హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: జెర్సీ సినిమాని తలపించే స్టోరీ.. కొడుకు బర్త్ డే డ్రెస్ కోసం పనిలోకి వెళ్లిన తండ్రి.. కానీ అంతలోనే విషాదం

Andhra Pradesh: జెర్సీ సినిమాని తలపించే స్టోరీ.. కొడుకు బర్త్ డే డ్రెస్ కోసం పనిలోకి వెళ్లిన తండ్రి.. కానీ అంతలోనే విషాదం

కుటుంబంతో మలిరెడ్డి

కుటుంబంతో మలిరెడ్డి

కొడుకు పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనాలని భావించిన ఆ పేద తండ్రిని మృత్యువు కాటేసింది. కుటుంబాన్ని ఒంటరిని చేసింది.

  కరోనా కల్లోలం మానవాళి మనుగడనే ప్రశ్నర్థకంగా మార్చివేసింది. ఈ మహమ్మారి ప్రభావం పేద మధ్యతరగతి ప్రజలపైనే ఎక్కువగా పడింది. కరోనా భయం కంటే.. వైరస్ వల్ల వచ్చిన ఆర్ధిక కష్టాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ -19 విజృంభిస్తున్నందున ప్రభుత్వం రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ విధించింది. దీంతో రోజువారి కూలీల జీవనం దుర్భరంగా మారింది. రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు నాలుగు మెతుకుస కోసం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో బ్రతుకుదెరువు కోసం బయటకి రావాల్సి వస్తోంది. ఇక కలియుగ వైకుంఠం తిరుమలకు నిత్యం వచ్చే వేలాది మంది భక్తులను నమ్ముకొని దుకాణదారులు, కూలీలు జీవనం సాగిస్తుంటారు. భక్తుల ద్వారా వచ్చే ఆదాయమే వారికి జీవనోపాధి. పేదవాడైన ఓ ఫోటోగ్రాఫర్ తిరుమలను నమ్ముకొని కొన్నేళ్లుగా జీవినం సాగిస్తున్నాడు. నాలుగు ఫోటోలు తీసి కుమారుడికి పుట్టినరోజుకు డబ్బులు సంపాదించాలని భావించాడు.. కానీ అనుకోని రీతిలో అగ్నికి ఆహుతయ్యాడు.

  వివరాల్లోకి వెళ్తే.. తిరుచానూరుకు చెందిన ఫోటోగ్రాఫర్ మలిరెడ్డికి, భార్య శోభ ఇద్దరు పిల్లలు ఉన్నారు. తిరుమలలోని అఖిలాండం వద్ద ఎరైనా భక్తులు అడిగితే ఫోటోలు తీసి ఒక్కో ఫోటోకు వంద రూపాయలు వసూలు చేస్తుంటాడు. అందులో మలిరెడ్డికి దక్కేది యాభం రూపాయలు మాత్రమే. అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని పాషిస్తున్నాడు. ఇంతలో కరోనా ప్రభావంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. ఆదాయ మార్గం లేకపోవడంతో చిన్నాచితకా పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంతలో కుమారుడి పుట్టిన రోజు వచ్చింది. దీంతో తిరుమలకు వెళ్లి కొన్ని ఫొటోలు తీస్తే ఎంతో కొంత వస్తుందని.. కొడుకు పుట్టినరోజు చేయడంతో పాటు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనవచ్చు అనుకున్నాడు.

  ఇది చదవండి: కదిలే ట్రైన్ నుంచి దూకేసిన మహిళ.. ప్రాణాలకు తెగించిన కాపాడిన కానిస్టేబుల్..


  ఇదే మాటను భార్య శోభకు చెప్పి సోమవారం రాత్రి తిరుమలకు వచ్చాడు. ఆస్థానమండపంలోని ఫొటోలు ప్రింట్ తీసే దుకాణంలో పడుకున్నాడు. కానీ ఏం జరిగిందే ఏమో తెలియదుగానీ.. దుకాణంలో మంటలు చెలరేగి సజీవదహన మయ్యాడు. కరోనా ఉందని జాగ్రత్తలు చెప్పిపంపిన భార్యకు, త్వరగా రా నాన్న అంటూ పంపిన పిల్లలకు తీవ్ర శోకాన్ని మిగిల్చి వెళ్ళాడు.

   ఇది చదవండి: సర్జరీ తర్వాత స్టైల్ మార్చిన ఎమ్మెల్యే రోజా... దూసుకుపోతున్న ఫైర్ బ్రాండ్


  అయితే మలిరెడ్డి మృతి పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మలిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం 6.15 నిముషాల వరకు మల్లిరెడ్డి మేలుకువగానే ఉన్నాడని గుర్తించిన పోలీసులు ఉ 6.30 గంటలకు ప్రారంభమైన అగ్నిప్రమాదంలో ఎలా చిక్కుకుంటాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక సమస్యల వల్లే మల్లిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఐతే ఇన్నాళ్లూ ఇంటిదగ్గరే ఉన్న మల్లిరెడ్డి.. కొడుక్కి కొత్తబట్టలు కొనివ్వాలన్న ఆశతో తిరుమలకు వచ్చి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబం రోడ్డుపాలైంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Fire Accident, Tirumala, Tirupati

  ఉత్తమ కథలు