Home /News /andhra-pradesh /

Fake Currency Gang: యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్ల ముద్రణ.. చికెన్ పకోడీ దగ్గర దొరికిపోయారు..

Fake Currency Gang: యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్ల ముద్రణ.. చికెన్ పకోడీ దగ్గర దొరికిపోయారు..

అనంతపురం జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

అనంతపురం జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

Fake Currency Gang: కొందరు మంచి మార్గంలో వెళ్తూ కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కొందరు మాత్రం ఈజీ మనీకి అలవాటు పడతారు. చెమటపట్టకుండా కోటీశ్వరులైపోవాలని స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోతుంటారు.

  GT Hemanth Kumar, Tirupati, News18

  డబ్బు సంపాదించాలంటే వంద మార్గాలు ఉంటాయని అంటారు పెద్దలు. కొందరు మంచి మార్గంలో వెళ్తూ కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కొందరు మాత్రం ఈజీ మనీకి అలవాటు పడతారు. చెమటపట్టకుండా కోటీశ్వరులైపోవాలని స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోతుంటారు. చట్టప్రకారం కష్టపడి సంపాదించిన డబ్బుకు విలువుటుంది. అలా సంపాదించిన వారికి సమాజంలో మంచి పేరుంటుంది. కానీ కానీ అడ్డదారిలో సంపాదిస్తే మాత్రం కటకటాల పాలవ్వక తప్పదు. ఈజీ మనీ కోసం గూగుల్ (Google) తల్లిని, యూట్యూబ్ మామను సాయం అడిన కొందరు యువకులకు అందులో ఓ కన్నింగ్ ఐడియా దొరికింది. ఏళ్ల తరబడి చదివినా అబ్బని చదువులు.. కాసేపు యూట్యూబ్ (YouTube)చూస్తే చాలు అడ్డదారులు ఇట్టే అలవాటైపోయాయి. వ్యూస్ కోసం ఎవరో చేసిన వీడియో  ఆ ముఠాకు నచ్చి అమలు చేశారు. అంతే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లారు.

  వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram) గుంతకల్లు మండలం కసాపురంకు చెందిన షేక్ నూర్ బాషా, ఖాజా, ఖీసీం అనే వ్యక్తులు సమీప బంధువులు. ఈ ముగ్గురు భారీగా అప్పులు చేశారు. ఆదాయం లేకపోవడం అప్పిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఈజీ మనీ సంపాదించాలని స్కెచ్ వేశారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో యూట్యూబ్ లో డబ్బులు ఎలా సంపాదించాలని వెతికారు. వెతుకుతుండగానే దొంగనోట్ల తయారీ ఐడియా వచ్చింది. అంతే “How to create Currency” అనే కీ వర్డ్ తో సెర్చ్ చేశారు.

  ఇది చదవండి: అత్తింటి వేధింపులు భరించలేని అల్లుడు.. ఫేస్ బుక్ లైవ్లో తన ఆవేదన చెప్పి ఏం చేశాడంటే..!


  అందులోని సమాచారం అధారంగా నకిలీ నోట్ల తయారీకి కావాల్సిన వస్తువులు, పరికరాలను కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అన్నీ సమకూర్చుకున్నారు. అంతా సిద్ధం చేసుకొని నోట్ల ముద్రణ మొదలుపెట్టారు. ఇలా రూ.100 నోట్లు ముద్రించి మార్కెట్లో మార్పిడి చేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో నూర్ బాషా జొన్నగిరి గ్రామం వెళ్లి నకిలీ నోటుతో చికెన్ పకోడీ కొనాలని చూశారు. ఐతే ఆ వందనోటు తేడాగా ఉండటంతో తీసుకోనని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు ఖాన్ ను తనిఖీ చేయగా దొంగనోట్లు బయటపడ్డాయి. అతడి దాదాపు 30 రూ.100 నకిలీ నోట్లు గుర్తించారు.

  ఇది చదవండి: ఈ నీచుడ్ని ఏం చేసినా తప్పులేదు..! వద్దు బాబాయ్ తప్పు అన్నా వినలేదు.. కూతురులాంటి బాలికపై..,


  వజ్రకరూర్, గుంతకల్, మద్దికెర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణీ చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. అప్పులు తీర్చేందుకే దొంగనోట్లు ముద్రించినట్లు పోలీసులకు తెలిపారు. యూట్యూబ్ లో నేర్చుకొని దొంగనోట్లు ముద్రించినట్లు వివరించరు. నకిలీ నోట్లు తయారు చేసేందుకు ఉపయోగించిన జిరాక్స్ మిషన్, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు జొన్నగిరి ఎస్సై రామాంజనేయులు తెలిపారు. ఇలాంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Currency

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు