Traffic Constable: పోలీసులంటే సామాన్య ప్రజలకు అండగా ఉండాలి. ఇక ట్రాఫిక్ పోలీసు (Traffic Police) లైతే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో విధి నిర్వహణలో ఉంటూ.. ట్రాఫిక్ (Traffic) కి అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. ఎవరైనా అంతరాయం కలిగిస్తే.. వారిని మందలించాలి.. లేదా వారికి తగిన జరిమానాలు వేసి.. బుద్ది వచ్చేలా చేయాలి. కానీ కొంతమంది హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులంటేనే చాల మందికి భయం వేస్తుంది. కంప్లైంట్ చేయాలన్న పోలీస్ స్టేషన్ (Police Station) కు వెళ్లేందుకు భయపడుతుంటారు. అందుకు కొందరు ఖాకీల నిర్వాకమే కారణం. ఆ కొందరి ప్రవర్తన పోలీస్ శాఖకు మచ్చ తెస్తోంది. తాజాగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువుత్తుతున్నాయి.
ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తుందన్న కారణంతో వృద్ధ డ్రైవర్ పై దాష్టికానికి దిగాడు. మత్తులో ఉన్నాడు.. ఆపై వృద్ధుడి (Old man) ని కూడా చూడకుండా షూ వేసుకున్న కళ్ళతో పదే పదే తన్నాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ యువకుడు మొబైల్ ద్వారా చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మొబైల్ లో తీసిన వీడియో ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ అవుతూ. సామజిక మాధ్యమాలలో (Social Media) వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఆ కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు ఉన్నతాధికారులు.
ఇంతకీ ఘటన ఎక్కడ జరిగిందంటే? తిరుపతి (Tirupati) లో కిషోర్ నాయుడు (Kishore Naidu) అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు.. మద్యం మత్తులో ఉన్న ఒక వృద్ధుడిపై ప్రతాపం చూపించాడు.. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నాడన్న కారణంతో ఇష్టం వచ్చినట్లు పదే పదే విచక్షణ రహితంగా కాళ్లతో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు. నిన్న సాయంత్రం అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో సిమెంట్ లోడ్ తో ఓ లారీ వచ్చింది.. ట్రాఫీక్ కు అంతరాయం కలుగుతుందని, లారీని అక్కడ నుంచి తీయాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పాడు. అయితే ఎలాంటి ఇబ్బందిలేదని లారీలో వచ్చిన ఓ వ్యక్తి పోలీసుతో వాగ్వాదంకు దిగ్గాడు.. దీంతో ఇద్దరూ ఒకరిని ఒకరూ తోసుకున్నారు.
ఇదీ చదవండి : జనసేన పొత్తు ఆ పార్టీతోనేనా..? క్లారిటీ వచ్చినట్టేనా..? మరి గందరగోళం ఎందుకు?
ఆగ్రహించిన కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కాలితో తన్నుతూ దురుసుతనంగా ప్రవర్తించిన ఘటన ప్రక్కనే ఉన్న కొందరూ వీడియో తీసి సోషియల్ మీడియాలో పోస్టు చేశారు.. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తే అవసరమైతే అందుకు తగ్గట్టు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.. మరీ అవసరమైతే సమీపంలోని బ్లూ కోర్ట్స్ సిబ్బందిని పిలిచి అరెస్టు చేయొచ్చు.. అంతే తప్పా ప్రజలపైన నేరుగా దాడికి దిగడం, అది కూడా విచక్షణ మరచి ఇంత దారుణంగా వ్యవహరించడం ఎంత వరకు కరెక్టో పోలీసులే ఆలోచించుకోవాలి.
ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఉన్నతాధికారులు ఉపన్యాసాలు ఒకవైపు ఇస్తుంటే మరోవైపు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనపై స్పందించి తిరుపతి ట్రాఫిక్ డిఎస్పి కిషోర్ పై శాఖా పరమైన చర్యలకు సిద్దం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిషోర్ ను సస్పెండ్ చేసేందుకు పోలీసు శాఖా సిద్ద పడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chitoor, Tirupati