TIRUPATI PILGRIMS ANGRY ON TTD EMPLOYEES BEHAVIOUR AT TIRUMALA TEMPLE FULL DETAILS HERE PRN TPT
Tirumala Temple: శ్రీవారి దర్శనానికి వెళ్తే ఇన్ని కష్టాలా..? టీటీడీ సిబ్బంది తీరుపై భక్తుల ఆగ్రహం
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)
తిరుమల శ్రీవారి (Tirumala Srivaru) దర్శనానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకుని తరిస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తుండటంతో అక్కడే ఓ రోజు ఉండి స్వామివారి సేవలో పాల్గొంటారు. కానీ ప్రస్తుతం తిరుమల (Tirumala Temple) లో పరిస్థితులు మారాయి.
తిరుమల శ్రీవారి (Tirumala Srivaru) దర్శనానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకుని తరిస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తుండటంతో అక్కడే ఓ రోజు ఉండి స్వామివారి సేవలో పాల్గొంటారు. కానీ ప్రస్తుతం తిరుమల (Tirumala Temple) లో పరిస్థితులు మారాయి. గతంలోకంటే భిన్నంగా వసతి గదుల కేటాయింపు జరుగుతోంది. కొండపై పరిస్థితులు కరోనా ముందు తర్వాత అనే విధంగా ఉన్నాయి. మార్చి 2020 వరకు టిక్కెట్లు లేకుండా భక్తులను తిరుమలకు అనుమతించే వారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దర్శన టిక్కెట్లను తప్పనిసరి చేసింది టీటీడీ. కరోనా విపత్కర పరిస్థితుల్లో 83 రోజుల పటు శ్రీవారి దర్శనాలు నిలుపుదల చేసిన టీటీడీ.., జూన్ 8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభించింది. కరోనా మూడు దశలలో విజృంభించడంతో పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు ఆమూతిస్తు వచ్చింది.
కరోనా దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో 2022 ఫిబ్రవరి 20వ తేదీ నుంచి సామాన్య భక్తులకు సర్వ దర్శన టిక్కెట్లను విడుదల చేసింది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాల టిక్కెట్లను భారీగా పెంచింది. దీంతో రోజుకు 60 నుంచి 70 వేల మందికి పైగా శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. భక్తుల వసతి సౌకర్యాలను వివిధ కౌంటర్ల ద్వారా గదుల నిర్వహణ బాధ్యత చేపట్టింది టీటీడీ. సామాన్య భక్తులకు సీఆర్ఓ, టిబి కౌంటర్లల్లో కేటాయిస్తే, వీఐపీ, వీవీఐపీలకు పద్మావతి విచారణ కార్యాలయంలో గదులు కేటాయింపులు జరుగుతుంది.
వీఐపీ, వీవీఐపీల ఎక్కువ తాకిడి అధికంగా ఉండే పద్మావతి విచారణ కార్యాలయంలో ప్రోటోకాల్ పరిధిలో వ్యక్తులకు తగిన గదులను ముందుగానే కేటాయించి ఉంచుతారు. ఆ తరువాత సిఫార్సు లేఖలపై వచ్చిన భక్తులకు విఐపి కాటేజీలను కేటాయిస్తారు. అతిధి గృహాలు, వసతి గృహాలు మరమ్మత్తులు కొనసాగడంతో భక్తులకు కావాల్సిన కాటేజీల కేటాయించలేక పోతున్నారు. దీంతో గదుల కోసం గంటల తరబడి భక్తులు గదుల కేటాయింపు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్ధితి ఏర్పడితుంది. భక్తులపై కార్యాలయాల్లో ఉన్న అధికారులు ఒకలా వ్యవహరిస్తే.. వీరి క్రింది స్ధాయిలో ఉన్న సిబ్బంది భక్తుల పట్ల మరోలా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యాలయంలో నెలకొన్న పరిస్థితిని సున్నితంగా చెప్పాల్సింది పోయి వారితో దుసురుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
తాజాగా పద్మావతి విచారణ కార్యాలయంలో అతిధి గృహం కేటాయింపు కోసం సిఫార్సు లేఖతో వచ్చిన అనంతపురంకు చెందిన భక్తులు వచ్చారు. తమ కుటుంబానికి వసతి గది కేటాయించాలని భక్తులు కోరగా అందుకు గదులు ఖాళీ లేవని, కాసేపు వెయిట్ చేయాలని చెప్పారు. కొంతసమయం తర్వాత మరోసారి రూమ్ కోసం ఆఫీసుకు వచ్చారు. మరికొద్దిసేపు ఎదురుచూసిన తర్వాత ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించగా అక్కడి సిబ్బంది మరోసారి అడ్డుకోవడంతో భక్తులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిబ్బంది భక్తులను నెట్టేసి తలుపులు వేయడంతో ఓ భక్తుడు చేతి వేళ్లు నలిగిపోయాయి. అతడికి రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు సిబ్బందిపై దాడికి దిగారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. ఐతే టీటీడీ సిబ్బంది ఫిర్యాదు మేరకు భక్తులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులు, సిబ్బంది తమ పట్ల తీరుమార్చుకోవాలని భక్తులు మండిపడుతున్నారు. దేవుడి దర్శనం కోసం వస్తే సిబ్బంది నుంచి ఛీత్కారాలు ఎదుర్కోవలసి వస్తుందంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.