Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అందంతో వల వేస్తుంది.. ప్రేమపేరుతో నమ్మిస్తుంది.. ఆ తర్వాత చుక్కలు చూపిస్తుంది..

అందంతో వల వేస్తుంది.. ప్రేమపేరుతో నమ్మిస్తుంది.. ఆ తర్వాత చుక్కలు చూపిస్తుంది..

సహాసిని (ఫైల్)

సహాసిని (ఫైల్)

Cheating: ఆమె టార్గెట్ పెళ్లికాని యువకులే. తన అంద చందాలతో వారికి వలవేస్తోంది. నువ్వే సర్వస్వం అంటూ ముగ్గులోకి దించుతుంది. ఆ తర్వాత...

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిథి, న్యూస్18

ఆమె టార్గెట్ పెళ్లికాని యువకులే. తన అంద చందాలతో వారికి వలవేస్తోంది. నువ్వే సర్వస్వం అంటూ ముగ్గులోకి దించుతుంది. నిన్ను తప్ప ఎవర్నీ పెళ్లి చేసుకోనని మాయలో పడేస్తోంది. అనాథనంటూ సింపతీ కూడా కొట్టేస్తుంది. గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న తర్వాత నగలు, నగదుతో ఉడాయిస్తుంది. ఆమె స్టోరీ వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. విలరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ తిరుపతిలోనే ఓ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసేవాడు. అతడికి అఖ్కడే పనిచేసే సుహాసిని పరిచయమైంది. అతడితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. నిన్ను ప్రేమిస్తున్నాని.. పెళ్లి చేసుకుంటానని సునీల్ కుమార్ ను ముగ్గులోకి దింపింది. అంతేకాదు తాను అనాథని.. నువ్వే నా సర్వస్వం అంటూ నమ్మించింది. దీంతో సుహాసినిని పూర్తిగా నమ్మిన సునీల్.. తల్లిదండ్రులను ఒప్పించిమరీ పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి సమయంలో 10 తులాల బంగారం కూడా పెట్టాడు. ఆ తర్వాత తనను పెంచి పెద్దచేసిన వారికి అత్యవసరమంటూ రూ.6 లక్షలు తీసుకుంది. కొన్నాళ్లకు భర్త, అత్తమామలు ఇచ్చిన డబ్బులు అడగ్గా.. అక్కడి నుంచి పరారైంది. దీంతో సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుహాసిని ఆధార్ కార్డ్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఆమె నిత్యపెళ్లికూతురు అని తెలుసుకున్నారు.

పోలీసుల అదుపులో సుహాసిని

ఇది చదవండి: ప్రాణ స్నేహితుడితో భార్య ఎఫైర్… ఇద్దర్నీ బెడ్ పై చూసిన భర్త ఏం చేశాడంటే...!సుహాసినికి గతంలోనే నెల్లూరుకు చెందిన మేనమామతో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. సుహాసిని గతంలో భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వినయ్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు భర్త సహకారంతోనే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పెళ్లిళ్లు చేసుకొని కాజేసిన డబ్బు, బంగారం అతడికే ఇస్తున్నట్లు గుర్తించారు. ఐతే సునీల్ తనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని తెలుసుకున్న సుహాసిని వెంటనే అతడికి కాల్ చేసి గతంలోనే తనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని చెప్పింది. దీంతో షాక్ కు గురైన అతడు జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

ఇది చదవండి: యువకుడితో వివాహిత ఎఫైర్.. సీక్రెట్ గా వీడియో తీయించిన ప్రియుడు.. ఆ తర్వాత మొదలైంది అసలు సినిమా..


ఇదిలా ఉంటే కిలాడీ లేడీ సుహాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చిత్తూరు జిల్లా పోలీసుల అదుపులో ఉంది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఆమెను రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది. యువకులు ఇలాంటి వారి మాయలో పడి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కొత్తగా పరిచయమైన వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకెళ్లాలని చెప్పారు.

ఇది చదవండి: ఆ మందు వికటిస్తే నాకు సంబంధం లేదు... ఆనందయ్య సంచలన ప్రకటన...

First published:

Tags: Andhra Pradesh, Crime news, Love cheating

ఉత్తమ కథలు