TIRUPATI PETROL PRICE TOUCHES NEW RECORD IN KUPPAM TOWN OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Petrol Price: ఏపీలో రికార్డుస్థాయిలో పెట్రోల్ ధర.. ఆ ఒక్క ప్రాంతంలోనే ఎందుకు..?
ప్రతీకాత్మకచిత్రం
Petrol price in AP: పెట్రోల్ నిత్యావసరాల్లో ఒకటి. ఈరోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా బైకో, కారో వెసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇంధన ధరలు పెరిగితే నిత్య అవసర ధరలు కూడా అమాంతం పెరిగిపోతాయి.
పెట్రోల్ నిత్యావసరాల్లో ఒకటి. ఈరోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా బైకో, కారో వెసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇంధన ధరలు పెరిగితే నిత్య అవసర ధరలు కూడా అమాంతం పెరిగిపోతాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయి. ఇలాగే కొన్నాళ్లు కొనసాగితే లీటర్ పెట్రోల్ రూ.150కి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్రోల్ బాదుడు మాత్రం సామాన్య ప్రజలపై పెను భారాన్నే మోపుతోంది. రోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చూసి సామాన్యుడు తల్లడిల్లి పోతున్నారు. పెట్రోల్ ధరలతో కాలం మళ్లీ 20 ఏళ్ళు వెనక్కు వెళ్లేలా ఉంది. పెట్రోభాగం మోయలేక సైకిల్ వినియోగిస్తే మంచిదని సామాన్యుడు భావిస్తున్నాడు. అయితే రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటె చిత్తూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మాత్రం పెట్రోల్ రాష్ట్రంలోనే అత్యధిక ధర పలుకుతోంది.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పెట్రోల్ కు రెక్కలు వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనంత పెట్రోల్ ధరలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.110కి చేరింది. రాష్ట్రంలోనే ఇది అత్యధికం. రాష్ట్ర రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.93 ఉంటే విశాఖపట్టణం రూ.106.5 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక తిరుపతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.63 ఉంటే కుప్పంలో మాత్రం రికార్డుస్థాయిలో రూ.110 రూపాయలకు రెండు రోజుల క్రితం పెట్రోల్ ధర పెరిగిపోయింది. శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.97 ఉండగా..., ఆదివారం రూ.109.56లకు విక్రయిస్తున్నారు. దీంతో కుప్పం ప్రజలకు పెట్రోల్ బాదుడు పెనుభారంగా మారుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వస్తున్న వాహనాలు కూడా పెద్దగా మైలేజి ఇవ్వకపోవడంతో సంపాదనలో సగం భాగం పెట్రోల్ ఖర్చులకే సరిపోతోందని వాపోతున్నారు స్థానికులు. పెద్ద సిటీలో కూడా తక్కువ ఉన్న పెట్రోల్ ఇక్కడ మాత్రం ఎక్కువ ఉండటం గమనార్హం.
అయితే దేశంలో చూస్తుండగానే పెట్రోల్ ధరలు 100 రూపాయలు దాటిపోయాయి. ధరలు నియంత్రణ లేక రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర నిత్యావసర వస్తువులు దేశం మొత్తం ఓకేలాగా ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ప్రాంతాల వారిగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉంటోంది . ఇందుకు ప్రధాన కారణం రవాణా. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిత్యావసర వస్తువుల నుంచి పెట్రోల్ వరకు రవాణా ఖర్చులు కూడా వేస్తుంటారు. పెట్రోల్ ప్లాంట్ నుంచి కుప్పంకు అధిక దూరం ఉండటంతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కుప్పంలో పెట్రోల్ ధరలు ఉంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.