్ల వ్యవధిలో జిల్లాకు అనుకొని ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Tirupati, India
  GT Hemanth Kumar, News18, Tirupati

  యువతను చెడు వ్యసనాల వైపు దారి మళ్లిస్తూ తాము ఆర్థికంగా బలపడుతున్నారు కొందరు. మత్తుకు బానిసైన వాడు మత్తులోనే మునిగి తేలాలని బావిస్తుంటాడు. ఒక్కరోజు ఆ నిషా లేకుంటే పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలవాటు చేసి వాటికీ డిమాండ్ పెంచి అధిక ధరలకు విక్రయిస్తుంటారు ముఠా సభ్యలు. రెండేళ్లుగా గంజాయి అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి చేతులు మారుతూ వచ్చేది. విశాఖ., అనకాపల్లి నుంచి అక్రమ రవాణా ప్రారంభం అవుతుంది. చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి.. వాటిని రైలు., బస్సు., ఇతర వాహనాల్లో తిరుపతికి అటు నుంచి చిత్తూర్ కి తరలిస్తారు. పట్టుబడకుండా ఉండేందుకు ముఠా సభ్యులు ఏర్పాటు చేసుకున్న టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) రెండు రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటోంది. ఓ వైపు కర్ణాటక., మరోవైపు తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాలు 100 కిలోమీటర్ల వ్యవధిలో జిల్లాకు అనుకొని ఉన్నాయి. దీంతో చిత్తూరు జిల్లాను గంజాయి సప్లై జోన్ గా ఏర్పాటు చేసుకున్నారు గంజాయి అక్రమ రవాణా ముఠా. చిత్తూరు లో గత రెండేళ్లుగా ఓ ముఠా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణా సాగిస్తూ వస్తుంది. అనకాపల్లి నుంచి వచ్చే గంజాయి  చిత్తూరులో చేతులు మారుతున్నాయనే సమాచారం అందుకున్నారు పోలీసులు. ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశాలతో ఎస్సై రామకృష్ణ, సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసారు పాలిస్ అధికారులు. కొద్దిరోజుల నుంచి గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై నిఘా ఉంచారు.

  ఇది చదవండి: ప్రియుడు పోలీస్ అని భర్తకు విడాకులిచ్చింది.. కట్ చేస్తే కథ అడ్డం తిరిగింది


  తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా ఎడపాడికి చెందిన జాన్ హరి.. మొబైల్ ద్వారా కొద్దికాలంగా వ్యాపారం చేసేవారని తేలింది. అతడి అనుచరులైన ఇలవరసన్, కవిన్ కుమార్ ద్వారా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. జాన్హరి సూచనలతో ఇలవరసన్, కవినుమార్.. విశాఖపట్నం, అనకాపల్లిలో బంటు వద్ద గంజాయి కొనుగోలు చేస్తారు. దాన్ని పొట్లాల్లో బస్సు, రైలు, ఇతర వాహనాల్లో చిత్తూరుకు తీసుకొని వస్తారు. ఇలా తీసుకు వచ్చిన సరుకును ప్రత్యేక కోడ్ ద్వారా చేతులు మారుస్తారు.

  ఇది చదవండి: ల్యాండ్ లైన్ ఫోన్ కోసం హత్య.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు


  ప్రతి నెల మూడో సోమవారం గోపాలపురం బస్టాపు వద్ద మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఒకరి వద్ద నుంచి మరొకరికి చేతికి గంజాయి చేతులు మారుతుంది. చరవాణులు., ఇతర మెసేజులు ఏమి లేకుండా తెల్లచొక్కా, ఖాకీ ప్యాంట్ గుర్తుల ద్వారా కలుసుకుని గంజాయి చేతులు మార్చేస్తారు. రెండేళ్లుగా తాము అనుకున్న మూడో సోమవారమే దీన్ని చేతులు మారుస్తారు. ఈ కోడ్స్ మరియు మూడవ సోమవారంపై సమాచారం రావడంతో పోలీసుకు గంజాయి ముఠాకు ఉచ్చు బిగించారు.  మూడో సోమవారమైన 18న గోపాలపురం బస్టాప్ వద్ద నిఘ పెట్టారు. అదే సమయంలో గంజాయితో వచ్చిన సేలంకు చెందిన ఇలవరసన్, కవిన్ కుమార్, వాటిని కొనుగోలు చేసి వ్యాపారం చేయడానికి వచ్చిన ఆరుగురిని అరెస్ట. చేసారు పోలీసులు. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన భాస్కర్, తిరువణ్ణామలైకు చెందిన అజిత్, స్థానిక జోగుల కాలనీకి చెందిన రాజ్కుమార్, మురగానపల్లికి చెందిన లలిన్ కుమార్, మూడో గేటులోని లక్ష్మీనగర్కు చెందిన చంద్రు, మార్కెట్ వీధికి చెందిన పురుషోత్తం ఉన్నారు. వీరి నుంచి రూ.3 లక్షల విలువైన 20 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు .
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Ganja smuggling

  తదుపరి వార్తలు