GT Hemanth Kumar, Tirupathi, News18
పేదలకు సంక్షేమ పథకాలు (AP Welfare Scheme) అందించడంలో తనకు తానే సాటి అని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఇప్పటికే నిరూపించుకున్నారు. అయితే కేవలం సంక్షేమ పథకాలు అమలు చేసి.. పేద వర్గాలను ఆదుకోవమే కాదు.. ఎవరైనా సాయం అంటూ వస్తే చాలు.. తన చేతికి ఎముక లేదని నిరూపిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన సాయానికి ఓ చిన్నారి తల్లిదండ్రులు ఏం చేశారో చూడండి.. అసలు ఏం జరిగింది అంటే..? పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) .. అచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు., నాగలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు., కుమార్తె ఉన్నారు. అయితే ఆ పాపకు అంతుచిక్కని వ్యాధి ప్రబలి అనారోగ్య పాలైంది.
ఆ వ్యాధి నయం కావాలంటే.. కోటి రూపాయలపైనే ఖర్చు అవుతుందని.. లేదంటే క్షేమంగా ఉండడం కష్టమే అని వైద్యులు తేల్చి చెప్పేశారు. దీంతో ఎటూ దిక్కు తోచని పరిస్థితికి వెళ్లిపోయారు ఆ తల్లిదండ్రులు. తమ ప్రాణానికి ప్రాణం అనుకుంటున్న చిన్నారిని ఎలా కాపాడుకోవాలో తెలియక కన్నీరు పెట్టుకున్నారు.
ఊహించని సాయం సీఎం రూపంలో వస్తుందని వారు ఊహించి ఉండరు.. కానీ గత జులై మాసంలో సీఎం జగన్.. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అదే సమయంలో దంపతులిద్దరూ.. సీఎం దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసారు. కానీ సీఎం కాన్వాయ్ కదలి వెళుతోంది. అయితే అక్కడ నిస్సహాయ స్థితుల్లో ఉన్న వీరిని చూసిన సీఎం.. జగన్ మోహన్ రెడ్డి.. కాన్వాయ్ ఆపి వారి దగ్గరకు వెళ్లి.. సమస్య ఏంటి అని అడిగారు..
ఇదీ చదవండి : వచ్చే నెల 5న ఢిల్లీకి చంద్రబాబు . కేంద్ర మంత్రి నుంచి ఆహ్వానం.. ఎందుకంటే..?
వారి సమస్య తెలిసిన వెంటనే చలించిపోయారు.. వెంటనే ఆ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందని ఆరా తీశారు. కోటిపైనే ఖర్చవుతుందని వారు చెప్పడంతో.. నేను విన్నాను నేను ఉన్నాను అంటూ హామీ ఇచ్చి సీఎం వారికి భరోసా కల్పించారు. దీనికి తోడు ఈ విషయాన్నీ ఏపీ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణ రెడ్డినే స్వయంగా చూసుకోమని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ఓఎస్డీ ప్రత్యేక చొరవ చూపి వైద్యానికి అయ్యే నగదును విడుదల అయ్యేలా చేశారు.
అయితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దయ చూపమని కోరితే... సీఎం జగన్ రూపంలో తమను కరుణించారని కృతజ్ఞతలు వ్యక్తం చేశారు ఆ తల్లి దండ్రులు.. అలాగే సీఎం జగన్ అమలు చేసిన జిల్లాల విభజన తమకు మరింత మేలు చేసిందని.. లేకుంటే తాము కాకినాడ వెళ్లాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు. సీఎం రూపంలో తమ కోరిక నెరవేరి.. చిన్నారి క్షేమంగా ఉండడంతో.. వారు మొక్కుకున్న ప్రకారం.. వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ తిరుమలకు చేరుకున్నారు.
ఇదీ చదవండి : వరుస వివాదాల్లో కాణిపాకం దేవస్థానం.. తాజాగా శివాలయంఫై ముదిరిన వివాదం
థాంక్యూ సీఎం సార్ అంటూ తమ మొక్కులు చెల్లించుకోవడానికి శ్రీవారి వద్దకు పాదయాత్రగా వచ్చారు.. సీఎం జగన్ దేవుడి రూపంలో వచ్చి.. తమ బిడ్డకు ప్రాణాలు ఇచ్చారని.. ఆయన మేలు ఎప్పటికీ మరిచిపోలేం అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Tirumala