హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala Temple: వెంకన్న దర్శనానికి కరోనా ఎఫెక్ట్... మూగబోయిన తిరుమలగిరులు

Tirumala Temple: వెంకన్న దర్శనానికి కరోనా ఎఫెక్ట్... మూగబోయిన తిరుమలగిరులు

భక్తులు లేక వెలవెలబోతున్న తిరుమల ఆలయం

భక్తులు లేక వెలవెలబోతున్న తిరుమల ఆలయం

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఎఫెక్ట్ మనుషులపైనే కాదు దేవుడిపైనా పడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులు లేక బోసిపోతున్నాయి.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య 3 వేలకు చెరువుగా వస్తుండటంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో చాపక్రింద నీరులా విస్తరిస్తుండటంతో రోజురోజుకి అధిక‌ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా ప్రాణాలను సైతం‌ బలి తీసుకుంటోంది. ఇంతటి విపత్కర పరిస్ధితిలో ఏడుకొండల వెంకన్న దర్శనాల కొనసాగింపుపై టీటీడి ఆలోచనలో పడింది. టిటిడి ఉద్యోగులు సైతం కరోనా భారిన‌పడడం ఉన్నతాధికారులను, సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. భక్తుల పాలిట కల్పతరువుగా శ్రీవారు వెలసిన తిరుమల పుణ్యక్షేత్రంకు ప్రతినిత్యం‌ లక్షలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో‌ మారుమ్రోగుతుంటుంది.. ఎవరూ ఊహించని ఉపధృవం కరోనా రూపంలో ప్రపంచాని కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే..ఈ కరోనా మహామ్మారి కారణంగా టీటీడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 80రోజుల పాటు శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన టీటీడి.. అటు తరువాత కేంద్రం ఇచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనాలను పునఃప్రారంభించినా...గతంలోలా వేలాది మంది భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిని ఇవ్వకుండా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతి ఇచ్చింది.

దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడి ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నమైంది. 2020-21వ సంవత్సరానికి గాను 3,309 కోట్ల అంచనాలతో టీటీడి ప్రవేశపెట్టిన బడ్జెట్ భక్తుల దర్శనాల కుదింపుతో అంచనాలను తప్పింది. దీంతో టీటీడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2800కోట్లతో తిరిగి అంచనాల బడ్జెట్ ను రివైజ్ చేశారు అధికారులు. ఈ మహామ్మారి కారణంగా టీటీడికి రోజు వారి ఆదాయం గణనీయంగా తగ్గడంతో ఒకానొక దశలో ఉద్యోగుల జీతాభత్యాలను కూడా ఇవ్వలేక బ్యాంకులలో ఓడిలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలా గాడితప్పిన టీటీడి ఆర్ధిక వ్యవస్ధ డిసెంబర్ మాసం నుంచి పెంచిన దర్శనాల సంఖ్యతో మళ్లీ గాడిలో డింది. ఐతే స్వామి వారికి వచ్చే ఆదాయం పెరిగి ఆర్ధిక వ్యవస్ధ మళ్లీ పూర్వవైభవం వస్తుందనుకున్నవేళ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా పరిస్ధితులు పూర్తిగా తలకిందులవుతావున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నెలరోజుల వ్యవధిలోనే రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగానూ పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. పరిస్ధితులను అదుపులోకి తెచ్చేందుకు కొన్ని రాష్ట్రాలలో లాక్ డాన్ లు పెడుతుండగా.., మరి కొన్ని రాష్ట్రాలలో రాత్రి కర్ఫ్యూ, ఇంకొన్ని రాష్ట్రాలలో వారంతపు లాక్ డాన్ లు పెడుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కఠినతరం చేయడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

ఇది చదవండి: మూడు రోజులు కంప్లీట్ లాక్ డౌన్... షాపులు కూడా ఉండవు.. బీ కేర్ ఫుల్


కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న తరుణంలో టీటీడి అధికార యంత్రాంగం ఆప్రమతమైంది. ఈ వైరస్ తిరుమలలో ప్రభలకుండా టీటీడి దర్శనాల సంఖ్యను భారీగా కుదించింది. ఏప్రిల్ మెదటి వారంలో 58వేలు వున్న దర్శనాల సంఖ్యను టీటీడి క్రమంగా కుదిస్తూ ప్రస్తుతం 25వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఐతే కరోనా ఆంక్షలు కారణంగా స్వామి వారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అమాంతంగా పడిపోయింది. ప్రస్తుతం 6 నుంచి 15 వేల మంది భక్తులు మాత్రమే స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

ఇది చదవండి: ఏపీలో కరోనా చికిత్సకు కొత్త ధరలు ఇవే... ఏ ఆస్పత్రిలో ఎంతంటే...!


ఇక కర్నాటకలో రెండు వారాలు పాటు లాక్ డాన్ విధించడంతో ఆ రాష్ట్రానికి చెందిన భక్తులు వచ్చే అవకాశం లేదు. ఇక తమిళనాడు రాష్ట్రంలో ఏపి నుంచి వచ్చే వారు కచ్చితంగా ఈ పాస్ ను తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన నిభంధనను పెట్టడంతో స్వామి వారిని దర్శించుకున్నే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు రాష్ట్రంలోకెల్లా చిత్తూరు జిల్లాలోనే నిత్యం అత్యధిక కేసులు నమోదవుతుండటం., అందులోనూ తిరుపతిలో భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో తిరుపతిని నగరాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. దీంతో తిరుమలకు ముఖ ద్వారమైన తిరుపతిలో కఠిన ఆంక్షలు ఆమలులో ఉండటంతో స్వామి వారి దర్శనార్ధం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు.

ఇది చదవండి: కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్... ఇళ్లవద్దే చికిత్స


కొవిడ్ దృష్ట్యా దర్శనాల సంఖ్యను టీటీడీ కుదించడంతో శ్రీవారి రోజువారీ హూండీ ఆదాయం రూ.3కోట్ల నుంచి లక్షల్లోకి చేరుకుంది. గత నెల 24వ తేదిన 85లక్షలు, 28వ తేదీ 72 లక్షలు, 29 తేధీ 62 లక్షలు మాత్రమే శ్రీవారికి హూండి ద్వారా ఆదాయం లభించింది. మార్చి మాసంలో శ్రీవారికి రికార్డు స్ధాయిలో రూ.104 కోట్ల హూండీ ఆదాయం లభించింది. ఇక ఏప్రిల్ నెలలో ఆదాయం 100 కోట్ల మార్క్ ను చేరుకోలేకపోయింది. గత కొద్ది నెలలుగా గాడినపడుతున్న టీటీడి ఆర్ధిక వ్యవస్ధ తిరిగి గాడి తప్పేలా పరిస్ధితులు ఉత్పన్నమవుతున్నాయి.

సాధారణంగా శ్రీవారి దర్శనాల కోసం టీటీడి విడుదల ఆన్ లైన్ ద్వారా టికెట్లు విడుదల చేస్తుంది. ఆన్ లైన్లో టికెట్లు విడుదల చేసిన వెంటనే ఒకటి రెండు రోజుల్లోనే అమ్ముడవుతుంటాయి. కానీ మే నెలకు సంబంధించిన టికెట్లలో కేవలం 1వ తేదీకి సంబంధించిన టికెట్లను మాత్రమే భక్తులు బుక్ చేసుకున్నారు. మే2వ తేది నుంచి 31వ తేది వరకు సంభందించి వేల టిక్కెట్లు అలానే భక్తులకు అందుబాటులో వున్నాయి. కరోనా వ్యాప్తి భయంతో పాటు కొవిడ్ ఆంక్షల నేఫద్యంలో శ్రీవారి దర్శన టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు భక్తులు అనాసక్తి చూపుతూ తమ తిరుమల పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు.

భక్తుల రాక తగ్గడంతో శ్రీవారి ఆలయం బోసిపోతోంది. దీంతో దర్శనాలు కొనసాగించాలా లేక రద్దు చేయాలా అనే దానిపై టీటీడి యంత్రాంగం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తే టీటీడికి ప్రస్తుతం లభిస్తున్న రోజువారీ ఆదాయానికి పూర్తిగా గండిపడుతుంది. దీంతో దర్శనాలను కొనసాగించడమే మంచిదని పలువురు అప్రాయపడుతుండగా.. భక్తులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిలిపేస్తే మంచిదని మరికొందరు చెబుతున్నారు.

ఐతే టీటీడి పాలకమండలి మాత్రం ఇంత వరకు దీని పై ఎటు వంటి నిర్ణయానికి రాలేకపోతోంది. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పరిస్ధితులను అంచనా వేస్తూ దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఉద్యోగులు, భక్తులను దృష్టిలో పెట్టుకొని పరిస్ధితులు అదుపులోకి వచ్చే వరకు కొద్ది రోజుల పాటు దర్శనాలను రద్దు చేసి స్వామి వారికి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహిస్తారా? లేక పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనాలకు అనుమతిస్తారా..? అనేది దానిపై మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.

First published:

Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd news

ఉత్తమ కథలు