హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Plastic Eggs: కూర వండేందుకు గుడ్లు ఉడకబెట్టిన మహిళలు… కాసేపటి తర్వాత షాకింగ్ సీన్… ఏం జరిగిందంటే…!

Plastic Eggs: కూర వండేందుకు గుడ్లు ఉడకబెట్టిన మహిళలు… కాసేపటి తర్వాత షాకింగ్ సీన్… ఏం జరిగిందంటే…!

గుడ్లలోని పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాల్షియం, ప్రొటీన్ (protein) వంటివి పుష్కలంగా ఉన్న గుడ్లను మనం సాధారణంగా ఫ్రిజ్‌లో పెడతాం. ఇలా ఫ్రిజ్‌లో దాచిన గుడ్లు తింటే ఆరోగ్యం సంగతేమోకానీ అనారోగ్యం తప్పదని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. చల్లటి వాతావరణంలో ఉన్న గుడ్లను రూమ్ టెంపరేచర్ (room temperature) వద్దకు తేగానే వాటిలో బ్యాక్టీరియా పెరిగే ఆస్కారం చాలా ఎక్కువ.

గుడ్లలోని పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాల్షియం, ప్రొటీన్ (protein) వంటివి పుష్కలంగా ఉన్న గుడ్లను మనం సాధారణంగా ఫ్రిజ్‌లో పెడతాం. ఇలా ఫ్రిజ్‌లో దాచిన గుడ్లు తింటే ఆరోగ్యం సంగతేమోకానీ అనారోగ్యం తప్పదని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. చల్లటి వాతావరణంలో ఉన్న గుడ్లను రూమ్ టెంపరేచర్ (room temperature) వద్దకు తేగానే వాటిలో బ్యాక్టీరియా పెరిగే ఆస్కారం చాలా ఎక్కువ.

Adulteration: ప్రస్తుతం ఏ నిత్యావసరాలు కొందామన్నా కల్తీ భయం అందర్నీ వెంటాడుతోంది. బియ్యం నుంచి పెట్రోల్ వరకు అన్నింట్లోనూ కల్తీ మాయ కనిపిస్తోంది.

ప్రస్తుతం ఏ నిత్యావసరాలు కొందామన్నా కల్తీ భయం అందర్నీ వెంటాడుతోంది. బియ్యం నుంచి పెట్రోల్ వరకు అన్నింట్లోనూ కల్తీ మాయ కనిపిస్తోంది. ఐతే సహజ సిద్ధంగా వచ్చే పదార్ధాలు కూడా కల్తీకి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. బియ్యం, పంచదార, కారం, మసాలాలు, సగ్గుబియ్యం, గోధుమ పిండి, నూనెలు, నెయ్యి ఇలా అన్నింట్లోనూ కల్తీనే. ఇప్పుడు ఏపీలో నకిలీ కోడిగుడ్లు కలకలం రేపుతున్నాయి. అవి ప్లాస్టిక్ గుడ్లంటూ ప్రచారం సుగుతోంది. మామూలు కోడిగుడ్డుకంటే భిన్నంగా ఉండటం, ఉడకకపోవడం, పగలకపోవడంతో మహిళలు బెంబేలెత్తిపోయే పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో ప్లాస్టిక్ గుడ్ల కలకలం రేగింది. అండ్రవారిపల్లిలో ఆటోలో వచ్చిన కొందరు వ్యాపారులు 30 కోడిగుడ్లను రూ.100, 130కి విక్రయించారు. బయటి మార్కెట్లో కంటే తక్కువ ధరకు గుడ్లు వస్తుండటంతో స్థానికులు ఎగబడి కొన్నారు. ఎప్పటిలాగానే ఎగ్ కర్రీ చేసేందుకు గుడ్లను ఉడకబెట్టారు.

సాధారణంగా కోడి గుడ్డు 5 నుంచి 10 నిముషాల్లో ఉడుగుకుతుంది. కానీ ఈ గుడ్లు ఎంతసేపటికీ ఉడకకపోవడంతో అనుమానం వచ్చి చూశారు. గుడ్ల పెంకు తీసేసమయంలో విరుగుతూ రావాల్సిందిపోయి సాగుతోంది. అలాగే ఉడకని గుడ్లను నేల మీద జార విడిచినా అవి పగల్లేదు. అలాగే సాధారణ కోడి గుడ్లకు.. వారు కొన్న కోడిగుడ్లకు తేడా రావడంతో అవి ప్లాస్టిక్ కోడిగుడ్లను ప్రచారం జరుగుతోంది. గుడ్డును పగలగొట్టిన తర్వాత కూడా సొన సరిగా రాకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఉడకబెట్టిన తర్వాత తెల్లసొన నల్లగా ఉండటం, పచ్చసొన ఊదా రంగులో పిండిపిండిగా రావడాన్ని స్థానికులు గుర్తించారు. కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కోడి గుడ్లు కొనుగోలు చేశామని.., తీరా వాటితో కూరవండుతామంటే దుర్గధంతో పాటు గుడ్లు సాగడం, రంగుమారడం లాంటివి చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తమకు నకిలీ గుడ్లను అంటగట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇది చదవండి: తెలిసిన వ్యక్తేకదా అని ఇంటికి వెళ్లింది.. కానీ అతడు అలా చేస్తాడని అస్సలు ఊహించలేకపోయింది..


ఇదిలా ఉంటే ఇటీవలే నెల్లూరు జిల్లాలో ప్లాస్టిక్ రైస్ కలకలం రేగింది. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్ రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. అటు విశాఖపట్నం జిల్లాలోనూ వారం క్రితం ఇదే రకమైన ఘటన చోటు చేసుకుంది. గిరిజన సహకార సంస్థ ద్వారా ఏజెన్సీలోని గిరిజనులకు సరఫరా చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కనిపించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ప్లాస్టిక్ బియ్యం ఇస్తే తాము ఏం తినాలని ప్రశ్నించారు. గతంలో గోధుమ పిండిలోనూ ప్లాస్టిక్ దర్శనమిచ్చిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది చదవండి: భార్యను చంపబోయిన భర్త... 8 నిముషాల్లోనే కాపాడిన దిశ...


First published:

Tags: Andhra Pradesh, Eggs, Nellore Dist

ఉత్తమ కథలు