Home /News /andhra-pradesh /

TIRUPATI OXYGEN CRISIS WORRYING ANDHRA PRADESH AS TAMILNADU GOVERNMENT ISSUES RESTRICTIONS OVER OXYGEN TRANSPORTATION TO OTHER STATES FULL DETAILS HERE PRN TPT

Oxygen Crisis: ఏపీలో ఆక్సిజన్ కొరత తప్పదా.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంతో మరిన్ని చిక్కులు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఆక్సిజన్ కొరత (Oxygen Crisis) ప్రమాదం పొంచిపంది. ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాపై తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu Government) ఆంక్షలు విధించింది.

    ప్రాణాంతక మహమ్మారి మొదటి వేవ్ కన్నా రెండవ వేవ్ లో తీవ్ర ప్రభావం చూపుతోంది. కోవిడ్ బారిన పడినవారిలో కొందరు మాత్రమే హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. 70 శాతం మేర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కరోనా సోకినా వ్యక్తుల్లో ఆక్సిజన్ శాచురేషన్ తగ్గుముఖం పడుతుండటంతో ఆక్సిజన్ బెడ్ల అవసరం మరింత పెరుగుతోంది. చికిత్సలో ఉన్నన్ని రోజులు ఆక్సిజన్ ఉంటేనే ప్రాణంతో బయకు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. సరైన సమయానికి ఆక్సిజన్ అందకుంటే కరోనా బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ప్రమాదముంది. కొవిడ్ కేసుల తీవ్రత వల్ల ప్రాణవాయువు అవసరం పెరిగింది. చిత్తూరు జిల్లాలోని పలు ఆసుపత్రులకు ఆక్సిజన్ తమిళనాడులోని సంస్థలు సరఫరా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ సజావుగా ప్రాణవాయువు సరఫరా సాగుతూ వచ్చింది. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఆక్సిజన్ సమస్య తలెత్తింది. ఇప్పటికే రుయాలో ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా స్విమ్స్ సరఫరా చేసే కోటాలో కోత విధించా లని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    అక్కడి సంస్థలు ప్రస్తుతం స్విమ్స్ అవసరాలకనుగుణంగా ప్రతిరోజు 14 కేఎల్ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ మొత్తాన్ని 8కేఎల్ కు తగ్గిస్తామని ఆక్సిజన్ సరఫరా చేసే గుత్తేదారులు తెలిపారు. ఇలా అయితే కొవిడ్ బాధితులపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులంటున్నారు. వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

    ఇది చదవండి: రఘురామకృష్ణం రాజుకు హైకోర్టు షాక్... రాజుగారికి ఏదీ కలిసి రావడం లేదుగా..


    తిరుపతిలోని స్విమ్స్ కొవిడ్ రోగుల కోసం 715 పడకలు ఉండగా అందులో 145 ఐసీయూ, 328 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ సుమారు 22కేఎల్ సామర్థ్యంతో రెండు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం గత 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్ వాటర్ సంస్థ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. కొవిడ్ పరిస్థితులకు ముందు వారానికి మూడుసార్లు సదరు సంస్థ 8కేఎల్ తెచ్చేది. ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 14కేఎల్ అవసరం ఉంటోంది. రెండు దఫాలుగా 14కేఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ను తీసుకువచ్చి గుత్తేదారులు ట్యాంకర్ ద్వారా స్విమ్స్ కు తరలించి అక్కడ అమర్చిన సెంట్రల్ ఆక్సిజన్ ట్యాంక్స్ లో నింపుతుంటారు. వాస్తవానికి చెన్నైలోని సంస్థతో ఒప్పందం కుదిర్చుకున్నారు స్విమ్స్ అధికారులు. కానీ ఆ సంస్థ బళ్లారి నుంచి చెన్నైకు ఆక్సిజన్ తరలించి అక్కడి నుంచి తిరిగి స్విమ్స్ కు సరఫరా చేస్తున్నారు.

    ఇది చదవండి: టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.., మంత్రి ఏమన్నారంటే..


    ఇప్పటి వరకు అంతా సజావుగా జరుగుతుండగా..శుక్రవారం స్విమ్స్ అధికారులకు సరఫరా సంస్థ నుంచి ఈ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపారు. ఆక్సిజన్ సరఫరాపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షల అమలు చేస్తోందని ఆ ఈ మెయిల్ లో పేర్కొన్నారు. తమిళనాట ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ..., ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న ఆక్సిజన్ పై ఆంక్షలు విధించాలని ఆదేశాలు జారీ చేసారని.., అక్కడి ప్రభుత్వం ఆదేశానుసారం 8కేఎల్ ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేసేందుకు అనుమతించిందని మిగిలిన ఆక్సిజన్ ను స్థానిక అవసరాలకు ఇవ్వాల్సిందిగా స్పష్టం చేసినట్లు సంస్థ ప్రతినిధులు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు.

    ఇది చదవండి: అక్కడ ఫోన్ సిగ్నల్ ఉంటే అతడు బ్రతికుండేవాడు... ఆ కష్టం ఎవరికీ రాకూడదు..


    వెంటనే ఆమె సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ సరఫరాలో కోత విధించడం సరికాదని విజ్ఞప్తి చేశారు. సమాచారాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ హరినారాయణన్, అటు రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ నోడల్ అధికారి కెఎస్ జవహర్రెడ్డికి తెలియజేశారు. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అటు తమిళనాడుతో చర్చలు జరిపితే తప్ప పరిష్కారం కాదన్న నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అక్కడి ప్రభుత్వం రోజుకు కేవలం 8కేఎల్ సరఫరా చేసేందుకే మొగ్గు చూపితే స్విమ్స్ ఆక్సిజన్ సమస్య తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

    తమిళనాడు ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజుకు కేవలం రికేఎల్ ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేస్తామని అక్కడి సంస్థ తెలిపిందని వెంగమ్మ.., ఇది తమకు ఏ మాత్రం సరిపోదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేసారు. ప్రభుత్వం కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఉన్నతాధికారులు చెప్పారని అన్నారు. ప్రస్తుతం ఉన్న రెండు ట్యాంకులకు అదనంగా మరొకటి ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించిన స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ.., దానికి లిక్విడ్ ఆక్సిజన్ అవసరం ఉందని, సరఫరా ఆగితే చాల కష్టమని పేర్కొన్నారు
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Corona, Oxygen, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు